PLA
-
దొంగదెబ్బ తీసిన కమాండర్లకు ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం!
బీజింగ్: పొరుగు దేశం చైనా మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత సైనికులపై దొంగదెబ్బ తీయటంలో కీలకంగా వ్యవహరించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ కమాండ్ జనరల్స్‌పై ప్రశంసలు కురిపించింది. చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కమాండ్ జనరల్స్‌కు ప్రమోషన్ కల్పిస్తూ.. టాప్ పోస్టులు కట్టబెట్టారు. ప్రస్తుతం భారత సరిహద్దులోని వెస్టర్న్ థియోటర్ కమాండ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► జనరల్ హీ వెయిడాంగ్(65)ను సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) కొత్త వైస్ ఛైర్మన్‌గా నియమించారు జిన్‌పింగ్. సీఎంసీకు అధ్యక్షుడి హోదాలో జిన్‌పింగ్ నేతృత్వం వహిస్తారు. మరోవైపు.. సీఎంసీలో ఎలాంటి పదవులు చేపట్టకుండానే వైస్ ఛైర్మన్ పోస్టులోకి జనరల్ హీ వెయిడాంగ్ను నియమించటం గమనార్హం. ► జనరల్ ఝాంగ్ యూక్సియా(72).. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించారు. పదవీ విరమణ వయసు దాటినప్పటికీ ఆయనను ఫస్ట్ ర్యాంకింగ్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. పీఎల్ఏలో జిన్‌పింగ్‌కు కుడిభుజంగా ఝాంగ్‌ను చెప్పుకుంటారు. ► జనరల్ జు క్విలింగ్(60)ను 205 మంది సభ్యులుగా ఉన్న పార్టీ కొత్త సెంట్రల్ కమిటీలో నియమించారు జిన్‌పింగ్. మరోవైపు.. నియంత్రణ రేఖ వద్ద సంక్షోభం తలెత్తిన క్రమంలో జనరల్ జు క్విలింగ్ ఇంఛార్జిగా ఉన్నారు. దీంతో 2021 జులైలో డబ్ల్యూటీసీ హెడ్‌గా , లెఫ్టినెంట్ జనరల్ నుంచి జనరల్‌గా పదోన్నతి పొందారు. మరోవైపు.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ(69)కి సైతం పదవీ విరమణ వయసు దాటినప్పటికీ తనతోనే అట్టిపెట్టుకున్నారు జిన్‌పింగ్. పొలిట్ బ్యూరోలోకి వాంగ్ యీని తీసుకున్నారు. పార్టీ విదేశీ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: చరిత్రకెక్కిన జిన్‌పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా.. -
తూర్పులద్దాఖ్‌లో పీఎల్ఏపై ఆర్మీ పైచేయి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత ఆర్మీ చైనా పీఎల్ఏపై పైచేయి సాధించింది. ఒక వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే గడిచిన మూడు వారాల్లో కీలకమైన 20 పర్వత ప్రాంతాలను భారత సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. భారత్ ఇచ్చిన షాక్‌తో దిమ్మెర పోయిన చైనా ఆర్మీ అరుణాచల్‌ప్రదేశ్‌తో గల సరిహద్దుల్లో మోహరింపులు పెంచి, కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో భారత్, చైనా కమాండర్ స్థాయి ఆరో విడత చర్చలు సోమవారం జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ సమావేశంలో భారత బృందంలో విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి కూడా పాలు పంచుకునే అవకాశముంది. ఈ చర్చలు తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖకు చైనావైపున్న మోల్దోలో జరగనున్నాయి. లద్దాఖ్ గగనతలంపై రఫేల్ యుద్ధ విమానాలు పహారా కాస్తున్నాయి.‘ఆగస్టు 29 మొదలు సెప్టెంబర్ రెండో వారం వరకు భారత సైన్యం 20 ప్రధాన పర్వత ప్రాంతాలను ఆక్రమించింది. ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్న వాటిలో మగార్ హిల్, గురుంగ్ హిల్, రెచెన్ లా, రెజంగ్ లా, మొఖ్‌పరితోపాటు ఫింగర్ 4కు సమీపంలోని పర్వతప్రాంతం ఉన్నాయి’ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ‘ఇంతకుముందు ఈ ప్రాంతాల్లో చైనా ఆర్మీ పీఎల్ఏ ఆధిపత్యం ఉండేది. తాజా పరిణామంతో మన బలగాలు ఈ ప్రాంతంలో శత్రువుపై పైచేయి సాధించినట్లయింది’అని ఆ వర్గాలు తెలిపాయి. భారత భూభాగం వైపున పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణం వైపు ఉన్న ఈ పర్వత భాగాలను ఆక్రమించుకునే క్రమంలో చైనా ఆర్మీ ప్రతిఘటించిందనీ, ఈ సందర్భంగా మూడు పర్యాయాలు గాల్లోకి కాల్పులు కూడా జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత ఆర్మీ కదలికలతో ఇప్పటికే ఉన్న బలగాలకు తోడు మరో 3,000 బలగాలను చైనా అదనంగా రెజంగ్ లా, రెచెన్ లా పర్వత ప్రాంతాలకు సమీపంలోకి రప్పించిందని తెలిపాయి. దీంతోపాటు మోల్డో సైనిక స్థావరంలోకి అదనపు బలగాలను తరలించిందని వివరించాయి. అరుణాచల్ సరిహద్దుల్లో చైనా కుట్ర తూర్పు లద్దాఖ్ అనంతరం చైనా దృష్టి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై పడింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలతో అప్పర్ సుబన్‌సిరిలోని అసపిలా, లాంగ్జు, బిసా, మఝా ప్రాంతాల్లోకి పీఎల్ఏ మోహరింపులు పెరిగాయి. దీంతోపాటు ఎల్ఏసీకి సమీపంలోని బిసాలో ఒక రోడ్డును కూడా నిర్మించింది. భారత సైన్యం కూడా దీటుగా స్పందించింది. ఆరు సమస్యాత్మక ప్రాంతాలు, 4 సున్నిత ప్రాంతాల్లో గస్తీని పెంచింది. ఎలాంటి దురాక్రమణనైనా తిప్పికొట్టేందుకు సర్వం సన్నద్ధమైంది. -
సరిహద్దు వివాదం : డ్రాగన్ కుటిల యుద్ధతంత్రం
సాక్షి, న్యూఢిల్లీ : భారత దళాల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు చైనా నక్కజిత్తులు ప్రదర్శిస్తోంది. యుద్ధం చేయకుండానే ప్రత్యర్ధులను మానసికంగా దిగజార్చాలని చైనా సైనిక వ్యూహకర్త సున్ సూ రాసిన ‘యుద్ధకళ’ పుస్తకాన్ని డ్రాగన్ ఇప్పటికీ అనుసరిస్తోంది. లడఖ్‌లో మోహరించిన భారత సైనికులపై ఇప్పటికీ పీఎల్ఏ, కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికలు అవే మానసిక యుద్ధతంత్రాలను ప్రయోగిస్తున్నాయి. గత నెల 29 రాత్రి ప్యాంగాంగ్ త్సూ ప్రాంతంలో చైనా దళాల దాడిని భారత్ సమర్ధంగా తిప్పికొట్టి ఫింగర్ 4పై తన ప్రాబల్యాన్ని తిరిగి హస్తగతం చేసుకున్న అనంతరం చైనా సైన్యం తొలుత ట్యాంకులు, దళాలతో విరుచుకుపడాలని భావించినా రెడ్ లైన్ అతిక్రమిస్తే భీకర ప్రతిదాడి తప్పదని భారత సైన్యం స్పష్టం చేయడంతో డ్రాగన్ వ్యూహం మార్చింది. చదవండి : సరిహద్దులో సంసిద్ధం.. చైనా సైనిక ఎత్తుగడలకు భారత సైన్యం తలొగ్గకపోవడంతో 1962 నాటి యుద్ధతంత్రాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ప్రదర్శించింది. కీలక పర్వత ప్రాంతంలో భారత్ గస్తీని నిలువరించే క్రమంలో ఫింగర్ 4 వద్ద పీఎల్ఏ లౌడ్స్పీకర్లలో పంజాబీ పాటలను వినిపించింది. ఇక ప్యాంగాంగ్ త్సో దక్షిణ తీరంలో లౌడ్ స్పీకర్లలో హిందీలో భారత సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా పీఎల్ఏ వ్యవహరించింది. ఢిల్లీలో కూర్చున్న రాజకీయ పెద్దల ఇష్టానుసారం శీతాకాలంలో ప్రతికూల వాతావరణంలో సైనికులను ఇక్కడ మోహరించారని, చలి వాతావరణంలో వేడి భోజనం, రవాణా సౌకర్యాలు లేవని, రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదురవుతుందంటూ రెచ్చగొట్టారు. భారత సైనికుల్లో అసంతృప్తి రాజేసేందుకు పీఎల్ఏ కుటిల యత్నాలకు పాల్పడింది. 1962లో కూడా తూర్పు, పశ్చిమ సెక్టార్లలో 1967 నాథులా వివాదంలోనూ పీఎల్ఏ ఇదే లౌడ్‌స్పీకర్ ఎత్తుగడలకు పాల్పడిందని సైనిక నిపుణులు చెబుతున్నారు. చైనా సేనలు పాంగాంగ్ త్సో వద్ద కుటిల గూఢచర్యానికి పాల్పడుతుంటే చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక భారత్‌పై విషం చిమ్ముతోంది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడం, ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు నరేంద్ర మోదీ సర్కార్ లడఖ్‌పై కఠిన వైఖరి అవలంభిస్తోందని రాసుకొచ్చింది. -
భారతీయుల కిడ్నాప్.. చైనా స్పందన
న్యూఢిల్లీ: భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య డ్రాగన్ దళాలు గత వారం ఐదుగురు భారతీయులను సరిహద్దుల దగ్గర నుంచి కిడ్నాప్ చేశాయనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే సెప్టెంబర్ 5న ట్వీట్ ద్వారా మొదటిసారి ఈ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో దీని గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయుల అదృశ్యం గురించి చైనా సైన్యానికి హాట్‌లైన్ మెసేజ్ పంపించామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ క్రమంలో చైనా ఇలా స్పందించడం గమనార్హం. ‘ఆ ప్రాంతంలో ఐదుగురు భారతపౌరుల అదృశ్యం గురించి భారత సైన్యం పీఎల్ఏకు సందేశం పంపించిందనే దాని గురించి కూడా మా దగ్గర ఎటువంటి వివరాలు లేవు’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిజియన్ జావో వ్యాఖ్యానించినట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్‌ను తామెప్పుడూ గుర్తించలేదన్న చైనా.. అది తమ దేశంలోని దక్షిణ టిబెట్ ప్రాంతమని సంచలన వ్యాఖ్యలు చేసింది. (చదవండి: ఆగని డ్రాగన్ ఆగడాలు) వేటకు వెళ్లిన సమయంలో టగిన్ తెగకు చెందిన టోచ్ సింగ్కమ్, ప్రసత్, రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తను బకెర్, ఎంగ్రూ దిరి అనే ఐదుగుర్ని చైనా సైన్యం అపహరించింది. మరో ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకొని రావడంతో...ఈ విషయం వెలుగు చూసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 37-పసిఘాట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ట్విటర్లో ‘కొన్ని నెలల ముందు, ఇలాంటి సంఘటన జరిగింది. మరోమారు పునరావృతం అయ్యింది. చైనాకు తగిన సమాధానం ఇవ్వాలి’ అని ట్వీట్ చేయడంతో అని ఈ విషయం మొదట వెలుగులోకి వచ్చింది. ఐదుగురిని అపహరించారని.. జిల్లాలోని నాచో గ్రామం నుంచి పీఎల్ఏ వారిని కిడ్నాప్ చేసిందని ఎరింగ్ తెలిపారు. -
మళ్లీ చైనా దుస్సాహసం
న్యూఢిల్లీ: చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సరిహద్దుల్లో మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. గల్వాన్ ఘటన అనంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో మరోసారి రెచ్చగొట్టేందుకు పీఎల్ఏ చేసిన ప్రయత్నానికి భారత్ గట్టిగా బదులిచ్చింది. తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని కొనసాగిం చాలంటూ కుదిరిన ఒప్పందాన్ని కాలరాస్తూ ఆగస్టు 29వ తేదీ అర్ధరాత్రి పాంగోంగ్ సో సరస్సు దక్షిణం ఒడ్డుకు చైనా బలగాలు చేరుకున్నాయి. పసిగట్టిన భారత సైన్యం వేగంగా స్పందించింది. ఆ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున బలగాలను తరలించి, వారి ప్రయత్నాన్ని వమ్ము చేసింది. అయితే, ఎలాంటి భౌతిక పరమైన ఘర్షణలు చోటుచేసుకోలేదని కేంద్రం తెలిపింది. పాంగోంగ్ సో సరస్సు చుట్టుపక్కల అన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో బలగాలను, ఆయుధ సంపత్తిని మరింత పెంచినట్లు వెల్లడించింది. తూర్పు లద్దాఖ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక, దౌత్యవర్గాల మధ్య చర్చల్లో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఆగస్టు 29/30 రాత్రి పీఎల్ఏ బలగాలు యథాతథ స్థితిని మార్చేందుకు రెచ్చగొట్టేలా సైనిక కదలికలకు పాల్పడ్డాయని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ ఆనంద్ తెలిపారు. ‘క్షేత్రస్థాయిలో యథాతథ పరిస్థితులను ఏకపక్షంగా మార్చాలన్న చైనా ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. ఆ ప్రాంతంలోని కీలక పోస్టుల్లో బలగాలను సమీకరించడం సహా అన్ని చర్యలు చేపట్టింది’అని కల్నల్ ఆనంద్ తెలిపారు. ‘పాంగోంగ్ సో సరస్సు దక్షిణ ఒడ్డున పీఎల్ఏ కదలికలు కనిపించాయి. వెంటనే భారత ఆర్మీ ఆ ప్రాంతంలో బలగాల సంఖ్యను భారీగా పెంచింది. యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఈ వ్యవహారంపై చుషుల్‌లో బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి’ అని కల్నల్ ఆనంద్ వివరించారు. ‘శాంతి, సామరస్యాలు కొనసాగేందుకు భారత ఆర్మీ కట్టుబడి ఉంది. అంతే స్థాయిలో, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు కృత నిశ్చయంతో ఉంది’ అని వివరించారు. ఆగస్టు 29వ తేదీ అర్ధరాత్రి చైనా బలగాలు పెద్ద సంఖ్యలో తూర్పు లద్దాఖ్‌లోని పాంగోంగ్ సో దక్షిణం వైపునకు చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని, తిష్టవేసేందుకు ప్రయత్నిం చాయి. పసిగట్టిన భారత బలగాలు వారిని నిలువరించేందుకు వెంటనే భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి తరలివెళ్లాయి. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఎలాంటి భౌతిక దాడులు చోటుచేసుకోలేదు’అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాంగోంగ్ సో సరస్సు ఉత్తర తీరం వైపు రెండు దేశాల బలగాలు గతంలో తలపడ్డాయి. కానీ, దక్షిణం వైపు ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం అని వెల్లడించాయి. ఈ పరిణామంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా ప్రయత్నాన్ని ఆర్మీ సీరియస్‌గా తీసుకుందనీ, పాంగోంగ్ సో ఉత్తర, దక్షిణ తీరం, చుట్టుపక్కల కీలక ప్రాంతాల్లోకి బలగాలతో పాటు ఆయుధ సంపత్తిని తరలించింది. భారత్ గట్టిగా డిమాండ్ చేస్తున్న విధంగా ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా కట్టుబడి ఉన్నట్లు కనిపించడం లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. కాగా, జూన్ 15వ తేదీన గల్వాన్ ఘటన తర్వాత చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం ఇది మొదటిసారి. ఉద్రిక్తతలను సడలించుకు నేందుకు ఇరు దేశాలు అంగీకరించినా పాంగోంగ్ సో, డెప్సాంగ్, మరో రెండు ఘర్షణాత్మక ప్రాంతాల్లో చైనా సైన్యం తిష్టవేసుకుని ఉంది. దీంతో భారత్ భారీగా సైన్యాన్ని మోహరించింది. అత్యాధునిక ఆయుధ సంపత్తిని తరలించింది. మిరేజ్–2000, సుఖోయ్ 30 ఎంకేఐ వంటి ఫైటర్ జెట్లను ఎల్ఏసీ వెంట మోహరించింది. అతిక్రమించలేదు: చైనా చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందించారు. చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. ఆ రేఖను వారెప్పుడూ అతిక్రమించలేదు. సరిహద్దుల్లో రెండు వైపుల సైన్యం క్షేత్ర స్థాయి అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నాయి’ అని వివరించారు. ‘గతంలో అంగీకరిం చిన అంశాలను భారత్ ఉల్లంఘించింది. పాంగోంగ్ సో సరస్సు దక్షిణతీరంతో పాటు రెకిన్ పాస్‌ను ఆగస్టు 31వ తేదీన భారత్ బలగాలు అతిక్రమించాయి. తీవ్రమైన రెచ్చగొట్టే చర్య సరిహద్దుల వెంట ఉద్రిక్తతలకు కారణమైంది. చైనా సైన్యం ఇటువంటి వాటిని దీటుగా ఎదుర్కొంటుంది’ అంటూ పీఎల్ఏ పశ్చిమ కమాండ్ ప్రతినిధి కల్నల్ ఝాంగ్ షుయిలీ చేసిన ప్రకటనను అధికార జిన్హువా ప్రచురించింది. -
చైనాతో మళ్లీ యుద్ధ వాతావరణం..??
కిబితు, అరుణాచల్ ప్రదేశ్ : వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద గస్తీ నిర్వహిస్తోన్న భారత సైన్యం నిబంధనలకు అతిక్రమిస్తోందని చైనా ఆరోపిస్తోంది. చైనా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గస్తీని ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేసింది. అసిఫాలోని సుబాన్సిరి ప్రాంతంలో భారత్‌లో అంతర్భాగమని అందుకే పహారా కాస్తుమని గత నెల 15న జరిగిన సైనిక బలగాల సమావేశం(బీపీఎం) (ఇరుదేశాల మధ్య సైనిక వివాదాలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు)లో భారత్ ప్రకటించడంతో ఈ వివాదం రాజుకుంది. ఎల్ఏసీపై ఐదు చోట్ల బమ్ లా, కిబితు(అరుణాచల్ ప్రదేశ్), దౌలత్ బెగ్ ఒల్డి, చుశుల్(లడఖ్), నాథులా సిక్కింలలో బీపీఎం కేంద్రాలు ఉన్నాయి. అరుణాచల్‌లోని అసాఫి ప్రాంతంలో చైనా పలుమార్లు నిబంధనలు అతిక్రమించిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవాధీన రేఖపై పూర్తి అవగాహనతోనే పహారా కాస్తున్నామని చెప్పారు. అసాఫిలలో భారత బలగాలు గస్తీ నిర్వహిస్తే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశాలున్నాయని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. -
చైనా సైనికులతో ముచ్చటించిన నిర్మలా
న్యూఢిల్లీ : ‘నమస్తే’ అంటే అర్థం మీకు తెలుసా? అంటూ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చైనా సైనికులను ప్రశ్నించారు. శనివారం సిక్కిం సరిహద్దులో గల నాథులాలో ఆమె పర్యటించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులతో నిర్మలా మచ్చటించిన వీడియోను రక్షణ శాఖ ట్వీటర్లో పోస్టు చేసింది. చైనా అధికారులను పరిచయం చేసుకునే క్రమంలో వారికి చేతులు జోడించి నమస్కరించారు హోం మంత్రి. మీకు నమస్తే అంటే ఏంటో తెలుసా? అని వారిని ప్రశ్నించారు. గ్రీటింగ్స్ అని భారత సైనికులు చెప్పబోగా.. వారిని వారించి చైనా సైనికులను చెప్పాలని కోరారు. అనంతరం చైనీస్ భాష(మాండరిన్)లో ‘నమస్తే’ పదానికి అర్థం(నిహో) ఏంటని వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సైనికులు, మంత్రి పరస్పరం ‘నమస్తే’ చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు మంత్రికి మధ్య ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించిన సైనికాధికారిని నిర్మలా అభినందించారు. తన పేరు వాంగ్ అని చెప్పుకొచ్చిన సైనికాధికారి, తమ భాషలో వాంగ్ అంటే ‘రాజు’ అని అర్థం అని చెప్పారు. అందుకు స్పందించిన నిర్మలా సో మనకు ట్రాన్స్‌లేటర్‌గా కింగ్ ఇక్కడ ఉన్నారన్నమాట అని చమత్కరించారు. డోక్లాంలో చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఇటీవల ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం చైనా డోక్లామ్ నుంచి సైనికులను ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలిపింది. అయితే, డోక్లామ్‌కు 10 కి.మీ. దూరంలోని చుంబీ వ్యాలీలో చైనా మళ్లీ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో.. చైనా సరిహద్దుల్లో రక్షణ మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.