Poduru
-
ఆచంట నియోజకవర్గంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం
-
Khadi Fabric: ఖాదీ ఎందుకంత స్పెషల్? జరీ అంత కాస్ట్లీ ఎందుకు?
ఎర్రకోట అనగానే ఎవరికై నా పతాకావిష్కరణ గుర్తుకొస్తుంది. వినువీధిలో త్రివర్ణ పతాక రెపరెపలు చూడగానే మనసు దేశభక్తితో ఉప్పొంగిపోతుంది. అటువంటి వేడుకలో ఖాదీకి కూడా చోటు లభిస్తే.. నేరుగా దేశ ప్రధాని మోదీతో ముచ్చటించే అవకాశం లభిస్తే.. మన ముఖం పొందూరు జరీ ఖాదీ పంచె అంచులా మెరిసిపోతుంది. ఉత్సాహం ఉప్పొంగి మనసే ఉత్సవ వేదికగా మారుతుంది. సరిగ్గా అటువంటి అపురూప అనుభవమే ఇద్దరు పొందూరు ఖాదీ కళాకారుల సొంతమైంది. స్వాతంత్య్రోద్యమంలో భాగస్వామి అయిన పొందూరు ఖాదీ ప్రతినిధులుగా దేశ రాజధాని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని, ప్రధానితో మాట్లాడే అపురూప క్షణాలు జీవితంలో మర్చిపోలేనివని ఉత్సవాల్లో పాల్గొన్న నేతకారులు గర్వంగా చెబుతున్నారు. ఢిల్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వారినే ఎందుకు ఎంపిక చేశారు? వారి ప్రత్యేకత ఏమిటి? ఢిల్లీలో అనుభవాలు ఏమిటి? వారి నుంచే తెలుసుకుందాం. కాంతమ్మా.. కుశలమా.. ఈమె పేరు జల్లేపల్లి కాంతమ్మ. పొందూరు. వయసు 75. ఆరేళ్ల ప్రాయం నుంచి సంప్రదాయ ఖాదీ వస్త్రం తయారు చేస్తోంది. దేశంలోనే నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం గల అతికొద్ది మంది వ్యక్తుల్లో కాంతమ్మ ఒకరు. ముగ్గురు కుమారులు బాగానే స్థిరపడినా.. ఖాదీ మీద మక్కువతో ఆమె పాత ఇంటిలోనే ఉంటూ రోజుకు 6 గంటలు ఇదే పనిలో నిమగ్నమవుతున్నారు. కేవలం రోజుకు రూ.200 మాత్రమే సంపాదిస్తున్నా.. కోట్ల రూపాయల విలువైన తృప్తి కోసమే తాను ఈ పని చేస్తున్నానని గర్వంగా చెబుతున్నారు ఆమె. తాను 75 ఏళ్ల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నానని అంటే అది ఖాదీ పుణ్యమేనని.. చెబుతారు కాంతమ్మ. అసలు కాంతమ్మ ఎంచుకున్న సంప్రదాయ విధానం ఏమిటి? వాలుగు చేప ముల్లుతో పత్తిని శుభ్రపరచడం ఖాదీ వస్త్రం తయారీలో ఈ దశలు కీలకమైనవి.. నిడుచుటగా పిలిచే ప్రక్రియలో పత్తి గింజలను వేరు చేయడం పత్తిని మెత్తగా తయారు చేయడం చిలపలు పోయడం మరిచిపోలేని జ్ఞాపకం.. నేను చదువుకోలేదు. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసింది.. ఖాదీ తయారీలో భాగమవ్వడమే. నేను ఏ రోజూ కష్టపడుతున్నాననే భావన నాలో రానీయను. ఇష్టంగా పనిలో నిమగ్నమవుతా. నన్ను కలిసేందుకు చాలా మంది వస్తుంటారు. ఖాదీ తయారీలో ప్రక్రియల్ని ఓపికగా వివరిస్తా. వారికి అర్థమయ్యేంత వరకు విడిచిపెట్టను. ఖాదీ గొప్పతనాన్ని వారికి చెబుతా. ఢిల్లీ.. ఎర్రకోట ప్రధాన మంత్రి వంటి పదాలు వినడమే తప్ప.. నేను ఎప్పుడూ చూస్తానని కలలో కూడా ఊహించ లేదు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు నాలాంటి సామాన్యురాలిని ఎర్రకోటకు పిలిచి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాతో మాట్లాడడం నిజంగా నా అదృష్టం. చాలా గర్వంగా ఉంది. – జల్లేపల్లి కాంతమ్మ, పొందూరు. ఏకు చుట్టడం జరీ నేతలో మొనగాడు చిత్రంలో వీరిద్దరి పేర్లు భద్రయ్య, లక్ష్మి. భార్యభర్తలు. ఊరు పొందూరు. ఇద్దరూ నేతకారులే. జరీపంచె నేతలో ఒకే ఒక్కడు ఈ భ ద్రయ్య. మంచి నైపుణ్యం ఈయన సొంతం. ఏఎన్నార్ పేరుతో పిలిచే ఖాదీ పంచెకు బంగారం వర్ణంలో ఉండే అంచును అత్యంత అద్భుతంగా నేయడంలో ఈయనది అందెవేసిన చేయి. ఇంటర్ వరకు చదువుకున్న భద్రయ్య వృత్తిలో సంతృప్తి వెతుకునే వ్యక్తి త్వం ఉన్న మనిషి. రోజుకు కేవలం రూ.500 మాత్ర మే సంపాదించే ఈయన జరీనేతలో దేశవ్యాప్తంగా ఉన్న కొద్ది మంది నేతన్నలలో మొనగాడే. ఈ నేతకు ఇద్దరు వ్యక్తులు అవసరం కావడంతో భార్య సహకారంతో మనసుకు నచ్చిన పనిచేసి దేశప్రధాని మనసును గెలుచుకున్నాడు ఈ నేతన్న. ఏమిటీ జరీ నేత..ఖరీదు ఎందుకంత..! పంచెకు అంచు అందం. అంచు ఎంత ఎక్కువ తళుక్కుమంటే అంత ఖరీదైనదని అర్థం. శ్వేత, గోధుమ వర్ణంలో సున్నితంగా ఉండే ఖాదీ జరీపంచెలు కాస్త ఖరీదైన వ్యవహారం. మామూలు ఖాదీ పంచె రూ. 600 నుంచి రూ.800 మధ్యలో లభ్యమవుతుంది. ఒక్కో జరీ పంచె ఖరీదు రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు పలుకుతుందంటే దీని ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. జీవితాంతం గుర్తుండిపోయేలా.. ఉదయం లేవడం.. వృత్తిలో నిమగ్నమవ్వడం. నా కుటుంబం. ఇదే నా దినచర్య. ఢిల్లీకి బయల్దేరాలని ఖాదీ బోర్డు సభ్యులు చెబితే ఆశ్చర్యమేసింది. అదీ ఎర్రకోటలో జరిగే మువ్వన్నెల వేడుకకు.. ప్రధానిని కలిసేందుకు అంటే చాలా గర్వపడ్డాను. ప్రధానమంత్రిని దగ్గర నుంచి చూశా. ఓ నేతకారుడిగా నాకు దక్కిన ఈ గొప్పఅవకాశం.. ఆ అద్భుత క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. నాకు వృత్తిలో చేదోడు వాదోడుగా ఉండే నా భార్యతో సహా నేను ఢిల్లీకి వెళ్లడం జీవితంలో మరిచిలేనిది. – బళ్ల భద్రయ్య, పొందూరు -
మమతల కోవెలలు.. మండువా లోగిళ్లు
ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దర్పణంలా.. మమతానురాగాలకు కోవెలలుగా మండువా లోగిళ్లు నిలుస్తున్నాయి.. వందేళ్లు దాటినా నేటికీ చెక్కుచెదరకుండా ఠీవిగా దర్శనమిస్తున్నాయి.. అలనాటి దర్పాన్ని, హుందాతనాన్ని చాటుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.. ఉభయగోదావరి జిల్లాల్లోని డెల్టా ప్రాంతాల్లో మండువా లోగిళ్లు అత్యధికంగా ఉన్నాయి. పశ్చిమగోదావరితో పాటు కోనసీమ ప్రాంతాల్లో 200కు పైగా కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు నియోజకవర్గ పరిధిలోని రేలంగి, సమీప గ్రామాలతోపాటు ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర, పోడూరు, ఆచంట, పాలకొల్లు నియో జకవర్గ పరిధిలోని యలమంచిలి, వేడంగి, భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం తదితర మండలాల్లోని అనేక గ్రామాల్లో మండువా లోగిళ్లు దర్శనమిస్తున్నాయి. నేటికీ అనేక సినిమాలు ఇక్కడి మండువా లోగిళ్లలోనే షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. పోడూరులో 1916 నాటి మండువా నాణ్యతలో మేటిగా.. పూర్వం సంపన్నులు, ఉమ్మడి కుటుంబాల వారు ఎక్కువగా మండువా లోగిళ్లను నిర్మించుకునేవారు. అప్పట్లో 300 గజాల స్థలంలో ఇలాంటి ఇళ్లు నిర్మించడానికి రూ.30 వేలు, వెయ్యి గజాల్లో నిర్మించడానికి రూ.70 వేల వరకు ఖర్చయ్యేదని చెబుతారు. ప్రధానంగా పాటిమట్టి, గానుగ సున్నంతో 3, 4 అడుగుల వెడల్పు గోడలతో ఎంతో విశాలంగా, పటిష్టంగా వీటిని నిర్మించేవారు. వీటికి పెంకులతో కూడిన పైకప్పులు వేసేవారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే విశాలమైన హాలునే మండువా అనేవారు. ఆ హాలు చుట్టూ 3 వైపులా ఉమ్మడి కుటుంబాలు ఉండేలా గదులను పోర్షన్లుగా నిర్మించేవారు. ప్రతి పోర్షన్‌కు పైన నాణ్యమైన కలపతో చేసిన మిద్దెలు అత్యంత విశాలంగా ఉంటాయి. ఈ మిద్దెలను స్టోర్ రూమ్‌లుగా వాడేవారు. అలాగే వరదలు, తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు.. బందిపోటు దొంగల భయం ఉన్నపుడు నివసించేందుకు వీలుగా వీటిని ముందుచూపుతో నిర్మించేవారని ఇప్పటి పెద్దలు చెబుతుంటారు. వేడంగిలో సుమారు 150 ఏళ్ల నాటి మండువా లోగిలి గాలి, వెలుతురు, చల్లదనం పుష్కలం ఈ ఇళ్లల్లో గాలి, వెలుతురు పుష్కలంగా ఉండేలా కిటికీలు ఎక్కువగా పెట్టేవారు. అలాగే మండువా హాలులో పైకప్పును నాలుగైదు అడుగుల మేర చతురస్రాకారంలో ఖాళీగా ఉంచేవారు. ఇంటికి ఉండే కిటికీల నుంచే కాకుండా ఈ ఖాళీ ప్రదేశం నుంచి సూర్యరశ్మి, గాలి, వెలుతురు పుష్కలంగా వస్తుంది. ఇక్కడ నుంచి వర్షం నీరు నేరుగా కింద పడుతుంది. కొంతమంది వర్షం నీరు బయటకు వెళ్లేలా పైపును అమర్చేవారు. అవసరాన్ని బట్టి కొన్ని ఇళ్లను రెండు మండువాలతో నిర్మించేవారు. పూర్వం నిర్మించిన ఈ మండువా లోగిళ్లకు ఎక్కువగా బర్మా టేకు, బర్మా మద్ది (నల్లమద్ది)ని వినియోగించేవారు. ప్రధాన ద్వారాలు భారీగా ఉండటంతోపాటు ప్రధాన ద్వారంపై, నిలువు స్థంభాలపై ఎంతో అందమైన, ఆకర్షణీయమైన కళాత్మక రూపాలు చెక్కించేవారు. ఈ మండువా లోగిళ్లకు ఇవే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. పెంకుటి పైకప్పుతో ఉండడం వల్ల వేసవికాలంలో కూడా ఈ ఇళ్లు చల్లదనంతో ఉంటాయి. నిర్వహణ ఖర్చు అధికమే.. ప్రస్తుతం మండువా ఇళ్లను పరిరక్షించడం భారీ ఖర్చుతో కూడుకున్నప్పటికీ 5, 6 తరాలకు చిహ్నాలుగా ఉన్న ఇళ్లను కుటుంబీకులు పరిరక్షించుకుంటున్నారు. ప్రధానంగా కలప చెద పట్టకుండా నాలుగు లేదా ఐదేళ్లకు ఒకసారి స్ప్రే చేయించడం, కిటికీలు, తలుపులు, మిద్దె పైకప్పులను తరుచూ శుభ్రం చేయించడం, నాలుగేళ్లకు ఒకసారి పెంకులను అవసరమైన మేరకు మార్చడం చేస్తున్నారు. మాది ఏడో తరం ఈ ఇల్లు దాదాపు 125 ఏళ్ల క్రితం నిర్మించారు. మాది 7వ తరం. ఇప్పటికీ మా ఇల్లు పటిష్టంగానే ఉంది. చిన్న, చిన్న మరమ్మతులు చేయించాం. నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నా పూర్వీకులు ఇచ్చిన ఇల్లు కావడంతో పాడవకుండా రక్షించుకుంటున్నాం – చేకూరి సుబ్బరాజు, పోడూరు 120 ఏళ్ల క్రితం ఇల్లు మాది మా ఇల్లు నిర్మించి సుమారు 120 ఏళ్లవుతోంది. మా మనవలతో లెక్కేస్తే 8వ తరం ఇంట్లో ఉంటున్నట్లు. ఇంకో 50 ఏళ్లయినా అలాగే ఉంటుంది. పెంకుటిల్లు కావడంతో ముఖ్యంగా పెంకు నిలబడే రిఫర్ దెబ్బతినకుండా చూసుకోవాలి. 3, 4 ఏళ్లకు ఒకసారి అవసరమైన మరమ్మతులు చేయిస్తాం. – ఆర్ఎస్ రాజు, పోడూరు -
వికారాబాద్ బాలిక ఘటన అసలు ఏం జరిగిందంటే...?
-
వికారాబాద్ విద్యార్థిని హత్యాచారం కేసు.. ప్రియుడే హంతకుడు
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ పదో తరగతి విద్యార్థిని అత్యాచారం, హత్య కేసును పోలీసులు చేధించారు. హత్య చేసింది ప్రియుడు మహేందరేనని పోలీసులు నిర్ధారించారు. మద్యం మత్తులో అత్యాచారానికి ఒడిగట్టినట్లు, ఆపై హత్యకు పాల్పడినట్లు తేల్చారు. ఈ మేరకు విద్యార్థిని హత్యాచారం ఘటనకు సంబంధించిన వివరాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన పదిహేనేళ్ల విద్యార్థినితో.. నిందితుడు మహేందర్‌కు ఏడాదిగా పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే ఇద్దరు కలుసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. ఇద్దరూ సోమవారం ఉదయం బయట కలుసుకున్న క్రమంలో.. శారీరకంగా కలవాలని బాధితురాలిపై మహేందర్ ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ పెనుగులాటలో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను బలంగా నెట్టడంతో పక్కనే ఉన్న చెట్టుకు తల తగిలి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై శరీరంలో చలనం లేకపోవడంతో విషయం బయటపడుతుందని గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత తనకేమీ తెలియనట్లు ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఈ కేసులో క్లూస్ టీం, పోలీసుల విచారణ, డాక్టర్ల ఒపీనియన్ ఆధారంగా ఘటన జరిగిన 48 గంటల్లోనే కేసును చేధించాం. విచారణను పూర్తి చేసి నిందితుడిని బుధవారం సాయంత్రం కోర్టులో ప్రవేశ పెడతాం’ అని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. చదవండి: ప్రేమ వివాహం.. భార్యను బతికుండగానే పూడ్చిపెట్టాడు -
Poduru: ఇక్కడి మండువా లోగిళ్లలోనే ఆ సినిమా షూటింగులు!
ఒకప్పుడు కుటుంబ గౌరవానికి ప్రతీక మండువా లోగిలి. ఉమ్మడి కుటుంబాలకు నిలువెత్తు నిదర్శనాలు ఆ ఇళ్లు. ఆ ఇంటి యజమానికి సంఘంలో పెద్దరికం (గౌరవం) ఉండేది. ఆ తరువాత ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో మండువాలోగిళ్ల అవసరం లేకపోయింది. డెల్టా ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మండువాలోగిళ్లు మనకు దర్శనమిస్తాయి. గాలి, వెలుతురు ప్రసరించేలా ఉండే వాటి నిర్మాణాలు, విశాలమైన గదులు ఎంతో అబ్బురపరుస్తాయి. పోడూరు (పశ్చిమగోదావరి జిల్లా): దాదాపు 40 ఏళ్ల క్రితం వరకు గ్రామాల్లో మండువాలోగిళ్లు ఎక్కువగా ఉండేవి. పచ్చని పంటచేలు, కాలువలతో కళకళలాడే పల్లెలకు ఈ మండువాలోగిళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ఆ తరువాత పట్టణాలకు దీటుగా గ్రామాల్లో కూడా కాంక్రీటు భవనాల నిర్మాణం పెరిగింది. దీంతో పల్లెల్లో మండువాలోగిళ్లు కనుమరుగవుతున్నాయి. పోడూరు గ్రామంలో ఇప్పటికీ పలు మండువాలోగిళ్లు చెక్కుచెదరకుండా ఉన్నాయి. దాదాపు 50 పైగా కుటుంబాలు ఇప్పటికీ వాటిలోనే నివాసం ఉంటున్నారు. ఈ మండువాలోగిళ్ల వల్లే ఒకప్పుడు పోడూరు గ్రామం సినిమా షూటింగ్‌లకు ప్రసిద్ధి గాంచింది. అందంగా హుందాతనంగా, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మండువాలోగిళ్లలో షూటింగ్‌లు తీసేందుకు దర్శకులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. చిల్లర కొట్టు చిట్టెమ్మ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, కాంచనమాల కేబుల్ టీవీ, చిలకపచ్చ కాపురం సినిమాల షూటింగ్ పోడూరు గ్రామంలోని మండువా లోగిళ్లలో చిత్రీకరించారు. పోడూరులో ఇప్పటికీ వంద, 120 ఏళ్ల నాటి మండువా లోగిళ్లను చూడవచ్చు. కాలక్రమేణా ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కుటుంబాలు విదేశాలకు, నగరాలకు తరలిపోవడం కారణంగా మండువాలోగిళ్లు కనుమరుగవుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలకు నెలవు పూర్వం రోజుల్లో దాదాపుగా అన్నీ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వారంతా మండువాలోగిళ్లలో ఉండేవారు. ఇంట్లో పనులు కూడా అందరూ కలసికట్టుగా చేసుకునేవారు. అందరూ కలసి భోజనాలు చేసేవారు. కుటుంబ పెద్దలు, కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనవరాళ్ల సందడితో ప్రతీరోజూ పండుగ వాతావరణం ఉండేది. కష్టం వచ్చినా, సమస్య వచ్చినా అందరూ కలసి సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకునేవారు. నిర్మాణం ఇలా మండువాలోగిళ్లను గట్టి పునాదులపై నిర్మించేవారు. దాదాపు 4 అడుగుల వెడల్పు, 5 అడుగుల వరకు లోతులో పునాదులు నిర్మించేవారు. పునాదుల గోతులను నీళ్లు పోసి పశువులతో తొక్కించేవారు. తరువాత ఇసుక వేసి బేస్మెంట్ లెవెల్ వరకు వరద తాకిడిని తట్టుకునేలా రాతితో లేదా కాల్చిన ఇటుక (పండు ఇటుక)తో కట్టేవారు. ఆపై పచ్చి ఇటుక లేదా పండు ఇటుకతో నిర్మించేవారు. అప్పట్లో మండువాలోగిళ్లు, ఇతర ఇంటి నిర్మాణాలకు గానుగ సున్నం వాడేవారు. ఇసుక, సున్నం, బెల్లం, కోడిగుడ్లు కలిపి గానుగ తిప్పి గానుగ సున్నం తయారు చేసేవారు. దీని తయారీకి