pixel phone
-
స్మార్ట్ ఫోన్లో కొత్త సమస్య, బాబోయ్ అంటూ ఫిర్యాదుల వెల్లువ
గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా టెన్సార్ చిప్సెట్లతో పాటు ఆండ్రాయిడ్12 వెర్షన్‌తో పిక్సెల్ 6, పిక్సెల్స్ 6 ప్రో ఫోన్లను విడుదల చేసింది. ఇప్పుడు ఆ ఫోన్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ 19న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఫిక్సెల్ ఫోన్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా ఫోన్లలో ఉండే చిప్ సెట్లను క్వాల్కమ్ తయారు చేస్తుంది. అయితే పిక్సెల్ ఫోన్లలో వినియోగించిన చిప్‌లను గూగులే సొంతంగా తయారు చేసింది. ఈ పిక్సెల్ 6 ప్రారంభ ధర మన కరెన్సీలో రూ.44,971వేలు, పిక్సెల్ ప్రొ ధర దాదాపు రూ.67,494గా ఉంది. We're launching Pixel 6 and Pixel 6 Pro today! They’re unlike any phone we've built before, with a new industrial design, Android 12 with Material You user interface, and running on our custom Google Tensor chip. Can't wait to see how people use them:)https://t.co/QPvVrCtxvB pic.twitter.com/2eFJsGmSOc — Sundar Pichai (@sundarpichai) October 19, 2021 Android 12 is wrecking my Pixel 4a. Touch is all wonky and the animations are running slow. Also a weird thing where I can't touch the date to open my calendar anymore. Curious if others are having these issues. — Donny Turnbaugh (@DonnyOutWest) October 21, 2021 అయితే విడుదల సందర్భంగా ఈ సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులు పిక్సెల్ సపోర్ట్‌కు పేజ్‌కు వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. తాము కొనుగోలు చేసిన పిక్సెల్ ఫోన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపారు. అన్లాకింగ్, యాప్స్ క్రాష్, కెమెరాలలో సమస్యలున్నాయని, ఫోన్ రీస్టార్ట్ చేసినా అవి పరిష్కారం కావడం లేదని, ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌ని ఇన్స్టాల్ చేసిన పిక్సెల్ ఫోన్లలో ఎటువంటి మార్పులు లేవని అన్నారు. Are there any other Pixels out there have issues since Android 12 was released, my 4a 5G is have a bunch — Rick Young Jr (@RichardYoungJr7) October 21, 2021 మరికొందరు ఆండ్రాయిడ్ వెర్షన్‌కి మారిన తర్వాత యాప్‌లు క్రాష్ అవున్నట్లు చెప్పారు. బ్యాటరీ డ్రెయిన్ సమస్యల్ని ఫేస్ చేస్తున్నట్లు, త్వరగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. పిక్సెల్ 6 సిరీస్‌తో పాటు పిక్సెల్ 4ఏ, పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్5 ఫోన్లలో సమస్యలు ఉన్నాయని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఇక యూజర్ల వరుస ఫిర్యాదులతో గూగుల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. చదవండి: గూగుల్ పిక్సెల్ 6 సిరీస్: సొంత చిప్‌తోనే అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే.. -
గూగుల్ పిక్సెల్ 4a @26000!
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. అత్యంత ఆధునిక ఫీచర్లతో పిక్సెల్ 4a మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ తయారీ ఐఫోన్ SE, చైనీస్ వన్‌ప్లస్ నార్డ్ తదితర మోడళ్లకు పోటీగా గూగుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లను రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. నేడు యూఎస్ మార్కెట్లో పిక్సెల్ 4a మోడల్ 4జీ, 5జీ స్మార్ట్ఫోన్లను గూగుల్ ప్రవేశపెట్టనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ధరలు ఇలా పిక్సెల్ 4aను రెండు వేరియంట్లలో గూగుల్ రిలీజ్ చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 6జీబీ + 128 జీబీ మోడల్ స్మార్ట్‌ఫోన్ ధరను @349 డాలర్లు(సుమారు రూ. 26,000)గా నిర్ణయించవచ్చని అంచనా. ఇదే విధంగా 6 జీబీ+ 64 జీబీ వెరైటీ ధర 300 డాలర్లు(రూ. 22,400) ఉండవచ్చని ఊహిస్తున్నారు. 5జీ మోడల్‌కు సంబంధించి 499 డాలర్ల ధర(రూ. 37,300)ను అంచనా వేస్తున్నారు. సాంకేతిక వివరాలు 5.8 అంగుళాల తెరను కలిగి ఉండే పిక్సెల్ 4a క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 730జీ చిప్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. 3140 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ మోడల్లో 5జీ వేరియంట్‌ను సైతం గూగుల్ విడుదల చేసే అవకాశముంది. ఈ ఫోన్ పంచ్‌హోల్ డిస్ప్లేతో 12.2 ఎంపీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా X52 మోడెమ్ కలిగిన పిక్సెల్ 5నూ గూగుల్ ప్రవేశపెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. -
గూగుల్ పిక్సెల్3 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్
గూగుల్ పిక్సెల్ 3 స్మార్ట్‌ఫోన్‌పై పేటీఎం మాల్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. తాజా ఆఫర్ ద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ఫోన్లలో ఒకటైన గూగుల్ పిక్సెల్ 3 64 జీబీ (జస్ట్ బ్లాక్) వెర్షన్‌పై 6శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీనికి అదనంగా 6వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. దీంతో సుమారు 10వేల రూపాయల తగ్గింపుతో . ప్రస్తుతం రూ. 60,482 లకే లభిస్తోంది. దీని అసలు ధర రూ. 71వేలు. అలాగే 'క్లియర్లీ వైట్' గూగుల్ పిక్సెల్ 3 స్మార్ట్‌ఫోన్ కూడా తగ్గింపు అనంతరం 60,487 రూపాయలకే లభ్యం కానుంది. మిగిలిన వివరాలు పేటీఎం మాల్ అధికారిక వెబ్సైట్లో లభ్యం. గూగుల్ పిక్సల్ 3 లీకైన ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 12.2ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 2915 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. -
ఆపిల్ కీలక ఉద్యోగిని గూగుల్ తీసేసుకుంది!
లాస్ ఏంజిల్స్ : హై-ఎండ్ ఆపిల్ ఐఫోన్లకు ధీటుగా గూగుల్ తన సొంత బ్రాండులో పిక్సెల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐఫోన్లకు మరింత పోటీనిచ్చేందుకు తను తర్వాత తీసుకురాబోతున్న ఫ్లాగ్ షిప్ పిక్సెల్ ఫోన్ కోసం ఏకంగా ఐఫోన్ల, ఐప్యాడ్ ల చిప్ ఆర్కిటెక్ట్ ను గూగుల్ తీసేసుకుంది. భారతీయ సంతతి ఇంజనీర్ మను గులాటిని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన కంపెనీలోకి నియమించుకుంది. మైక్రో-ఆర్కిటెక్ట్ గా ఎనిమిదేళ్లుగా గులాటి ఆపిల్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన గూగుల్ లో లీడ్ ఎస్ఓసీ ఆర్కిటెక్ట్ గా చేరినట్టు తెలిసింది. ప్రస్తుతం గులాటి ఆపిల్ నుంచి బయటికి వచ్చేయడం ఆ కంపెనీకి ఎదురుదెబ్బని పలువురంటున్నారు. చిప్ లకు సంబంధించి చాలా పేటెంట్లు ఆయన వద్దనే ఉన్నాయి. అంతేకాక వాటి వ్యవస్థాపకుడిగా గులాటికే క్రెడిట్ అంతా దక్కుతోంది. చిప్ డిజైన్ లో ఆయన 15 ఆపిల్ పేటెంట్ రైట్లను కలిగి ఉన్నారు. గూగుల్ సొంతంగా ఓ ప్రాసెసర్ ను అభివృద్ధి చేయాలని ప్లాన్ వేస్తోంది. తర్వాతి పిక్సెల్ స్మార్ట్ ఫోన్లకు సొంత చిప్ సెట్ల కోసం చిప్ నిపుణుల టీమ్ ను కూడా కంపెనీ భారీగా పెంచుతోంది. ప్రస్తుతం ఆపిల్ కు సొంత స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్లు ఉన్నాయి. కానీ గూగుల్ కు అలాంటివేమీ లేవు. గూగుల్ పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్లకు క్వాల్ కామే తన స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ లను సప్లై చేస్తోంది. దీంతో గూగుల్ కూడా సొంతంగా ప్రాసెసర్ల రెడీకి సిద్ధమైంది. ఆపిల్ కొత్త చిప్ లు ఏ10ఎక్స్. ఇంటెల్, క్వాల్ కామ్ లకు బదులుగా ఆపిల్ సొంతంగా చిప్ లను తయారుచేసుకుంది. గతంలో 2010ఐప్యాడ్ ఏ4, ఏ9 చిప్ లకు గులాటినే బాధ్యత వహించేవారు. గులాటి అంతకముందు బ్రాడ్ కామ్, ఏఎండీల్లో కూడా పనిచేశారు. గులాటి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఆయన గూగుల్ లో చేరిన విషయాన్ని ధృవీకరిస్తోంది. ఆయన ప్రొఫైల్ లో గూగుల్ లీడ్ ఎస్ఓసీ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది. -
మొబైల్ మార్కెట్ ను గూగుల్ షేక్ చేస్తుందా?
గూగుల్ నెక్సస్ ఫోన్. ఇక మీదట కనిపించదు. ఎందుకంటే దీని స్ధానంలో సరికొత్త పిక్సల్ ఫోన్ ను తీసుకొస్తోంది గూగుల్. పిక్సల్, పిక్సల్ ఎక్స్ఎల్ పేర్లతో రెండు కొత్త మోడళ్ల మంగళవారం రాత్రి విడుదల చేయనుంది. నెక్సస్ ఫోన్లను నిలిపివేసి వాటి స్ధానంలో పిక్సల్ ఫోన్లను తీసుకురావాలనే గూగుల్ ఆలోచన ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. 2010లో లాంచ్ చేసిన నెక్సస్ ఫోన్లను ప్రవేశపెట్టిన గూగుల్ కు క్రమంగా తమ ఫోన్లు సాధారణ ఆండ్రాయిడ్ మాదిరిగానే ఉన్నాయనే విషయం అర్ధమయింది. ఇందుకోసం నెక్సస్ కొనుగోళ్లను గూగుల్ పరిశీలించుకుంది. ఆ తర్వాత గూగుల్ రెండు లక్ష్యాలను పెట్టుకుంది. ఒకటి ఆపిల్ ఫోన్ల మార్కెట్ ను తన వైపుకు తిప్పుకోవాలి. రెండు ఆండ్రాయిడ్ మార్కెట్ ను కంట్రోల్ చేయాలి. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే పిక్సల్. ఫోన్ ను అన్నివిధాలుగా అదుపులో ఉంచుకునే విధంగా పిక్సల్ ను గూగుల్ తయారుచేయించిందని సమాచారం. ఇందుకోసం హెచ్ టీసీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే పిక్సల్ ఫోన్ల తయారీదారు హెచ్ టీసీ అన్నమాట. అయితే, ఫోన్ లపై ఉండే లోగోలో మాత్రం గూగుల్ కు చెందినదే. మిగతా ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అందుబాటులో లేని సరికొత్త ఫీచర్లను పిక్సల్ తో బయటకు తేనుంది గూగుల్. పిక్సల్ ఫోన్ తో డైరక్ట్ గా ఆపిల్ ను ఢీ కొట్టాలని గూగుల్ యోచిస్తోంది. దీంతో పిక్సల్ ధర కూడా కాస్త ఎక్కువగా ఉండేటట్లే కనిపిస్తోంది. గూగుల్ పిక్సల్ ఇలా ఉండబోతోందని ఆన్ లైన్ లో కొన్ని రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని చూద్దాం. - పిక్సల్ ఫోన్ కు ఐపీ53 సర్టిఫికేషన్ ఉందని ఓ వెబ్ సైట్ రాసింది. వర్షంలో తడిసినా, దుమ్ము పడినా పాడవని ఫోన్లకు ఐపీ 53 సర్టిఫికేషన్ ఇస్తారు. అయితే ఇందులో ఒక మెలిక కూడా ఉంది. ఈ సర్టిఫికేషన్ ఉన్న ఫోన్ ను వర్షంలో ఉపయోగించొచ్చు. అయితే ఫోన్ జారి నీటిలో పడితే మాత్రం ఇక దాని పని అయిపోయినట్లే. - అక్టోబర్ 4న విడుదలయ్యే ఈ ఫోన్లను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ద్వారా అక్టోబర్ 13న భారత్ లో ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. - శాంసంగ్, ఆపిల్ ఫోన్లకు ధీటుగా పిక్సల్ ఉంటుదన్న వార్తలతో పాటు వాటితో పాటే ధర రూ.45వేలకు పైగా ఉంటుందని తెలిసింది.