Johnny Depp Amber Heard Latest News: మాజీ భార్యపై జానీ డెప్​ తప్పుడు ప్రచారం! - Sakshi
Sakshi News home page

మాజీ భార్యపై జానీ డెప్​ తప్పుడు ప్రచారం!

Published Mon, May 31 2021 8:19 AM | Last Updated on Mon, May 31 2021 1:55 PM

Johnny Depp Spread Lies On Ex Wife Amber Heard - Sakshi

లాస్​ ఏంజెల్స్:  ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్‌, అతడి మాజీ భార్య, నటి అంబర్​ హెర్డ్​ మధ్య  వివాదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. డెప్​ హెర్డ్​లు ఒకరి మీద ఒకరు వరుసగా ఆరోపణలు, దావాలతో హాలీవుడ్​ను హీటెక్కిస్తున్నారు. తాజాగా అంబర్డ్​ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని జానీ డెప్​పై విరుచుకుపడింది.
 
2016లో లాస్​ ఏంజెల్స్​లోని జానీ డెప్​ ఇంట్లో తనపై దాడి జరిగిందని అంబర్డ్​ కేసు వేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ మధ్యే పోలీసులు అంబర్డ్​ను సీక్రెట్​గా ప్రశ్నించారని, ఆమె స్టేట్​మెంట్ ద్వారా ఆ దాడి జరిగిన విషయం అబద్ధమని తేలిందని కొన్ని హాలీవుడ్ వెబ్​సైట్స్​ కథనాలు రాశాయి. అయితే ఈ కథనాల వెనుక జానీ డెప్​ ప్రమేయం ఉందని అంబర్డ్ ఆరోపిస్తోంది. ఈ మేరకు అంబర్డ్ లాయర్​ మీడియాకు స్టేట్​మెంట్​ను రిలీజ్ చేశాడు. 

మరోవైపు అమెరికన్​ సివిల్​ లిబర్టీస్​ యూనియన్​లో ఈ మధ్యే  అంబర్డ్​​పై డెప్​ ఓ దావా వేశారు. తాను రెండు ఛారిటీలకు ఏడు మిలియన్ల డాలర్లను దానం చేశానని అంబర్​ ప్రకటించడంపై దర్యాప్తు చేపట్టాలని డీప్ అందులో కోరాడు. అయితే ఈ డబ్బు అంబర్డ్ అప్పటి బాయ్​ఫ్రెండ్ అయిన ఎలన్​ మస్క్​ ఇచ్చాడని డెప్ పేర్కొనడం విశేషం. ఇక పోయినేడాది భార్యను హింసించాడనే ఆరోపణలు రుజువు కావడంతో జానీ డెప్​కి వ్యతిరేకంగా దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే డెప్ ​తీరుపై వరుసగా ఎన్ని ఆరోపణలు వస్తున్నా, న్యాయస్థానాల్లో అవి రుజువు అవుతున్నా.. అభిమానులు మాత్రం అతనికి మద్దతు తెలుపుతుండడం కొసమెరుపు.

చదవండి: జాక్​ స్పారోకు గుడ్​బై!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement