pipeline project
-
ఏలేశ్వరం–విశాఖ నీళ్ల పైప్‌లైన్‌కు డ్రోన్ సర్వే
సాక్షి, అమరావతి: కార్యనిర్వాహక రాజధాని విశాఖకు తాగునీరు అందించడానికి చేపట్టిన ఏలేశ్వరం–విశాఖ పైప్‌లైన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అడుగు ముందుకుపడింది. ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారీలో భాగంగా డ్రోన్ సర్వేకి సన్నాహాలు మొదలయ్యాయి. ఏలేశ్వరం నుంచి విశాఖకు సుమారు 130 కిలోమీటర్లు పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో మూడు నదుల్లోంచి పైప్‌లైన్ నిర్మించాల్సి ఉండటం అత్యంత కీలకమైన అంశం. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కాంట్రాక్టును దక్కించుకున్న వ్యాప్కోస్ డ్రోన్ సర్వే బాధ్యతను ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌కు అప్పగించింది. సర్వేకు సంబంధించిన సామగ్రి ఏలేశ్వరం చేరుకుందని, సర్వే కోసం ప్రాథమిక పనులు జరుగుతున్నాయని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సీఈవో రవీంద్రరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రోజుకు పది కిలోమీటర్ల చొప్పున 15 రోజుల్లో డ్రోన్ సర్వే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2050 వరకు తాగునీటి కొరత లేకుండా వచ్చే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని విశాఖ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఏలేశ్వరం నుంచి విశాఖకు 130 కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పైపులైను ద్వారా రోజుకు 300 క్యూసెక్కుల నీటిని విశాఖకు తరలిస్తారు. తొలుత పోలవరం నుంచి ఈ పైప్‌లైన్ నిర్మించాలని భావించినా ప్రాజెక్టు వ్యయం తగ్గించేందుకు ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి చేపట్టాలని సీఎం సూచించిన సంగతి తెలిసిందే. పోలవరం నుంచి విశాఖకు 180 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణానికి రూ.4,500 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు ఏలేశ్వరం నుంచి చేపట్టడం ద్వారా 50 కిలోమీటర్లు తగ్గడంతో నిర్మాణ వ్యయం రూ.1,000 కోట్లు తగ్గుతుందని లెక్కించారు. కాలువల ద్వారా నీటిని తరలిస్తే ఆవిరైపోవడం, ఆ నీటిని ఇతర అవసరాలకు కూడా వినియోగించే అవకాశం ఉండటంతో కేవలం తాగునీటి అవసరాల కోసం ప్రత్యేకంగా పైప్‌లైన్ ద్వారా గోదావరి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌కు అప్పగించింది. -
ఐవోసీ పైప్‌లైన్ ఆస్తుల విక్రయం!
న్యూఢిల్లీ: ముడిచమురు, పెట్రోలియం ప్రొడక్టుల పైప్లైన్లలో ఒకటి లేదా రెండింటిలో మైనారిటీ వాటాను విక్రయించే వీలున్నట్లు పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఫైనాన్స్ డైరెక్టర్ సందీప్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. అయితే నియంత్రిత వాటాను విక్రయించబోమని స్పష్టం చేశారు. ఆస్తుల విక్రయానికి ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)ను ఒక మార్గంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. పైప్‌లైన్ మానిటైజేషన్ చేపట్టినప్పటికీ నిర్వాహక కంపెనీగా కొనసాగనున్నట్లు వివరించారు. ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజాలు ఐవోసీ, గెయిల్ ఇండియా, హెచ్‌పీసీఎల్‌కు చెందిన పైప్‌లైన్ ప్రాజెక్టులలో వాటాల విక్రయానికి తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన విషయం విదితమే. తమకుగల భారీ పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు పలు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు గుప్తా చెప్పారు. వెరసి కంపెనీ ఆస్తులకు తగిన విలువ లభించగలదని అభిప్రాయపడ్డారు. ఐవోసీ 14,600 కిలోమీటర్లకుపైగా పైప్లైన్లను కలిగి ఉంది. తద్వారా ముడిచమురును రిఫైనరీలు, ఇంధనంగా వినియోగించే కంపెనీలకు రవాణా చేస్తుంటుంది. కంపెనీ నిర్వహణలో ఇవి కీలకంకావడంతో మైనారిటీ వాటాలు మాత్రమే విక్రయించనున్నట్లు గుప్తా తెలియజేశారు. -
మూడురోజులకోసారే
ఔరంగాబాద్: తాగునీరు దొరక్క పట్టణవాసులు నానాతంటాలు పడుతున్నారు. ఇందుకు కారణం జయక్వాడి జలాశయం నుంచి చేపట్టిన సమాంతర పైప్‌లైన్ ప్రాజెక్టు సాంకేతిక అవరోధాల కారణంగా నిలిచిపోవడమే. దీంతో ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) మూడురోజులకోసారి పట్టణవాసులకు నీటిని సరఫరా చేస్తోంది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ)లో ఈ ప్రాజెక్టు పనులను ఏఎంసీ ఓ ప్రైవేటు సంస్థకు కార్పొరేషన్ అప్పగించింది. జయక్వాడి జలాశయంలోని నీటిని ఈ పైప్లైన్లద్వారా పట్టణవాసులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకు సంబంధించిన పనులు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభమయ్యాయి. దాదాపు పది రోజులపాటు పనులు నిర్వహించిన సదరు ప్రైవేటు సంస్థ ఆ తర్వాత నిలిపివేసింది. ఈ ఏడాది వర్షాకాలంలో వానలు ఆశించినరీతిలోనేపడ్డాయి. దీంతోజయక్వాడి జలాశయంలో నీటిమట్టం బాగా పెరిగింది. అయినప్పటికీ నీటి నిర్వహణ విషయంలో ఏఎంసీ విఫలమవడంపై స్థానికులు మండిపడుతున్నారు. వాస్తవానికి జయక్వాడి జలాశయంలో నీటిమట్టం ఈ ప్రాంత ప్రజల తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చగలుగుతుంది. అయినప్పటికీ నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. ఈ విషయమై హేమంత్శుక్లా అనే స్థానికుడు మాట్లాడుతూ కార్పొరేషన్ నీటి నిర్వహణలో విఫలమైందన్నాడు. తమ అవసరాలకు సరిపడా నీటిని సరఫరా చేయలేకపోతోందన్నాడు. ఇదే విషయమై కార్పొరేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ వివిధ పంపింగ్ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ జయక్వాడి జలాశయం నుంచి 140 మిలియన్ లీటర్ల నీటిని పట్టణవాసులకు సరఫరా చేస్తున్నామన్నారు. సమాంతర పైప్‌లైన్ ప్రాజెక్టు పనులు పూర్తయితే పట్టణవాసుల అవసరాలకు సరిపడా నీటిని సరఫరా చేయగలుగుతామన్నారు. కాగా జయక్వాడి జలాశయంలో దాదాపు 637 మిలియన్ మెట్రిక్ క్యూబ్‌ల నీరు ఉంది. అయితే నగరవాసులకు రోజుకు 45 మిలియన్ మెట్రిక్ క్యూబ్‌ల నీటిని సరఫరా చేయగలిగితే వారి కనీస అవసరాలు తీరతాయి. ఔరంగాబాద్ పట్టణవాసుల అవసరాలకు సరిపడా నీరు సరఫరా కాకపోవడానికి కారణం కార్పొరేషన్ అధికారుల వైఫల్యమేనని కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (సీఏడీఏ) అధికారి ఒకరు ఆరోపించారు. ఆవిరి నష్టం కింద 228 మిలియన్ మెట్రిక్ క్యూబ్‌ల నీరు గాలిలో కలసిపోయిందన్నారు. ఇంక పారిశ్రామిక అవసరాల కోసం కార్పొరేషన్ 105 మిలియన్ మెట్రిక్ క్యూబ్‌ల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఇదంతాపోగా కూడా పట్టణవాసుల అవసరాలకు సరిపడా నీరు ఈ జలాశయంలో ఉందన్నారు. వినియోగదారులు క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్నప్పటికీ వారి అవసరాలకు సరిపడా నీరు అందడం లేదన్నారు. వివక్ష చూపుతున్నారు నీటి సరఫరా విషయంలో కార్పొరేషన్ అధికారులు వివక్ష ప్రదర్శిస్తున్నారని పట్టణంలోని దేవనగ్రి ప్రాంతనివాసి అశోక్ బర్డే ఆరోపించారు. కొన్ని ప్రాంతాలకు బాగానే సరఫరా చేస్తున్నారని, మరికొన్ని ప్రాంతాలకు వారానికి కేవలం ఒక్కరోజు మాత్రమే అందుతున్నాయన్నారు. చర్చించిన మంత్రులు నీటి సమస్యపై ముంబైలో గురువారం మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో ప్రస్తుత నీటిమట్టం వివరాలను సమగ్రంగా విశ్లేషించారు. ఈ నెల 15వ తేదీన మరోసారి వారంతా సమావేశమవనున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఖరీఫ్ పంట కోసం ఏయే జలాశయాలనుంచి ఎంత మొత్తంలో నీటిని విడుదల చేయాలనే అంశంపై వారంతా ఓ నిర్ణయానికొచ్చే అవకాశముంది. కాగా మరాఠ్వాడా ప్రాంతంలో మొత్తం వ్యవసాయ భూమి పరిమాణం 1.87 లక్షలు. ఈ ప్రాంతంలో ప్రధానంగా పత్తి, సోయాబీన్ పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. ఇదిలాఉంటే మరాఠ్వాడాకు ఎగువ ప్రాంతాలైన అహ ్మద్నగర్, నాసిక్ జిల్లాల్లోని అన్ని జలాశయాల్లో కలిపి మొత్తం 72 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల (ఎంసీటీ) నీరు ఉంది. మరాఠ్వాడాకు ఎగువ ప్రాంతంలో మొత్తం 16 జలాశయాలు ఉండగా అందులో 11 జలాశయాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో ఎగువ ప్రాంత వాసులకు ఎటువంటి నీటి ఇబ్బందులు తలెత్తడం లేదు.