గూగుల్ పిక్సెల్ 5జీ ఫోన్లు లాంచ్ | Google Pixel 5Pixel 4a 5G With Snapdragon 765G SoC Launched | Sakshi
Sakshi News home page

గూగుల్ పిక్సెల్ 5జీ ఫోన్లు లాంచ్

Published Thu, Oct 1 2020 10:24 AM | Last Updated on Thu, Oct 1 2020 11:28 AM

Google Pixel 5Pixel 4a 5G With Snapdragon 765G SoC Launched - Sakshi

సాక్షి, ముంబై: గూగుల్  కొత్త  5జీ స్మార్ట్‌ఫోన్లను  భారత మార్కెట్లోకి విడుదల చేసింది. లగ్జరీ మొబైల్ ఫోన్ల విభాగంలో గూగుల్  పిక్సల్ 5, పిక్సల్ 4ఏ (5జీ) లను లాంచ్ చేసింది.  అక్టోబర్ 15 న జపాన్‌లో మొదట లాంచ్ అవుతుంది. తరువాత ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, తైవాన్, బ్రిటన్, అమెరికా మొత్తం 9 దేశాలలో (అక్టోబర్ 15) అందుబాటులో ఉండనుంది.  నవంబర్ నుండి ఇతర దేశాలలో లభ్యం కానుంది.  ఇండియాలో అక్టోబర్ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా  కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని గూగుల్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.  (కోట్లు దోచేస్తున్న యాప్స్ : చెక్ చెప్పిన చిన్నారి)

2021 నుండి గూగుల్ టీవీలాను లాంచ్ చేస్తున్నట్టు కంపెనీ ధృవీకరించింది.  సోనీ , ఇతర ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ భాగస్వామ్యంతో స్మార్ట్ టీవీలను తీసుకొస్తున్నట్టు తెలిపింది. 

గూగుల్ పిక్సెల్ 5  5 జీ ఫీచర్లు
6.00-అంగుళాల స్ర్రీన్
1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 11
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
8 ఎంపీ సెల్ఫీ కెమెరా 
12 +16  ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 
4080 ఎంఏహెచ్ బ్యాటరీ  సామర్థ్యం

గూగుల్ పిక్సెల్ 5 5జీ ప్రారంభ ధర సుమారు రూ. 51,400

గూగుల్ పిక్సెల్ 4 ఏ 5 జీ
6.20 అంగుళాలు స్ర్రీన్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్ 
ఆండ్రాయిడ్ 11
1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్
6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్
8 ఎంపీ సెల్ఫీకెమెరా
12 +16 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 
3885 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

గూగుల్ పిక్సెల్ 4ఏ 5జీ  ప్రారంభ  ధర సుమారు రూ. 37,000

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement