మొబైల్ మార్కెట్ ను గూగుల్ షేక్ చేస్తుందా?
మొబైల్ మార్కెట్ ను గూగుల్ షేక్ చేస్తుందా?
Published Tue, Oct 4 2016 9:12 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
గూగుల్ నెక్సస్ ఫోన్. ఇక మీదట కనిపించదు. ఎందుకంటే దీని స్ధానంలో సరికొత్త పిక్సల్ ఫోన్ ను తీసుకొస్తోంది గూగుల్. పిక్సల్, పిక్సల్ ఎక్స్ఎల్ పేర్లతో రెండు కొత్త మోడళ్ల మంగళవారం రాత్రి విడుదల చేయనుంది. నెక్సస్ ఫోన్లను నిలిపివేసి వాటి స్ధానంలో పిక్సల్ ఫోన్లను తీసుకురావాలనే గూగుల్ ఆలోచన ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు.
2010లో లాంచ్ చేసిన నెక్సస్ ఫోన్లను ప్రవేశపెట్టిన గూగుల్ కు క్రమంగా తమ ఫోన్లు సాధారణ ఆండ్రాయిడ్ మాదిరిగానే ఉన్నాయనే విషయం అర్ధమయింది. ఇందుకోసం నెక్సస్ కొనుగోళ్లను గూగుల్ పరిశీలించుకుంది. ఆ తర్వాత గూగుల్ రెండు లక్ష్యాలను పెట్టుకుంది.
ఒకటి ఆపిల్ ఫోన్ల మార్కెట్ ను తన వైపుకు తిప్పుకోవాలి. రెండు ఆండ్రాయిడ్ మార్కెట్ ను కంట్రోల్ చేయాలి. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే పిక్సల్. ఫోన్ ను అన్నివిధాలుగా అదుపులో ఉంచుకునే విధంగా పిక్సల్ ను గూగుల్ తయారుచేయించిందని సమాచారం. ఇందుకోసం హెచ్ టీసీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే పిక్సల్ ఫోన్ల తయారీదారు హెచ్ టీసీ అన్నమాట. అయితే, ఫోన్ లపై ఉండే లోగోలో మాత్రం గూగుల్ కు చెందినదే.
మిగతా ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అందుబాటులో లేని సరికొత్త ఫీచర్లను పిక్సల్ తో బయటకు తేనుంది గూగుల్. పిక్సల్ ఫోన్ తో డైరక్ట్ గా ఆపిల్ ను ఢీ కొట్టాలని గూగుల్ యోచిస్తోంది. దీంతో పిక్సల్ ధర కూడా కాస్త ఎక్కువగా ఉండేటట్లే కనిపిస్తోంది.
గూగుల్ పిక్సల్ ఇలా ఉండబోతోందని ఆన్ లైన్ లో కొన్ని రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని చూద్దాం.
- పిక్సల్ ఫోన్ కు ఐపీ53 సర్టిఫికేషన్ ఉందని ఓ వెబ్ సైట్ రాసింది. వర్షంలో తడిసినా, దుమ్ము పడినా పాడవని ఫోన్లకు ఐపీ 53 సర్టిఫికేషన్ ఇస్తారు. అయితే ఇందులో ఒక మెలిక కూడా ఉంది. ఈ సర్టిఫికేషన్ ఉన్న ఫోన్ ను వర్షంలో ఉపయోగించొచ్చు. అయితే ఫోన్ జారి నీటిలో పడితే మాత్రం ఇక దాని పని అయిపోయినట్లే.
- అక్టోబర్ 4న విడుదలయ్యే ఈ ఫోన్లను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ద్వారా అక్టోబర్ 13న భారత్ లో ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- శాంసంగ్, ఆపిల్ ఫోన్లకు ధీటుగా పిక్సల్ ఉంటుదన్న వార్తలతో పాటు వాటితో పాటే ధర రూ.45వేలకు పైగా ఉంటుందని తెలిసింది.
Advertisement
Advertisement