ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
సుల్తానాబాద్(కరీంనగర్): మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో గత రెండు రోజులుగా తాగు నీరు సరఫరా కాకపోవడంతో.. ఆగ్రహించిన మహిళలు ఆదివారం ఉదయం ఖాళీ బిందెలతో తమ నిరసన తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని డిమాండ్ చేస్తూ.. రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.