లక్ష్యసాధనలో ఎన్టీపీసీ రామగుండం వెనుకంజ
జ్యోతినగర్, న్యూస్‌లైన్: ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ సంస్థ 2013-14 వార్షిక లక్ష్యసాధనలో వెనుకంజలో ఉంది. నిర్ధేశిత వార్షిక లక్ష్యం 20,519 మిలియన్ యూనిట్లు కాగా మార్చి 30 వరకు 98శాతం ప్లాంటులోడ్ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్)తో 19,683 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఒకరోజు 63 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు. గతేడాది నిర్ధేశించిన వార్షిక లక్ష్యం 20,448 మిలియన్యూనిట్లు కాగా ఐదురోజుల ముందుగానే 91శాతం పవర్‌లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) ఉత్పత్తితో వార్షిక లక్ష్యాన్ని చేరుకుంది.
మొత్తంగా గడిచిన వార్షిక సంవత్సరంలో 20,785 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. ప్రస్తుతం 20,519 మిలియన్‌యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిలక్ష్యంగా నిర్ణయించినా లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు. వర్షాలు పడి సింగరేణి నుంచి ఆశించిన మేరకు బొగ్గు రవాణాకాలేదు. దీంతో కొన్ని రోజులు ఓ యూనిట్‌ను నిలిపేశారు. దీంతో లక్ష్యాన్ని చేరుకోవడంతో వెనుకబడ్డది.