సెర్చ్ ఇంజిన్‌లో దూసుకుపోతున్న గూగుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు... పిక్సెల్, పిక్సెల్ ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాన్ని ప్రస్తుతం గూగుల్ నిలిపివేసింది. గూగుల్ స్టోర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్లు ఇక నుంచి అందుబాటులో ఉండవని కంపెనీ తెలిపింది. 2016 అక్టోబర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లను గూగుల్ లాంచ్ చేసింది. గూగుల్ పిక్సెల్ హార్డ్‌వేర్ కింద వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్లు ఇవే. గూగుల్ స్టోర్ నుంచి ఇక అందుబాటులో ఉండని ఈ స్మార్ట్‌ఫోన్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బెస్ట్ బై వంటి పలు ఆన్‌లైన్ స్టోర్లలో మాత్రమే లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం గూగుల్ తన స్టోర్‌లో స్మార్ట్‌ఫోన్ కేటగిరీ కింద కేవలం పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లనే లిస్టు చేసింది.
32జీబీ, 128జీబీ వేరియంట్లలో పిక్సెల్, పిక్సెల్ ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. 32జీబీ వేరియంట్ ధర రూ.57వేలకు ధరతో మార్కెట్‌లోకి రాగ, 128జీబీ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ రూ.66వేలతో లాంచ్ అయింది. పిక్సెల్ ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్ 32జీబీ వేరియంట్ ధర రూ.67వేలు కాగ, 128జీబీ వేరియంట్ ధర రూ.76వేలుగా ఉంది. పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లపై ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఒరిజినల్ పిక్సెల్ ఫోన్లను గూగుల్ తన ఆన్‌లైన్ స్టోర్ నుంచి తొలగించినట్టు తెలిసింది. ఆ రెండు పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లకు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 821 ఎస్‌ఓసీ, 4జీబీ ర్యామ్, 12.3 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5 అంగుళాల ఫుల్-హెచ్‌డీ డిస్‌ప్లే, 5.5 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment