plice
-
టేకు అక్రమరవాణా కేసు:ఐదుగురి రిమాండ్
మాక్లూర్ : మండలంలోని చిక్లీ గ్రామ శివారులో అక్రమంగా టేకు కలప రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. మాక్లూర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ మండలంలోని సారంగపూర్ గ్రామంలోని డైయిరీ ఫారంకు చెందిన షేక్‌వాజీద్, అప్సర్‌ఖాన్, మహమ్మద్ అతీక్, మహబూబ్, ఆటోనగర్‌కు చెందిన షకీల్ అనే ఐదుగురు వ్యక్తులు మండలంలోని చిక్లీ క్యాంపుకు చెందిన ప్రభాకర్‌రావు, చిక్లీ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి, నవీపేట మండలంలోని హన్మాన్ ఫారంకు చెందిన ప్రతాప్‌రెడ్డి పొ లాల్లో నుంచి గతేడాది నుంచి టేకు చెట్ల ను నరికేసి రాత్రి వేళలో టేకు దుంపల ను వ్యాన్‌లో తరలించేవారన్నారు. బాధితులు మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చే శారన్నారు. మంగళవారం చిక్లీ గ్రామ శి వారులో వాహనాలు తనిఖీ చేస్తున్న స మయంలో వ్యాన్‌ను అపి తనిఖీ చేయగా రూ.2లక్షల 50వేలు విలువైన టేకు కలప, వ్యాన్‌ను పట్టుకుని సీజ్ చేశామాన్నారు. నిందితులను విచారణ చేయగా నేరాన్ని అంగీకరించారన్నారు. సమావేశంలో సీఐ బుచ్చయ్య, ఎస్సై రామునాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పరస్పరం దాడులు..ఒకరి మృతి
పొన్నూరు : పాతకక్షల నేప«థ్యంలో పరస్పరం జరుపుకున్న దాడుల్లో ఒకరు మృతిచెందగా, ఇద్దరు గాయాలపాలైన సంఘటన మండల పరిధిలోని జూపూడి గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు..జూపూడి గ్రామానికి చెందిన గండికోట శ్రీనివాసరావు పొలానికి వెళుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన తాడిశెట్టి కృష్ణ బరిసెతో దాడిచేశాడు. ప్రాణభయంతో తప్పించుకున్న శ్రీనివాసరావు ఇంటికి చేరుకొని బంధువులకు తెలిపాడు. శ్రీనివాసరావు బావమరిది కొండా సురేష్ ఈ విషయంపై మాట్లాడేందుకు కృష్ణ ఇంటికి వెళ్లాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి సురేష్‌ను కృష్ణ పొట్టలో బరిసెతో పొడవడంతో అతని పేగులు బయటపడ్డాయి. స్థానికులు అతన్ని నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు వర్గీయులు మూకుమ్మడిగా కృష్ణపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో కృష్ణ స్ఫృహతప్పి పడిపోయాడు. అతన్ని గుంటూరు తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలను, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొన్నూరు రూరల్, అర్బన్, పెదనందిపాడు, కాకుమాను స్టేషన్లకు సంబం«ధించిన పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బాపట్ల డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.