వడదెబ్బకు వృద్ధుడి మృతి
పుత్తూరు రూరల్ : వడదెబ్బకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పుత్తూరు మండల పరిధిలోని తడుకు హరిజనవాడలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తడుకు హరిజనవాడకు చెందిన పీ.మునస్వామి(55) ఆరుబయట మల మూత్ర విసర్జనకు పొలాల్లోకి వెళుతూ వడదెబ్బ సోకడంతో తిరుపతి-చెన్నై జాతీయ రహదారి పక్కన స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి చనిపోయాడు. మునస్వామి భార్య, కుమారుడు గతంలోనే మృతి చెందగా, కోడలు జ్యోతి, ఆమె పిల్లలిద్దరినీ సంరక్షిస్తున్నారు. ఆయన మృతితో వారు అనాథలయ్యారు.