మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నేడు స్మార్ట్‌ఫోన్ జీవితంలో ఓ భాగమైపోయింది. పెద్దవారి విషయం పక్కన పెడితే.. పిల్లలు కూడా వీటికి అలవాటైపోతున్నారు, గంటలకొద్దీ వాటికే అతుక్కుపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి, వారికి ఫోన్ ఎంతవరకు అవసరమో.. అంతవరకు మాత్రమే ఉపయోగించేలా గూగుల్ ఓ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది.
గూగుల్ త్వరలోనే పిల్లలు ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడానికి 'స్కూల్ టైమ్' ఫీచర్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే కాకుండా టాబ్లెట్ ఓఎస్ వాచ్‌లలో కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ఏమిటి ఈ స్కూల్ టైమ్ ఫీచర్
స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించడానికి, పిల్లలు పరిమిత సమయం మాత్రమే ఉపయోగించడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది. స్మార్ట్‌ఫోన్ నుంచి పిల్లలను ఎలా దూరం చేయాలని ఆలోచించే తల్లితండ్రులకు ఇప్పుడు ఈ ఫీచర్ ఓ చక్కని పరిష్కారం అనే చెప్పాలి.
ఎలా ఉపయోగించాలి
స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్ వాచ్‌లలో స్కూల్ టైమ్ ఫీచర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫ్యామిలీ లింక్ ద్వారా తేదీ, టైమ్ వంటి వాటిని షెడ్యూల్ చేయాలి. దీని ద్వారా నిర్దిష్ట కాంటాక్ట్ నుంచి కాల్స్, మెసేజస్ అనుమతించడానికి అవకాశం ఉంటుంది. ఈ మోడ్ ఎప్పుడైనా లాక్ చేయవచ్చు, అన్‌లాక్ కూడా చేయవచ్చు.
గూగుల్ ఈ ఫీచర్‌ను వచ్చే ఏడాది లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత పిల్లలు స్మార్ట్‌ఫోన్ వినియోగించే సమయాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. దీనితో పాటు యూట్యూబ్ యాక్టివిటీ ఫీచర్ కూడా లాంచ్ చేయడానికి సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.
స్కూల్ టైమ్ ఫీచర్ ఉపయోగాలు
పిల్లలు తమ స్కూల్స్‌లో కూడా తరగతుల మీద దృష్టి సారించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూడకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment