Pixel 2
-
గూగుల్ పిక్సెల్ ఎక్స్‌ఎల్‌పై భారీ డిస్కౌంట్
గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 128జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను అమెజాన్ ఇండియా ప్రస్తుతం రూ.39,990కు తగ్గించింది. అసలు ఈ ఫోన్ ధర రూ.76వేలు. అమెజాన్ ఇండియా వెబ్సైట్ ప్రకారం గూగుల్ పిక్సెల్ ఎక్స్‌ఎల్‌పై రూ.36,010 డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు తెలిసింది. అంటే దాదాపు 47 శాతం డిస్కౌంట్ అన్నమాట. ఒక్క పిక్సెల్ ఎక్స్ఎల్పైనే మాత్రమే కాక, కొత్త గూగుల్ ఫోన్ పిక్సెల్ 2పై కూడా అమెజాన్ ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్ భారీ మొత్తంలో డిస్కౌంట్ అందిస్తుంది. 64జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.61వేల నుంచి రూ,49,999కు ప్లిప్‌కార్ట్ తగ్గించింది. అంతేకాక అదనంగా ఎక్స్చేంజ్పై రూ.18వేల తగ్గింపును అందిస్తోంది. 128జీబీ స్టోరేజ్ కలిగిన పిక్సెల్ 2 ధరను రూ.70వేల నుంచి రూ.58,999 తగ్గించినట్టు కూడా ఫ్లిప్ కార్ట్ తెలిపింది. తన 2018 మొబైల్ బొనాంజ సేల్‌లో వీటిపై డిస్కౌంట్లను ఆఫర్చేస్తుంది. రేపటి నుంచి ఈ సేల్ ప్రారంభం కాబోతుంది. ఫ్లిప్‌కార్ట్ అప్‌కమింగ్ ఆఫర్లలో గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లు 13,001 రూపాయలు, 8,001 రూపాయలు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ వాడి కొనుగోలు చేసే వారికి పిక్సెల్ 2పై రూ.8000 తగ్గింపు ఉంది. 64జీబీ స్టోరేజ్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ రూ.39,999కు అందుబాటులో ఉంటుండగా.. అతిపెద్ద పిక్సెల్ 2 ఎక్స్ఎల్ రూ.52,999కు లభ్యమవుతుంది. -
గూగుల్ ఫోన్లపై భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ ఎల్ ధరలు భారీగా తగ్గాయి. హాలిడే సీజన్ లో పరిమత కాలం ఆఫర్ కింద ఈ తగ్గింపును అందిస్తున్నట్టు గూగుల్ శుక్రవారం ప్రకటించింది. క్రెడిట్ కార్డు చెల్లింపుపై డిసెంబర్ 31 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉన్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. పిక్సెల్ 2 64జీబీ,128జీబీ వేరియంట్లకు రూ. 11,001పరిమిత కాలం డిస్కౌంట్ అందిస్తోంది. పిక్సెల్ 2ఎక్స్ఎల్ 64జీబీ, 128జీబీ వేరియంట్లపై రూ. 5.001 తగ్గింపు. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు కొనుగోలు ద్వారా రూ. 8వేల డిస్కౌంట్‌తో పిక్సెల్ 2 (64జీబీ) రూ. 41,999కి (ఎంఆర్పి రూ.61వేలు) లభించనుంది. పిక్సెల్ 2 128జీబీ రూ. 50,999 (అసలు ధర రూ 70,వేలు), పిక్సెల్ 2 ఎక్స్ఎల్ 64 జీబీ రూ. 56,999 (అసలు ధర రూ. 73 వేలు), అలాగే 128 జీబీ వెర్షన్ రూ.65,999 (అసలు ధర రూ.82వేలు) ధరలో అందుబాటులో ఉంటుంది. కొనుగోలు చేసిన 90 రోజుల్లో డిస్కౌంట్ క్రెడిట్ అవుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీకి మాత్రమే వర్తించే క్యాష్ బ్యాక్ ఆ ఫర్ డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. -
గూగుల్ కొత్త ఫోన్ల ప్రీ-ఆర్డర్లు, బంపర్ ఆఫర్లు
గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల ప్రీ-ఆర్డర్లు భారత్‌లో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ ఎక్స్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు గూగుల్ వీటి ప్రీ-ఆర్డర్లను చేపడుతోంది. వయా ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా వీటిని అందించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి గూగుల్ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు చేపడుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. నవంబర్ 2 నుంచి పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌ను, నవంబర్ 15 నుంచి పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను డెలివరీ చేయనున్నట్టు పేర్కొంది. కొన్ని ఎక్స్‌క్లూజివ్ ప్రీ-ఆర్డర్ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టింది. వీటిలో పిక్సెల్ నుంచి అప్‌గ్రేడ్ అయిన కొనుగోలుదారులకు 50 శాతం బైబ్యాక్ గ్యారెంటీని అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా ఈఎంఐ లావాదేవీలు జరిపితే రూ.8000 క్యాష్‌బ్యాక్‌ను, ఎంపికచేసిన ఫోన్ మోడల్స్ ను ఎక్స్చేంజ్ చేసి వీటిని కొంటే రూ.5000 తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్లోకి అప్‌గ్రేడ్ అయ్యే పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ ఓనర్లకు 50 శాతం బైబ్యాక్ గ్యారెంటీ అనేది ఎంతో అద్భుతమైన ఆఫర్ అని చెప్పింది. అదేవిధంగా ఫేస్బుక్లో నిర్వహించే కంటెస్ట్‌లో గెలుపొందిన ఐదుగురు ఎంపికచేసిన విన్నర్లకు గూగుల్ కొత్త డేడ్రీమ్ వ్యూ వీఆర్ హెడ్సెట్ కూడా ఇవ్వనున్నారు. ఈ కంటెస్ట్‌ను అక్టోబర్ 25 వరకు నిర్వహించనున్నారు. గూగుల్ టెలికాం ఆపరేటర్లతో కూడా భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో ఎయిర్టెల్ ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకునే కొనుగోలుదారులకు ఆరు నెలల పాటు అదనంగా 120 జీబీ డేటాను అందించనున్నారు. రిలయన్స్ జియో యూజర్లైతే ఏకండా మొత్తంగా రూ.14,999 ప్రయోజనాలను పొందనున్నారు. అంటే ఏడాది పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, 750జీబీ డేటా, ఎస్ఎంఎస్లు, రూ.9999 విలువైన జియో యాప్స్ వీరికి అందనున్నాయి. రిలయన్స్ డిజిటల్ స్టోర్ ద్వారా పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్లో కొత్త ఫోన్‌ను కొనుగోలుచేస్తే రూ.5000 అదనపు ఎక్స్చేంజ్ బోనస్‌లు కూడా లభ్యం కానున్నాయి. -
గూగుల్ పిక్సెల్ 2: కమింగ్ సూన్
సాక్షి, న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గూగుల్ మరో రెండు పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ డేట్ వచ్చేసింది. మేడ్ బై గూగుల్ వెబ్సైట్ అందించిన సమాచారం అక్టోబర్ 4వ తేదీన గూగుల్ కొత్త పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్పోన్లను లాంచ్ చేయనుంది. విజయవంతమైన పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ ఎల్ స్మార్ట్ ఫోన్లకు సక్సెసర్ గా వీటిని వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. ముఖ్యంగా ప్రత్యర్థి మొబైల్ దిగ్గజాలు శాంసంగ్, ఆపిల్ తమ సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయడంతో గూగుల్ కూడా ఇదే సరైన సమయంగా భావిస్తోంది. గూగుల్ బోస్టన్ బిల్బోర్డ్ ట్వీట్ చేసిన వీడియో ప్రకారం ఈ డివైస్‌లను స్మార్టర్ గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ తో రూపొందించింది అలాగే రెండు మోడల్స్‌లోను అల్యూమినియం, గ్లాస్ ప్యానెల్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, వాటర్ ప్రూఫ్ తదితర ఫీచర్లతోపాటు.. హెడ్ ఫోన్జాక్ ఉండదని తెలిపింది. అంతేకాదు బ్యాటరీ లైఫ్, నిల్వ, ఫోటో క్లారిటీ, ఆటోమేటిక్ అప్డే ట్స్, పెర్ఫామెన్స్, ఓవర్‌హీట్ తదితర అంశాల్లో గ్రేటర్ ఫెర్ఫామెన్స్ హింట్స్ కూడా ఇచ్చేసింది. వివిధ స్టోరేజ్ వేరియంట్లతో ఇది లభ్యంకానుందని, దాదాపు పిక్సెల్స్మార్ట్ఫోన్ ధరకు చేరువలోనే ఈ కొత్త డివైస్ ధర కూడా నిర్ణయించనుందని అంచనా.ఇ ప్పటికే సంస్థ ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వానాలను కూడా మీడియాకు పంపిందట. కాగా గూగుల్ తన సొంత బ్రాండులో గత ఏడాది అక్టోబర్4న పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఏడాదికి మళ్లీ కొత్త స్మార్ట్ఫోన్లతో మార్కెట్లో హల్చల్ చేయనుంది. — Droid Life (@droid_life) September 14, 2017