గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్లు భారత్‌లో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ ఎక్స్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు గూగుల్ వీటి ప్రీ-ఆర్డర్లను చేపడుతోంది. వయా ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా వీటిని అందించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి గూగుల్ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు చేపడుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. నవంబర్ 2 నుంచి పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌ను, నవంబర్ 15 నుంచి పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను డెలివరీ చేయనున్నట్టు పేర్కొంది. కొన్ని ఎక్స్‌క్లూజివ్ ప్రీ-ఆర్డర్ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టింది. వీటిలో పిక్సెల్ నుంచి అప్‌గ్రేడ్ అయిన కొనుగోలుదారులకు 50 శాతం బైబ్యాక్ గ్యారెంటీని అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా ఈఎంఐ లావాదేవీలు జరిపితే రూ.8000 క్యాష్‌బ్యాక్‌ను, ఎంపికచేసిన ఫోన్ మోడల్స్ ను ఎక్స్చేంజ్ చేసి వీటిని కొంటే రూ.5000 తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్‌లోకి అప్‌గ్రేడ్ అయ్యే పిక్సెల్, పిక్సెల్ ఎక్స్‌ఎల్ ఓనర్లకు 50 శాతం బైబ్యాక్ గ్యారెంటీ అనేది ఎంతో అద్భుతమైన ఆఫర్ అని చెప్పింది. అదేవిధంగా ఫేస్‌బుక్‌లో నిర్వహించే కంటెస్ట్‌లో గెలుపొందిన ఐదుగురు ఎంపికచేసిన విన్నర్లకు గూగుల్ కొత్త డేడ్రీమ్ వ్యూ వీఆర్ హెడ్‌సెట్ కూడా ఇవ్వనున్నారు. ఈ కంటెస్ట్‌ను అక్టోబర్ 25 వరకు నిర్వహించనున్నారు. గూగుల్ టెలికాం ఆపరేటర్లతో కూడా భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో ఎయిర్‌టెల్ ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకునే కొనుగోలుదారులకు ఆరు నెలల పాటు అదనంగా 120 జీబీ డేటాను అందించనున్నారు. రిలయన్స్ జియో యూజర్లైతే ఏకండా మొత్తంగా రూ.14,999 ప్రయోజనాలను పొందనున్నారు. అంటే ఏడాది పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, 750జీబీ డేటా, ఎస్‌ఎంఎస్లు, రూ.9999 విలువైన జియో యాప్స్ వీరికి అందనున్నాయి. రిలయన్స్ డిజిటల్ స్టోర్ ద్వారా పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో కొత్త ఫోన్‌ను కొనుగోలుచేస్తే రూ.5000 అదనపు ఎక్స్చేంజ్ బోనస్‌లు కూడా లభ్యం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment