plagiarism
-
‘దారుణం, అతడి ప్రతిభను కొట్టేశారు’
హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్, సింగర్ బాద్షాపై నెటిజన్లు గరం అవుతున్నారు. ఇతరుల ప్రతిభను కొట్టేసి అది మీదేనని చెప్పుకోడానికి మనసెలా వచ్చిందని నిలదీస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆడిపాడిన మ్యూజిక్ ఆల్బమ్ ‘జెండా ఫూల్’ ఈ మధ్యే రిలీజ్ అయింది. దీనికి ఎంతగా విశేష ఆదరణ దక్కిందో, అంతే స్థాయిలో విమర్శలపాలవుతోంది. దీని మూలాలు బెంగాలీ పాటను గుర్తు చేస్తున్నాయి. దీంతో ఇది బెంగాలీ ఫోక్ సాంగ్ అని, ఒరిజినల్ పాటకు కర్త, కర్మ, క్రియ అయిన జానపద కళాకారునికి గుర్తింపునివ్వకపోవడం దారుణమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అతడి అనుమతి లేకుండా నిర్దాక్షిణ్యంగా కాపీ కొట్టారని విరుచుకుపడుతున్నారు. ఈ విషయం గురించి బెంగాలీ సంగీతకారుడు రోహన్ దాస్‌గుప్తా స్పందిస్తూ.. ‘రతన్ కహార్ అనే బెంగాల్ జానపద కళాకారుడు ఈ పాటను రూపొందించడంతోపాటు తానే స్వయంగా లిరిక్స్ రాసి పాడాడు. ఇప్పుడు వచ్చిన జెండా ఫూల్.. అతను 1970లో "బోరోలోకర్ బీటీ లో" అంటూ గొంతెత్తి పాడాడు. దురదృష్టమేంటంటే తాజా పాట సంగీతం, లిరిక్స్‌పై హక్కులు కోరుతూ దావా వేసేందుకు అతని దగ్గర డబ్బు లేదు. కానీ ఈ పాట అచ్చంగా అతనిదేనన్న నిజం అందరికీ తెలియాలి’ అని కోరుతూ ట్వీట్ చేశాడు. యూట్యూబ్‌లో ‘జెండా ఫూల్’ పాట వీడియోలో అతని పేరును కూడా చేర్చాలంటూ పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా రతన్ కహార్ పశ్చిమ బెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లాలో శౌరి గ్రామంలో నివసిస్తున్నారు. (సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!) -
భావచౌర్యం కట్టడికి యూజీసీ కొత్త విధానం!
న్యూఢిల్లీ: భావచౌర్యాన్ని కట్టడి చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త ముసాయిదా విధానాన్ని రూపొందించింది. విద్యార్థులు బాధ్యతగా కొత్త అధ్యయనాలు చేసేందుకు, కాపీ కొట్టకుండా పరిశోధనా వ్యాసాలు రాసేందుకు ఈ చర్య దోహదపడనుంది. ఒకే తరహా వ్యాసాలను గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ముసాయిదా పేర్కొంది. ఇతరుల వ్యాసాలను కాపీ కొట్టకుండా, అంతగా అవసరమైతే మూల వ్యాసం రాసిన వారి అనుమతి తీసుకుని ఆ సమాచారాన్ని వాడుకునేలా విద్యార్థులు, ఉపాధ్యాయులకు కళాశాలల యాజమాన్యాలు సూచనలివ్వాలనే నిబంధన ముసాయిదాలో ఉంది. పరిశోధన సాగించడం, ప్రాజెక్టు వర్కు పూర్తి చేయడం, వ్యాసాలు రాయడం తదితర అంశాలపై కళాశాలలు అవగాహాన సదస్సులు నిర్వహించాలని ముసాయిదా పేర్కొంటుంది. -
చేతన్ భగత్ నవలపై దుమారం!
ప్రముఖ రచయిత చేతన్ భగత్ తాజా నవల ‘వన్ ఇండియన్ గర్ల్’ చుట్టు వివాదం ముసురుకుంది. ఈ నవలలో చేతన్ గ్రంథచౌర్యానికి పాల్పడ్డారని, తాను రాసిన ఓ కథను కాపీకొట్టి ఆయన నవలను రాశారని బెంగళూరుకు చెందిన రచయిత్రి కోర్టును ఆశ్రయించింది. చేతన్ నవల ’ఫైవ్ పాయింట్ సమ్‌వన్’ను ఢిల్లీ యూనివర్సిటీ పాఠ్యాంశంగా తీసుకున్న సమయంలో ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాతో ఈ అంశం పెద్ద దుమారం రేపుతోంది. చేతన్ భగత్ తన కథ ‘డ్రాయింగ్ ప్యారలల్స్’ను కాపీ కొట్టారని బెంగళూరు రచయిత్రి అన్విత బాజ్‌పేయి దావా వేశారు. 2014లో బెంగళూరు సాహిత్సోత్సవానికి వచ్చిన సందర్భంగా తన కథల సంకలనం ‘లైఫ్, ఆడ్స్ అండ్ ఎండ్స్’ను ఆయనకు సమీక్ష కోసం ఇచ్చానని, అందులోని కథను ఆయన గ్రంథచౌర్యం చేసి ‘వన్ ఇండియన్ గర్ల్’ నవల కోసం వాడుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో ఆమె ఫేస్బుక్లో పెట్టిన పోస్టు ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది.