గూగుల్ ఇటీవల తీసుకొచ్చిన పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్ ధర తాత్కాలికంగా తగ్గింది. 'బెస్ట్ బై' ఆఫర్ కింద గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్ 64జీబీ వేరియంట్‌ను రూ.64,999కు, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.73,999కు గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. అన్ని అధికారిక ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్ద నగదు, కార్డు లావాదేవీలకు ఈ ధర అందుబాటులో ఉంటుందని తెలిసింది. డిసెంబర్ 31 వరకు బెస్ట్ బై ఆఫర్ వాలిడ్‌లో ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్‌పై ధర తగ్గడంతో పాటు, అదనంగా రూ.8000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డు కొనుగోలుదారులకు మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. అంటే క్యాష్‌బ్యాక్‌తో గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్(64జీబీ వేరియంట్) రూ.56,999కు, 128జీబీ మోడల్ రూ.65,999కు అందుబాటులోకి వచ్చాయి.
అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ ఈఎంఐ లావాదేవీలకు రూ.9000 క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ కొనుగోలు చేసిన వారికి ఎయిర్‌టెల్ స్పెషల్ డేటా ఆఫర్ చేస్తుంది. ప్రీపెయిడ్ రీఛార్జ్ రూ.549, పోస్టు పెయిడ్ ప్లాన్స్ రూ.649, ఆపై మొత్తాలకు ఆరు నెలల పాటు అదనంగా 120జీబీ డేటా అందించనున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ డేటాను మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. గత వారంలో కూడా గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్ ధరను ఫ్లిప్‌కార్ట్ తగ్గించింది. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ 64జీబీ వేరియంట్‌ను రూ.67,999కు, పిక్సెల్ 2ను రూ.49,999కు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment