pilots safe
-
కూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం.. పైలట్లకు గాయాలు
సాక్షి, బెంగళూరు: భారత వైమానిక దళాని (ఐఏఎఫ్)కి చెందిన విమానం కుప్పకూలిన ఘట నలో ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. కర్ణాటకలోని చామరాజనగర జిల్లా భోగాపుర వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. వింగ్ కమాండర్ తేజ్‌పాల్, కో పైలట్ భూమిక బెంగళూరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి సూర్యకిరణ్ రకం చిన్న శిక్షణ విమానంలో బయలుదేరారు. తిరిగి వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తి విమానం కుప్పకూలింది. ఇంధనం అంటుకుని కాలిపోయింది. తేజ్‌పాల్, భూమిక ప్యారాచూట్ల సాయంతో దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తేజ్‌పాల్ వెన్నెముకకు గాయమైంది. విమానం బహిరంగ ప్రదేశంలో కూలడంతో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. సంఘటన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం బెళగావి జిల్లా సాంబ్రా ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన రెడ్‌బర్డ్ శిక్షణ విమానం వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అందులోని ఇద్దరు పైలట్లు గాయాలతో బయటపడ్డారు. -
జెట్ నుంచి ఎజెక్ట్ అయితే.. ఎట్లుంటదో తెలుసా ?
అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు జెట్ విమానాల నుంచి దూకాల్సి వస్తుంది. అలా దూకడం అంత సులువేం కాదు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. అలా దూకిన తర్వాత గాయాలపాలైన పైలట్లు కొన్ని సంవత్సరాల వరకు ఏ విమానాన్ని కూడా నడపలేరు. విమానం నుంచి సడన్‌గా సీటు విడిపోవడంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది. దూకే సమయంలో సాధారణ గురుత్వాకర్షణ శక్తి కన్నా 14 నుంచి 16 రెట్లు ఎక్కువగా సీటుపై శక్తి పనిచేస్తుంది. గాలి వేగంగా ఉన్న సమయంలో జెట్ నుంచి దూకడం వల్ల చేతులు విరుగుతుంటాయి. భుజం ఎముకకు గాయాలు అవుతుంటాయి. కాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే అవకాశ ఉంటుంది. మంటలు రావడంతో శరీరం కాలిపోయే ప్రమాదం ఉంది. -
కుప్పకూలిన సుఖోయ్-30 విమానం
రాజస్థాన్ : సుఖోయ్-30 విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్ ప్రాణాలతో సురక్షితంగా తప్పించుకున్నారు. రాజస్థాన్ బర్మర్ జిల్లా శివకర్ కుద్లా గ్రామం వద్ద బుధవారం విమానం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఈ విమానాన్ని ఉత్తర్లాయి ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ చేస్తుండగా, ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయపడిన ధుర రామ్ ఆయన భార్య, మనవడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. పైలట్లు క్షేమం
గువహటి: భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం అసోంలో కూలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నాగవోన్ జిల్లాలో సుఖోయ్-30ఎంకేఐ జెట్ కూలింది. ఇందులో ఉన్న ఇద్దరు పైలట్లు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు.