
కిబితు, అరుణాచల్ ప్రదేశ్ : వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద గస్తీ నిర్వహిస్తోన్న భారత సైన్యం నిబంధనలకు అతిక్రమిస్తోందని చైనా ఆరోపిస్తోంది. చైనా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గస్తీని ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేసింది. అసిఫాలోని సుబాన్‌సిరి ప్రాంతంలో భారత్‌లో అంతర్భాగమని అందుకే పహారా కాస్తుమని గత నెల 15న జరిగిన సైనిక బలగాల సమావేశం(బీపీఎం) (ఇరుదేశాల మధ్య సైనిక వివాదాలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు)లో భారత్ ప్రకటించడంతో ఈ వివాదం రాజుకుంది.
ఎల్‌ఏసీపై ఐదు చోట్ల బమ్ లా, కిబితు(అరుణాచల్ ప్రదేశ్), దౌలత్ బెగ్ ఒల్డి, చుశుల్(లడఖ్), నాథులా సిక్కింలలో బీపీఎం కేంద్రాలు ఉన్నాయి. అరుణాచల్‌లోని అసాఫి ప్రాంతంలో చైనా పలుమార్లు నిబంధనలు అతిక్రమించిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవాధీన రేఖపై పూర్తి అవగాహనతోనే పహారా కాస్తున్నామని చెప్పారు. అసాఫిలలో భారత బలగాలు గస్తీ నిర్వహిస్తే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశాలున్నాయని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment