స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం
గల్ఫ్ మృతదేహం, గోదూర్, పిప్పెరవేని రాజు
gulf, deadbody, pipparavena raju
ఇబ్రహీంపట్నం : మండలంలోని గోదూర్ గ్రామానికి చెందిన పిప్పెరవేని రాజు(31) దుబాయ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా మతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తెప్పించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ కాయితీ లావణ్య, ఉపసర్పంచ్ రవితేజ, ఎంపీటీసీ చల్ల పద్మ ఓదార్చారు. మతుడికి భార్య సరిత, పెద్ద కూతురు నందనశ్రీ, చిన్న కూతురు నిఖిల ఉన్నారు. ప్రభుత్వం ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని వారు కోరారు.