pirates of the carrebian
-
మాజీ సెలబ్రిటీ జంట పోరు.. అబద్ధాల గోల!
లాస్ ఏంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్, అతడి మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్ మధ్య వివాదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. డెప్ హెర్డ్‌లు ఒకరి మీద ఒకరు వరుసగా ఆరోపణలు, దావాలతో హాలీవుడ్‌ను హీటెక్కిస్తున్నారు. తాజాగా అంబర్డ్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని జానీ డెప్‌పై విరుచుకుపడింది. 2016లో లాస్ ఏంజెల్స్‌లోని జానీ డెప్ ఇంట్లో తనపై దాడి జరిగిందని అంబర్డ్ కేసు వేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ మధ్యే పోలీసులు అంబర్డ్ను సీక్రెట్‌గా ప్రశ్నించారని, ఆమె స్టేట్మెంట్ ద్వారా ఆ దాడి జరిగిన విషయం అబద్ధమని తేలిందని కొన్ని హాలీవుడ్ వెబ్‌సైట్స్ కథనాలు రాశాయి. అయితే ఈ కథనాల వెనుక జానీ డెప్ ప్రమేయం ఉందని అంబర్డ్ ఆరోపిస్తోంది. ఈ మేరకు అంబర్డ్ లాయర్ మీడియాకు స్టేట్మెంట్ను రిలీజ్ చేశాడు. మరోవైపు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌లో ఈ మధ్యే అంబర్డ్పై డెప్ ఓ దావా వేశారు. తాను రెండు ఛారిటీలకు ఏడు మిలియన్ల డాలర్లను దానం చేశానని అంబర్ ప్రకటించడంపై దర్యాప్తు చేపట్టాలని డీప్ అందులో కోరాడు. అయితే ఈ డబ్బు అంబర్డ్ అప్పటి బాయ్‌ఫ్రెండ్ అయిన ఎలన్ మస్క్ ఇచ్చాడని డెప్ పేర్కొనడం విశేషం. ఇక పోయినేడాది భార్యను హింసించాడనే ఆరోపణలు రుజువు కావడంతో జానీ డెప్‌కి వ్యతిరేకంగా దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే డెప్ తీరుపై వరుసగా ఎన్ని ఆరోపణలు వస్తున్నా, న్యాయస్థానాల్లో అవి రుజువు అవుతున్నా.. అభిమానులు మాత్రం అతనికి మద్దతు తెలుపుతుండడం కొసమెరుపు. చదవండి: జాక్ స్పారోకు గుడ్‌బై! -
పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్‌కు పైరేట్స్ దెబ్బ!
'డిస్నీ' హాలీవుడ్ భారీ నిర్మాణ సంస్ధ. ఇప్పుడు వాన్నా క్రై హ్యాకర్ల దెబ్బకు విలవిల్లాడుతోంది. డిస్నీ సంస్ధకు చెందిన సర్వర్లను వాన్నా క్రై హ్యాక్ చేసింది. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సంస్ధ సినిమాల ఒరిజినల్ ప్రింట్స్ హ్యాకర్ల చేతికి వెళ్లాయి. వాటిలో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్‌లో తర్వాతి భాగమైన డెడ్ మెన్ టెల్ నో టేల్స్ ఉంది. తాము కోరిన మొత్తాన్ని బిట్కాయిన్ల రూపంలో చెల్లించకపోతే డెడ్ మెన్ టెల్ నో టేల్స్ అనే సినిమాతో పాటు మరొకొన్ని సినిమాలను కూడా ఆన్లైన్లో రిలీజ్ చేస్తామని వాన్నా క్రై హెచ్చరించినట్లు తెలిసింది. వాన్నా క్రై డిమాండ్‌పై స్పందించిన డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబ్ ఐగర్ డబ్బును చెల్లించేందుకు నిరాకరించినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది. ఐగర్ నిర్ణయంపై స్పందించిన వాన్నా క్రై హ్యాకర్లు బిట్కాయిన్ల రూపంలో డాలర్లను చెల్లించకపోతే.. 20 నిమిషాల వ్యవధిలో సినిమాలన్నింటినీ ఆన్లైన్లో విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా, ఈ నెల 26వ తేదీన డెడ్ మెన్ టెల్ నో టేల్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పైరేట్స్ ఆప్ ది కరేబియన్‌కు భారత్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. హ్యాకర్ల హెచ్చరికలపై డిస్నీ ఎఫ్బీఐను డిస్నీ సంప్రదిస్తున్నట్లు తెలిసింది. వాన్నా క్రై కంప్యూటర్లను హ్యాక్ చేయడానికి ఉపయోగిస్తున్న లూప్‌హోల్‌ను తొలగిస్తూ మైక్రోసాఫ్ట్ కొత్త అప్‌గ్రేడ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.