భారత్‌లోకి గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గూగుల్ ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తోంది. అదేవిధంగా ఇతర ఆఫ్‌లైన్ ఛానల్స్ ద్వారా కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, పూర్వికా, సంగీతా మొబైల్స్, విజయ్ సేల్స్, ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో బుధవారం నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. దీని ధర రూ.73వేల నుంచి ప్రారంభమవుతోంది. 64జీబీ మోడల్ ధర రూ.73వేలు కాగ, 128జీబీ మోడల్ ధర 82వేల రూపాయలు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఇతర కంపెనీలకు పలు ఫైనాన్సింగ్ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్‌తో పాటు లాంచ్ అయిన పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ ఈ నెల మొదటి నుంచే విక్రయానికి వచ్చిన సంగతి తెలిసిందే. పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లు ప్రీ-ఆర్డర్లకు వచ్చినప్పుడు టెలికాం కంపెనీ రిలయన్స్ జియో పలు ఆఫర్లను ప్రకటించింది.
గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ ఫీచర్లు...
6 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ పీ-ఓలెడ్ డిస్‌ప్లే
3డీ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్
64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు
3520 ఎంఏహెచ్ బ్యాటరీ
12.2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
Comments
Please login to add a commentAdd a comment