
సాక్షి, ముంబై: ఊహించిన దానికంటే ముందుగానే గూగుల్ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. తాజా సమాచారం ప్రకారం గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్‌ను రేపే ( జూలై 21న) భారత మార్కెట్‌లో విడుదల కానుంది.
గూగుల్ పిక్సెల్ 6ఏ లాంచింగ్‌ను గూగుల్ ఇంకా ధృవీకరించలేదు. అయితే, గత రెండు రోజులుగా, హ్యాండ్‌సెట్లు ఇండియాకు షిప్ అవుతున్నాయన్న ఊహాగానాల మధ్య లాంచింగ్ అంచనాలు ఊపందుకున్నాయి. గూగుల్ పిక్సెల్ 6ఏ బాక్స్ ధర రూ. 43,999 అయినప్పటికీ ఇండియాలో రూ. 37,000లుగా ఉండవచ్చని అంచనా. అమెరికాలో దీన్ని సుమారు రూ. 35,000లకు విక్రయిస్తోంది.
గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెక్స్
6.1 అంగుళాల FHD+ AMOLED
డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్
ఆండ్రాయిడ్ 12 OS
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
12.2MP + 12ఎంపీ డ్యూయల్ కెమెరాలు
8ఎంపీ సెల్ఫీ కెమెరా
4306 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్
Comments
Please login to add a commentAdd a comment