సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల రంగంలో వినూత్నమైన, అద్భుతమైన ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా భారీ సెల్పీ కెమెరా, భారీ డిస్‌ప్లే.. డబుల్, ట్రిపుల్ కెమెరా.. ఫోల్డబుల్ ఇలా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను యాడ్ అవుతూ వస్తున్నాయి. తాజాగా గూగుల్ పిక్సెల్ మరో సరికొత్త, ఆకర్షణీయ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ 3 స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్ అందిస్తోంది.
కిస్ ఇస్తే..సెల్ఫీ..అవును...మీ ఇష్టులకు, ప్రేమికులకు ముద్దు పెడితే.. స్మార్ట్‌ఫోన్ ఆటోమేటిగ్గా సెల్ఫీ తీసే ఫీచర్‌ను జోడించింది. ఈ విషయాన్ని స్వయంగా తన గూగుల్ బ్లాగ్‌పోస్ట్‌లో వివరించింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ అధారంగా ఈ పనిచేసే ఈ ఫీచర్‌లో పిక్సెల్ కెమెరా ఆప్‌లో అప్‌డేట్ చేసింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోబూత్ అనే ఒక మోడ్‌ను అందిస్తోంది. దీని ద్వారా నాణ‍్యమైన సెల్ఫీ తీసుకోవచ్చట. ఫోటో బూత్‌లోని షట్టర్ ఫ్రీ బటన్ ఆటోమేటిగ్గా ఫోటో తీస్తుంది. కిస్ డిటెక్షన్ మోడ్ ఫీచర్ ప్రధానంగా 5 ముఖ్యమైన ఫీలింగ్స్‌ను కెమెరా గుర్తించగలదు. అంతేకాదు మరో విశేషం కూడా ఉంది. ఫోటో తీస్తున్నపుడు.. మన కళ్లు తెరిచి ఉన్నాయా లేదా.. ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి.. కదులుతున్నామా? స్థిరంగా ఉన్నామా ? అనే విషయాన్ని కూడా ఈ కెమెరా పరిశిలీస్తుందట. అన్నీ నిర్ధారించుకున్న తరువాతే ఫోటో క్లిక్ చేస్తుందట.
Comments
Please login to add a commentAdd a comment