ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్, తన సొంత బ్రాండులో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. పిక్సెల్, పిక్సెల్ ఎక్స్‌ఎల్, పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ పేర్లతో ఇప్పటికే నాలుగు స్మార్ట్‌ఫోన్లను గూగుల్ విడుదల చేసింది. తాజాగా మరో ఫ్లాగ్‌షిప్‌ను తెచ్చేందుకు సన్నద్ధమవుతుంది. త్వరలోనే గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్‌ను గూగుల్ మార్కెట్‌లోకి లాంచ్ చేస్తుందని తెలిసింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి పలు వీడియోలు, ఫోటోలు లీకయ్యాయి. ఎక్కువగా లీక్స్ అన్నీ వైల్స్‌కామ్ మీడియాలో పనిచేసే ఉక్రేయిన్ బ్లాగర్ షేర్ చేశాడు. అయితే అంతటితో ఆగకుండా గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్ విడుదల కాకముందే విక్రయానికి కూడా వచ్చినట్టు చెప్పేశాడు. అయితే అది ఎలానో తెలుసా? బ్లాక్ మార్కెట్ ద్వారా.
గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్ హ్యాండ్స్-ఆన్ వీడియోను కూడా వైల్స్‌కామ్ పబ్లిస్ చేసింది. ఈ వీడియో టెలిగ్రామ్ అకౌంట్ వాటర్‌మార్కుతో వచ్చింది. 2000 వేల డాలర్లకు అంటే రూ.1,39,550కు గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు దీన్ని కూడా విక్రయిస్తున్నట్టు వైల్స్‌కామ్ చెప్పింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు, అక్కడ ఇచ్చిన టెలిగ్రామ్ అకౌంట్ హోల్డర్‌తో కనెక్ట్ కావాలని సూచించింది. అయితే ఆ అకౌంట్‌ను బ్లర్ చేశారు. కేవలం డివైజ్‌ను మాత్రమే కాక, బాక్స్‌ను, గూగుల్ పిక్సెల్ బడ్స్‌ను ఇది ఆఫర్ చేస్తుందని తెలిసింది. అయితే ఇది ఒక స్కామ్ అని, కొట్టుకొచ్చి ఈ హ్యాండ్‌సెట్లను విక్రయిస్తున్నారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. లాంచ్ కాకముందే ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌మార్కెట్‌లోకి రావడంపై గూగుల్ షాకైంది. వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment