Pixel smartphone
-
గూగుల్ పిక్సెల్ 7 సిరీస్‌లో క్వాలిటీ సమస్యా? అసలు ఏమైంది?
సాక్షి, ముంబై: గూగుల్ పిక్సెల్ ఫోన్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హవా చాటుకున్న గూగుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. గత ఏడాది అక్టోబరులో లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 7 సిరీస్‌లో వీడియో కాల్ నాణ్యత బాగా లేదంటూ విమర్శలు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది. అద్భుతమైన ఇమేజింగ్ నాణ్యత, పిక్చర్ క్యాప్చరింగ్ ఫోన్లగా చెప్పుకుంటున్న ఈ ఫోన్లలో రియర్, సెల్పీ కెమెరాల వీడియో క్వాలిటీ పూర్, మసక మసకగా ఉంటోందని యూజర్లు ఫిర్యాదు చేశారు. (ఫోటో క్రెడిట్: ఆండ్రాయిడ్ పోలీస్) Google Meetతో సహా పలు యాప్‌లలో వీడియో క్వాలిటీ అసలు బాలేదనీ, ఇతర స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వీడియో నాణ్యత చాలా తక్కువగా ఉన్నాయని రెడిట్ యూజర్ ఒకరు ఫిర్యాదు చేశారు. అంతేకాదు Pixel 7 నుండి రిసీవ్ చేసుకున్న వీడియోలు కూడా అస్పష్టంగా,మసక బారినట్లుగా ఉన్నాయని ఆరోపించారు. పలువురు ట్విటర్ వినియోగదారులు కూడా దాదాపు ఇదే ఆరోపణ చేశారు. పిక్సెల్ 7 ప్రోతో Google Meetలో వీడియో కాల్ చేస్తున్నప్పుడు నాసెల్పీ కెమెరా అసలు క్లియర్‌గా లేదు..దీనికేదైనా పరిష్కారం ఉందా అని అని ఒకరు గత నెలలో ట్వీట్ చేశారు. (ఫోటో క్రెడిట్: ఆండ్రాయిడ్ పోలీస్) గూగుల్ సొంత యాప్‌తోపాటు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రాం యాప్స్‌లో వీడియో కాల్స్ అస్పష్టంగా ఉన్నాయని పిక్సెల్ 7 ప్రో యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, దీనిపై డజన్ల కొద్దీ ఇతర Android వినియోగదారులు వ్యాఖ్యానించినట్టు ఆండ్రాయిడ్ పోలీస్ నివేదించింది. గతంలో పిక్సెల్ 6లో ఇలాంటి సమస్యే వచ్చిందని నివేదించింది. సాఫ్ట్వేర్ సమస్య కావచ్చని సాఫ్ట్వేర్ అప్డేట్ద్వారా గూగుల్ దీన్ని పరిష్కరించాలని యూజర్లుకోరుతున్నారు. కాగా గతంలో కూడా గూగుల్ పిక్సెల్ 7 యూజర్లు రియర్ కెమెరా గ్లాస్ పగిలిన ఫిర్యాదుల నేపథ్యంలో రీప్లేస్ చేసింది. మరి తాజా ఫిర్యాదులపై ఎలా స్పందిస్తుందో చూడాలి. గూగుల్ పిక్సెల్ 7 ధర రూ. 52,950, గూగుల్ పిక్సెల్ 7 ప్రొ ధర రూ. 84,999గా ఉంది. గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో అక్టోబర్ 2022లో భారతదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
అనూహ్యంగా ‘గూగుల్ పిక్సెల్ 6 ఏ’ వచ్చేస్తోంది!
సాక్షి, ముంబై: ఊహించిన దానికంటే ముందుగానే గూగుల్ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. తాజా సమాచారం ప్రకారం గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్‌ను రేపే ( జూలై 21న) భారత మార్కెట్లో విడుదల కానుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ లాంచింగ్‌ను గూగుల్ ఇంకా ధృవీకరించలేదు. అయితే, గత రెండు రోజులుగా, హ్యాండ్సెట్లు ఇండియాకు షిప్ అవుతున్నాయన్న ఊహాగానాల మధ్య లాంచింగ్ అంచనాలు ఊపందుకున్నాయి. గూగుల్ పిక్సెల్ 6ఏ బాక్స్ ధర రూ. 43,999 అయినప్పటికీ ఇండియాలో రూ. 37,000లుగా ఉండవచ్చని అంచనా. అమెరికాలో దీన్ని సుమారు రూ. 35,000లకు విక్రయిస్తోంది. గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెక్స్ 6.1 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్ ఆండ్రాయిడ్ 12 OS 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 12.2MP + 12ఎంపీ డ్యూయల్ కెమెరాలు 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4306 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ -
ఆపిల్..గూగుల్..శాంసంగ్..! ఎవరు తగ్గేదెలే...!
దిగ్గజ టెక్ కంపెనీలు ఆపిల్, గూగుల్, శాంసంగ్ పోటాపోటీగా లాంచ్ ఈవెంట్స్‌కు సిద్దమయ్యాయి. ఈ మూడు కంపెనీలు తమ ఉత్పత్తుతో మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆపిల్, గూగుల్, శాంసంగ్ వరుసగా అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో లాంచ్ ఈవెంట్లను జరుపుతున్నాయి. ఆపిల్ మాక్‌బుక్ లాంచ్ ఈవెంట్...! ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్ 14ను ఐఫోన్13 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్13 స్మార్ట్ఫోన్లపై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణనే నోచుకుంది. ప్రపంచ మార్కెట్లలో తన సత్తాను మరోసారి చాటేందుకుగాను మ్యాక్‌బుక్స్, ఎయిర్‌పాడ్స్3తో ఆపిల్ అక్టోబర్ 18 న ముందుకురానుంది. ఈ సారి 14, 16 ఇంచుల మ్యాక్ బుక్‌తో ఆపిల్ లాంచ్ చేయనుంది. మాక్ బుక్ విషయంలో 2016 తరువాత తొలిసారి ఆపిల్ భారీ అప్‌గ్రేడ్‌కు సిద్దమైంది. ఇదే ఈవెంట్లో ఆపిల్ మ్యాక్ మినీ అప్‌గ్రేడెడ్ వెర్షన్, ఫైనల్ వెర్షన్ ఆప్ మాక్ఓఎస్ను కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. చదవండి: Apple: సరికొత్త ఆఫర్...మనీ యాడ్ చేస్తే...20 శాతం బోనస్..! గూగుల్ పిక్సెల్ 6 తో గూగుల్ రెడీ...! ఎప్పుడెప్పడాని ఎదురుచూస్తోన్న గూగుల్ పిక్సెల్ 6 స్మార్ట్ఫోన్లను అక్టోబర్ 19 లాంచ్ చేయనుంది. ఈవెంట్లో భాగంగా పిక్సెల్ 6 స్మార్ట్ఫోన్లతో పాటుగా న్యూ పిక్సెల్ బడ్స్, పిక్సెల్ వాచ్‌ను రిలీజ్ చేయనుంది. పిక్సెల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ కోసం యూజర్లు ఎదురుచూస్తున్నారు. శాంసంగ్ అన్ప్యాక్డ్ పార్ట్-2 పిక్చర్ అబీ బాకీ హే మేరే దోస్త్ అంటూ శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ పార్ట్-2 ఈవెంట్‌ను తెరపైకి తెచ్చింది. శాంసంగ్ ఈ ఏడాది అన్ప్యాక్డ్ ఈవెంట్‌తో మార్కెట్లలోకి జెడ్ ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3 స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ ఎడిషన్ ఈవెంట్‌తో శాంసంగ్ కలర్‌ఫుల్ ఫ్లిప్ సిరీస్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమరానికి సిద్దమైన దిగ్గజ కంపెనీలు..! గెలిచేది ఎవరో..? వరుస ఈవెంట్లతో దిగ్గజ టెక్ కంపెనీలు సమరానికి సిధ్దమైయ్యాయి. ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఆపిల్ తిరిగి రెండోస్థానాన్ని కైవసం చేసుకుని మరింత ఉత్సాహంతో ఉంది. మ్యాక్‌బుక్స్ లాంచింగ్ ఈవెంట్‌తో మరింత ఆదరణను పొందుతుందని ఆపిల్ భావిస్తోంది. అయితే కొంతమంది నిపుణులు గూగుల్ పిక్సెల్ 6 ఈవెంట్ కంటే ముందే రోజు ఈవెంట్‌ను ఏర్పాటు చేయడంలో ఆపిల్ కొంతమేర జంకినట్లుందని భావిస్తున్నారు. మరికొంత మందైతే గూగుల్ పిక్సెల్ 6 లాంచ్ ఈవెంట్‌కు పోటీగా ఆపిల్ ముందుకొచ్చిందని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్ల కోసం యూజర్లు ఎదురుచూస్తున్నారు. శాంసంగ్ ఎప్పటిలాగే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంది. శాంసంగ్ ఆన్ప్యాక్డ్ ఈవెంట్‌తో కలర్ ఫుల్ మడత ఫోన్లతో కొనుగోలుదారులను మరింత ఆకట్టుకునేందుకు సిద్దమైంది. ఏది ఏమైనా దిగ్గజ టెక్ కంపెనీల మధ్య పోటీ విషయంలో కొనుగోలుదారులే కీలక పాత్ర వహిస్తారని టెక్నికల్ నిపుణులు భావిస్తున్నారు. చదవండి: డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...! -
ఆ స్మార్ట్ఫోన్లు ఇకపై కనిపించవు...!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ప్రత్యర్థి ఆపిల్‌కు పోటీగా పిక్సెల్ స్మార్ట్ఫోన్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పిక్సెల్ 5ఏ 5జీ స్మార్ట్ఫోన్లను గూగుల్ మార్కెట్లలోకి రిలీజ్ చేసింది. కాగా గూగుల్ ఇకపై మార్కెట్లలోకి పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్ 5 స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు సమాచారం. గూగుల్ పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోనందుకు గాను పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్5 స్మార్ట్ఫోన్లను నిలిపివేయనుందని తెలుస్తోంది. చదవండి: Gautam Adani : గౌతమ్ అదానీకి భారీ షాక్..! పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్ 5 స్మార్ట్‌ఫోన్స్ గూగుల్ ఆన్లైన్ స్టోర్‌లో సోల్డ్ ఔట్ అనే మెసేజ్‌ను యూజర్లకు చూపిస్తోందని ప్రముఖ టెక్ ఎక్స్పర్ట్ న్యూస్ వెబ్సైట్ ది వెర్జ్ పేర్కొంది. పిక్సెల్ 4, పిక్సెల్ 4ఎక్స్ఎల్ను ప్రవేశపెట్టిన సంవత్సరంలోపే ఈ స్మార్ట్ఫోన్లను గూగుల్ నిలిపివేయనుంది. ప్రస్తుతం రిలీజ్ చేసిన గూగుల్ పిక్సెల్ 5ఏ 5జీ ను కేవలం అమెరికా, జపాన్ మార్కెట్లలోకే రిలీజ్ చేసింది. భారత మార్కెట్లలోకి ఎప్పుడూ వస్తూందనే విషయం గూగుల్ ఇప్పటివరకు వెల్లడించలేదు.గూగుల్ తన రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో స్మార్ట్ఫోన్లకు ఛార్జర్ లేకుండా మార్కెట్లలోకి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!) -
ఆ ఫోన్ల డేటానే ఎక్కువ సేకరిస్తున్న గూగుల్
గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి ఎక్కువ డేటాను సేకరిస్తోందని ఒక పరిశోధనలో తేలింది. ఈ డేటా సేకరణ ఆపిల్ ఫోన్ల కంటే అధికంగా ఉందని పేర్కొన్నారు. ఐర్లాండ్‌లోని ట్రినిటీ కాలేజీకి చెందిన పరిశోధకులు గూగుల్ పిక్సెల్ ఫోన్ తో షేర్ చేసిన డేటాను, ఆపిల్ ఐఫోన్ డేటాతో పోల్చారు. గూగుల్ ఆపిల్ కంటే 20 రెట్లు ఎక్కువగా హ్యాండ్సెట్ డేటాను సేకరిస్తుందని కనుగొన్నారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజ్‌కు చెందిన డగ్లస్ జె. లీత్ , అతని బృందం మొబైల్ హ్యాండ్సెట్ గోప్యతపై పరిశోధన నిర్వహించారు. కాగా ఏ తయారీదారు ఎక్కువగా యూజర్ డేటాను సేకరిస్తుందో చూడటానికి పిక్సెల్, ఐఫోన్ మోడల్స్ పై పరిశోధనను చేపట్టగా, పిక్సెల్, ఐఫోన్ మోడల్స్ రెండూ సగటున ప్రతి 4.5 నిమిషాలకు ఆయా తయారీదారులతో డేటాను పంచుకుంటున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.సేకరించిన డేటాలో ఐఎమ్ఈఐ నంబర్, హార్డ్‌వేర్ సీరియల్ నంబర్, సిమ్ సీరియల్ నంబర్ ,ఐఎంఎస్ఐ, హ్యాండ్సెట్ ఫోన్ నంబర్ మరిన్ని, టెలిమెట్రీ డేటా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లలో యూజర్ సిమ్‌ను వేసినప్పుడు, గూగుల్, ఆపిల్ కంపెనీలకు రెండింటికి వివరాలు వెళ్తాయి. అంతేకాకుండా ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ అడ్రస్‌లను, జీపీఎస్ లోకేషన్‌ను ఆపిల్‌కు పంపుతుందని తెలిసింది. ఆపిల్ లాగిన్ కానప్పుడు కూడా యూజర్ లోకేషన్‌ను, అలాగే స్థానిక ఐపీ అడ్రస్‌ను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ల నుంచి యూజర్లు వైదొలిగినప్పటికీ కూడా టెలిమెట్రీ డేటాను పంపుతాయని తేలింది. ఫోన్ ఆన్ చేసిన 10 నిమిషాల్లోనే గూగుల్ 1 ఏంబీ డేటాను సేకరిస్తుంది, ఆపిల్ 42కేబీ డేటాను సేకరిస్తుందని తెలిపారు. అయితే ఈ పరిశోధనను గూగల్ కొట్టివేసింది. పరిశోధన చేయడానికి సరైన కొలమానాలను తీసుకొలేదని గూగుల్ ప్రతినిధి వాదించారు. చదవండి: యూట్యూబ్ కొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ వార్కి చెక్ పెట్టనుందా? -
గూగుల్ పిక్సెల్ 5జీ ఫోన్లు లాంచ్
సాక్షి, ముంబై: గూగుల్ కొత్త 5జీ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. లగ్జరీ మొబైల్ ఫోన్ల విభాగంలో గూగుల్ పిక్సల్ 5, పిక్సల్ 4ఏ (5జీ) లను లాంచ్ చేసింది. అక్టోబర్ 15 న జపాన్‌లో మొదట లాంచ్ అవుతుంది. తరువాత ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, తైవాన్, బ్రిటన్, అమెరికా మొత్తం 9 దేశాలలో (అక్టోబర్ 15) అందుబాటులో ఉండనుంది. నవంబర్ నుండి ఇతర దేశాలలో లభ్యం కానుంది. ఇండియాలో అక్టోబర్ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని గూగుల్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. (కోట్లు దోచేస్తున్న యాప్స్ : చెక్ చెప్పిన చిన్నారి) 2021 నుండి గూగుల్ టీవీలాను లాంచ్ చేస్తున్నట్టు కంపెనీ ధృవీకరించింది. సోనీ , ఇతర ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ భాగస్వామ్యంతో స్మార్ట్ టీవీలను తీసుకొస్తున్నట్టు తెలిపింది. గూగుల్ పిక్సెల్ 5 5 జీ ఫీచర్లు 6.00-అంగుళాల స్ర్రీన్ 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 12 +16 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 4080 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం గూగుల్ పిక్సెల్ 5 5జీ ప్రారంభ ధర సుమారు రూ. 51,400 గూగుల్ పిక్సెల్ 4 ఏ 5 జీ 6.20 అంగుళాలు స్ర్రీన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 8 ఎంపీ సెల్ఫీకెమెరా 12 +16 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 3885 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం గూగుల్ పిక్సెల్ 4ఏ 5జీ ప్రారంభ ధర సుమారు రూ. 37,000 -
ఒక స్మార్ట్‌ఫోన్ రీఫండ్ అడిగితే..10 ఫోన్లు
గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన ఒక వినియోగదారుడికి అరుదైన అనుభవం ఎదురైంది. రెడిట్ ప్రచురించిన కథనం ప్రకారం చీటో అనే వినియోగదారుడు గూగుల్ పిక్సెల్ 3 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే అది సరిగ్గా పనిచేయకపోవడంతో, దాని డబ్బులు వాపసు ఇవ్వాలని కోరుతూ ( రూ.56,898) గూగుల్ కంపెనీని కోరాడు. అయితే దీనికి బదులుగా కేవలం రూ.5500 మాత్రమే రీఫండ్ చేసింది. ఇక్కడ ఇంకోట్విస్ట్ ఏంటంటే చీటో కి జాక్ పాట్ లాంటి ఆఫర్ వచ్చింది. నగదు రీఫండ్‌కు బదులుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పిక్సెల్ 3 స్మార్ట్ఫోన్ల పార్సిల్ పలకరించింది. దాదాపు 6 లక్షల రూపాయల విలువ చేసే పిక్సెల్ స్మార్ట్ఫోన్లు చూసి చీటో ఖంగుతిన్నాడు. అయితే తన సొమ్ము మొత్తం రీఫండ్ వచ్చే వరకు... ఈ స్మార్ట్ఫోన్లను కంపెనీకి వెనక్కి ఇచ్చేది లేదని ప్రకటించాడు. అయితే తాజా సమాచారం ప్రకారం గూగుల్ మొత్తం సొమ్మును చీటోకి రీఫండ్ చేసిందట. దీంతో చీటో మొత్తం 10 ఫోన్లను కంపెనీకి రీసెండ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కొసమెరుపు ఏంటంటే చీటో మరో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేయడంతో పదిఫోన్లు ఆర్డర్ చేసినట్టుగా భావించిందట కంపెనీ. అయితే పొరపాటుగా పంపించిన 10 ఫోన్లను రీఫండ్ చేయమని కంపెనీ అడిగే పరిస్థితిలో లేనప్పటికీ.. నిజాయితీగా తనకు వచ్చిన పార్సిల్‌ను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు సిద్దపడ్డాడు చీటో. -
ముద్దు పెడితే...అద్భుతమైన సెల్ఫీ
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల రంగంలో వినూత్నమైన, అద్భుతమైన ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా భారీ సెల్పీ కెమెరా, భారీ డిస్ప్లే.. డబుల్, ట్రిపుల్ కెమెరా.. ఫోల్డబుల్ ఇలా అద్భుతమైన స్మార్ట్ఫోన్లను యాడ్ అవుతూ వస్తున్నాయి. తాజాగా గూగుల్ పిక్సెల్ మరో సరికొత్త, ఆకర్షణీయ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ 3 స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్ అందిస్తోంది. కిస్ ఇస్తే..సెల్ఫీ..అవును...మీ ఇష్టులకు, ప్రేమికులకు ముద్దు పెడితే.. స్మార్ట్‌ఫోన్ ఆటోమేటిగ్గా సెల్ఫీ తీసే ఫీచర్‌ను జోడించింది. ఈ విషయాన్ని స్వయంగా తన గూగుల్ బ్లాగ్‌పోస్ట్‌లో వివరించింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ అధారంగా ఈ పనిచేసే ఈ ఫీచర్లో పిక్సెల్ కెమెరా ఆప్‌లో అప్డేట్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోబూత్ అనే ఒక మోడ్‌ను అందిస్తోంది. దీని ద్వారా నాణ్యమైన సెల్ఫీ తీసుకోవచ్చట. ఫోటో బూత్‌లోని షట్టర్ ఫ్రీ బటన్ ఆటోమేటిగ్గా ఫోటో తీస్తుంది. కిస్ డిటెక్షన్ మోడ్ ఫీచర్ ప్రధానంగా 5 ముఖ్యమైన ఫీలింగ్స్‌ను కెమెరా గుర్తించగలదు. అంతేకాదు మరో విశేషం కూడా ఉంది. ఫోటో తీస్తున్నపుడు.. మన కళ్లు తెరిచి ఉన్నాయా లేదా.. ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి.. కదులుతున్నామా? స్థిరంగా ఉన్నామా ? అనే విషయాన్ని కూడా ఈ కెమెరా పరిశిలీస్తుందట. అన్నీ నిర్ధారించుకున్న తరువాతే ఫోటో క్లిక్ చేస్తుందట. -
గూగుల్ కొత్త స్మార్ట్ఫోన్లను కొనాలనుకుంటున్నారా...
సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ప్రపంచ మార్కెట్లోకి తన కొత్త పిక్సెల్ స్మార్ట్ఫోన్లు ‘పిక్సెల్ 3’, ‘పిక్సెల్ 3 ఎక్స్ఎల్’ లను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ఫోన్లను కొనాలని ఆసక్తి ఉన్న వారి కోసం, భారతీ ఎయిర్టెల్ తన ఆన్లైన్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. బుధవారం నుంచి తన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ల ప్రీ-ఆర్డర్లను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఎవరైతే ఈ స్మార్ట్ ఫోన్లను కొనాలనుకున్నారో వారు డౌన్పేమెంట్లు కట్టి ఈఎంఐ ప్లాన్లలో వీటిని కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ఈ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడే డేటా, కాలింగ్, కంటెంట్ ప్రయోజనాలతో కూడిన పోస్టుపెయిడ్ ప్లాన్‌ను కంపెనీ అందించనుంది. గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3ఎక్స్ఎల్(64జీబీ), పిక్సెల్ 3ఎక్స్ఎల్(128జీబీ) వేరియంట్ల డౌన్పేమెంట్లు రూ.17,000, రూ.20,000, రూ.29,000గా ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 3(64జీబీ) వేరియంట్ అసలు ధర రూ.71వేల రూపాయలు, గూగుల్ పిక్సెల్ 3(128జీబీ) వేరియంట్ ధర 80వేల రూపాయలుగా ఉంది. ఇక గూగుల్ పిక్సెల్ 3ఎక్స్ఎల్ 64జీబీ వేరియంట్ ధర రూ.83వేలు కాగ, 128జీబీ మోడల్ ధర రూ.92వేలుగా ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు 8ఎంపీ+8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు, వెనుకవైపు 12.2 ఎంపీ సింగిల్ సెన్సార్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఎక్స్‌క్లూజివ్ ఇన్-కెమెరా గూగుల్ లెన్స్‌ను ఇది కలిగి ఉంది. -
గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లు లాంచ్
న్యూయార్క్: సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ పిక్సల్ సిరీస్‌లో లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. న్యూయార్క్‌లో జరిగిన ఈవెంట్లో గూగుల్ తన పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. భారీ డిస్ప్లే విత్ నాచ్, టాప్ షాట్ ఫీచర్‌తో అద్భుతమైన కెమెరాలు ప్రధాన ఫీచర్లు అని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు తొలిసారిగా వైర్లెస్(10 వాట్స్) చార్జర్లను జోడించింది. పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్ఎల్ ఫోన్లు క్లియర్లీ వైట్, జస్ట్ బ్లాక్, నాట్ పింక్ రంగుల్లో మాత్రమే లభిస్తున్నాయి. వీటితోపాటు గూగుల్ పిక్సల్ యూఎస్బీ టైప్ సి ఇయర్ బడ్స్‌ను బాక్స్‌లో అందిస్తున్నారు. పిక్సల్ కొత్త ఫోన్లకు ప్రీ ఆర్డర్లు అమెరికా మార్కెట్లో ఇప్పటికే ప్రారంభం కాగా, భారత్‌లో రేపటి నుంచి ఈ ఫోన్లకు ప్రారంభమవుతాయి. అలాగే భారత్‌లో నవంబర్ 1వ తేదీ నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఇక లాంచింగ్ ఆఫర్ విషయానికి వస్తే.. పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్ఎల్ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో వీటికి 50 శాతం బైబ్యాక్ ఆఫర్. అలాగే హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌తో అదనంగా మరో రూ.5వేల డిస్కౌంట్ ఇస్తారు. దీంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లో రూ.4వేల అదనపు రాయితీ కూడా ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లలోనూ కామన్‌గా ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0, 12.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు ప్రధాన ఫీచర్లుగా ఉంచింది. గూగుల్ పిక్సల్ 3 ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే 1080 x 2160 స్క్రీన్ రిజల్యూషన్ 2915 ఎంఏహెచ్ బ్యాటరీ గూగుల్ పిక్సల్ 3 ఎక్స్ఎల్ ఫీచర్లు 6.3 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 3430 ఎంఏహెచ్ బ్యాటరీ, -
ఆ స్మార్ట్ఫోన్ల అమ్మకాన్ని నిలిపేసిన గూగుల్
సెర్చ్ ఇంజిన్‌లో దూసుకుపోతున్న గూగుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు... పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్మార్ట్ఫోన్ల అమ్మకాన్ని ప్రస్తుతం గూగుల్ నిలిపివేసింది. గూగుల్ స్టోర్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్లు ఇక నుంచి అందుబాటులో ఉండవని కంపెనీ తెలిపింది. 2016 అక్టోబర్‌లో ఈ స్మార్ట్ఫోన్లను గూగుల్ లాంచ్ చేసింది. గూగుల్ పిక్సెల్ హార్డ్‌వేర్ కింద వచ్చిన తొలి స్మార్ట్ఫోన్లు ఇవే. గూగుల్ స్టోర్ నుంచి ఇక అందుబాటులో ఉండని ఈ స్మార్ట్ఫోన్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బెస్ట్ బై వంటి పలు ఆన్లైన్ స్టోర్లలో మాత్రమే లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం గూగుల్ తన స్టోర్‌లో స్మార్ట్‌ఫోన్ కేటగిరీ కింద కేవలం పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లనే లిస్టు చేసింది. 32జీబీ, 128జీబీ వేరియంట్లలో పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. 32జీబీ వేరియంట్ ధర రూ.57వేలకు ధరతో మార్కెట్లోకి రాగ, 128జీబీ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ రూ.66వేలతో లాంచ్ అయింది. పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ 32జీబీ వేరియంట్ ధర రూ.67వేలు కాగ, 128జీబీ వేరియంట్ ధర రూ.76వేలుగా ఉంది. పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లపై ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఒరిజినల్ పిక్సెల్ ఫోన్లను గూగుల్ తన ఆన్లైన్ స్టోర్ నుంచి తొలగించినట్టు తెలిసింది. ఆ రెండు పిక్సెల్ స్మార్ట్ఫోన్లకు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 821 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 12.3 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే, 5.5 అంగుళాల క్యూహెచ్డీ డిస్ప్లే ఉన్నాయి. -
ఆ ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్!
న్యూఢిల్లీ : గూగుల్ తన సొంత బ్రాండులో తాజాగా లాంచ్ చేసిన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుచేయాలని ఉందా? అయితే ఇదే సరియైన సమయమట. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ.7,000 డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు ఈ డిస్కౌంట్ ఆఫర్ నవంబర్ 30 వరకు అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ చెప్పింది. యాక్సిస్ బ్యాంకు కార్డు వినియోగదారులకు కూడా రూ.5,000 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందించనుంది. వీటితో ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో గూగుల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను గూగుల్ ప్రకటించింది. వెబ్సైట్లో ఈ ఫోన్‌పై రూ.26,000వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. అక్టోబర్ 13న గూగుల్ పిక్సెల్ బ్రాండులో రెండు స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర రూ.57,000గా ఉంది. ఆపిల్‌కు పోటీగా గూగుల్ ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు... 5 అంగుళాల ఫుల్ హెచ్డీ రిజుల్యూషన్ అమోలెడ్ డిస్ప్లే 2770 ఎంఏహెచ్ బ్యాటరీ 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 12.3 ఎంపీ రియర్ కెమెరా 4జీబీ ర్యామ్ 32 జీబీ, 128 జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్ ఆప్షన్స్ 1.6 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్