విమానానికి తప్పిన పెను ముప్పు: 194 మంది సురక్షితం
ఇండియన్ ఎయిర్లైన్స్ విమానానికి ముంబై ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది. మంగుళూరు నుంచి వచ్చిన ఈ విమానం ముంబైలో ల్యాండ్ అవుతున్న సమయంలో వెనుక భాగం నేలను ఢీకొట్టడంతో ఇటు ప్రయాణికులతోపాటు అటు సిబ్బంది కూడా ఒక్కసారిగా హతాశులయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరుగలేదు. ఇందులో ప్రయాణిస్తున్న 194 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు పైలట్లను విధుల నుంచి తొలిగిస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు.
పాక్్-భారత్ క్రికెట్ మ్యాచ్ చేసేందుకు అడిలైడ్ బయలుదేని క్రీడాభిమానులకు కూడా ఎయిర్ ఇండియా ఇలాంటి షాకే ఇచ్చింది. విమానం దాదాపు 10 గంటలు ఆలస్యమవ్వడంతో మ్యాచ్ ముగిసిన తర్వాతగానీ సదరు క్రీడాభిమానులు స్టేడియానికి చేరుకోలేకపోయారట! ఇలా నిర్వహణలో కనీస ప్రమాణాలు పాటించడంలేదనే అపవాదులు మూటగట్టుకున్న ఇండియన్ ఎయిర్లైన్స్ ఇమేజ్ తాజా ఘటనతో మరింత దిగజారింది.