ప్రత్యేకంగా నిపుణులు ఉండేవారు. నాలుగువైపులా గదుల నిర్మాణం, మధ్యలో గాలి, వెలుతురు వచ్చేలా పైకప్పు ఖాళీ ఉండడం మండువాలోగిళ్ల ప్రత్యేకత. పైనుంచి కురిసిన వర్షం నీరు బయటకు వెళ్లేలా ప్రత్యేకంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు ఉంటుంది. పైకప్పు పెంకులతో ఉంటుంది. గుమ్మాలు, కిటికీలకు బర్మా టేకు, రంగూన్ టేకు ఎక్కువగా వాడేవారు. అందమైన నగిషీ చెక్కుడుతో తయారు చేసిన గుమ్మాలు, తలుపులు వాడేవారు. ఇంటి నిర్మాణానికి దాదాపుగా 8 నెలల నుంచి ఏడాదిన్నర కాలం పట్టేది. ఇల్లును పదిలంగా చూసుకుంటున్నాం మా తాతలు పూర్వం ఎంతో వ్యయ ప్రయాసలతో కట్టి ఇచ్చిన ఇల్లు కావడంతో ఎంతో పదిలంగా చూసుకుంటున్నాం. కోతుల సంచారంతో అప్పుడప్పుడు పైకప్పు దెబ్బతింటుంది. పెంకు నేసే వాళ్లు ఇప్పుడు అంతగా దొరకడం లేదు. ఇళ్లు కూడా పెద్దవి కావడంతో మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. 130 ఏళ్ల కిందట నిర్మించిన ఇంట్లో మేము నివసిస్తున్నాం. - ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు, పోడూరు వేసవిలో చల్లగా ఉంటుంది మండువాలోగిళ్లలో వేసవిలో చాలా చల్లగా ఉంటుంది. పెంకుల పైకప్పుతో పాటు గాలి, వెలుతురు బాగా ఉండడం వల్ల వేసవిలో ఉక్కబోత ఉండదు. కాంక్రీటు బిల్డింగ్‌ల కంటే మండువాలోగిళ్లలో నివాసం ఎంతో ఆరోగ్యకరంగా, ఆహ్లాదంగా ఉంటుంది. - రుద్రరాజు సుజాత, పోడూరు చదవండి: ఐదు రోజుల పెళ్లి, అక్కడ వరుడు తాళి కట్టడు! -
‘బెయిల్‌పై బయటికొస్తాడేమోనని భయంగా ఉంది’
సాక్షి, పోడూరు : ప్రేమోన్మాది దాడి చేస్తాడని కలలో కూడా ఊహించలేకపోయానని, దాడి వల్ల గాయాలతో తాను చావకుండానే నరకం చూశానని కవిటం గ్రామంలో ఈ ఏడాది అక్టోబర్ 16న ప్రేమోన్మాది చేతిలో హత్యాయత్నానికి గురైన కళాశాల విద్యార్థిని కొవ్వూరి తేజస్విని చెప్పింది. దాడి తరవాత ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె కొద్దిరోజుల కిందట కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి కవిటంలో తన నివాసానికి వచ్చింది. ఇంటి వద్ద మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన సుధాకర్‌రెడ్డి లాంటి సైకోలు సమాజంలో తిరగకూడదని చెప్పింది. తన లాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని పేర్కొంది. పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో తాను ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్టీ్ర ఫస్టియర్ చదువుతున్నానని, ఈ కోర్సు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయాలనుకున్నానని.. ఈ కోర్సు పూర్తి చేయడమే తన లైఫ్ టర్నింగ్‌పాయింట్ అని.. ఇటువంటి తరుణంలో ప్రేమ పేరుతో కొంతకాలంగా తనను వేధిస్తున్న మేడపాటి సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి తనను చంపే ప్రయత్నంతో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో తాను జీవితంలో కోలుకోలేని దెబ్బతిన్నానని తేజస్విని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై ఉన్మాదంతో దాడి చేసిన మేడపాటి సుధాకర్‌రెడ్డి బెయిల్ తీసుకొని జైలు నుంచి బయటకు వస్తాడని వదంతులు వస్తుండడంతో కొద్దిరోజులుగా తాను ఎంతో ఆందోళన చెందుతున్నట్టు తేజస్విని చెప్పింది. సుధాకర్‌రెడ్డి తనపై దాడి తరవాత వెంటనే స్పందించి ఆసుపత్రికి చేర్చిన పోలీసులకు, గ్రామస్తులకు, మంచి వైద్యం అందేలా కృషి చేసిన రాష్ట్ర మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు, ఆళ్లనానికి, వైఎస్సార్సీపీ నేత గుంటూరి పెద్దిరాజుకు, గ్రామ నాయకులు కర్రి శ్రీనివాస్‌రెడ్డికి, సత్తి మురళీకృష్ణారెడ్డికి తేజస్విని కృతజ్ఞతలు తెలిపింది. -
పక్కా పథకం ప్రకారమే తేజస్వినిపై దాడి
సాక్షి, ఏలూరు: ప్రేమ పేరుతో వేధిస్తూ ఉన్మాది దాడిలో గాయపడి ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవ్వూరి తేజస్వినిని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా పోడూరు మండలం కవిటంకు చెందిన డిగ్రీ విద్యార్థిని తేజస్వినిని పథకం ప్రకారమే మేడపాటి సుధాకర్‌రెడ్డి హతమార్చేందుకు కత్తితో దాడికి పాల్పడినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి తేజస్వినిని ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తుండటంతో ఆమె కుటుంబసభ్యులకు విషయాన్ని తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు విషయాన్ని గ్రామ పెద్దలు దృష్టికి తీసుకు వెళ్లడంతో తేజస్వినిని ఇబ్బంది పెట్టనని సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ఈ ఘటనతో తేజస్వినిపై కక్ష పెంచుకున్న సుధాకర్‌రెడ్డి ఆమెను హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేశాడు. సమయం కోసం మాటువేసి కత్తితో ఆమెపై దాడి చేశాడు. తేజస్విని పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పెద్దల సమక్షంలో రాజీ జరిగినప్పట్నుంచీ కళాశాలకు వెళ్లేటపుడు రోజూ ఆమె మేనమామ శ్రీనివాసరెడ్డి బస్సు ఎక్కించి వస్తున్నారు. అయితే బుధవారం పని ఉండి మేనమామ ఆమె వెంట రాలేదు. తేజస్విని ఒంటరిగా ఉండటాన్ని పసిగట్టిన సుధాకర్‌రెడ్డి వెస్పాపై కత్తులు ఉన్న సంచి తీసుకుని ఆమెను వెంబడించాడు. కత్తితో దాడికి తెగబడ్డాడు. సమీపంలోని ఇంటి పెరట్లోకి తేజస్విని పరుగెత్తడంతో అక్కడే ఉన్న ఆ ఇంటి యజమానితో పాటు మరొకరు సుధాకర్‌రెడ్డిని అడ్డుకున్నారు. ఓవైపు వారిని విదిలించుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు తేజస్వినిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాడి తరువాత సుధాకర్‌రెడ్డి నోటి నుంచి నురుగ రావడంతో దాడి చేయడానికి ముందే అతడు పురుగుమందు తాగినట్లు తెలుసతఓంది.. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరినీ చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం తేజస్విని ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా సుధాకర్‌రెడ్డికి గతంలోనే వివాహం అయింది. అయినా తేజస్వినిని ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. -
‘భారతీయుడినని సగర్వంగా చెప్పుకునేలా చేశాడు’
సాక్షి, పశ్చిమ గోదావరి: ‘జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏను రద్దు చేసి దేశమంతటా ఒకే రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన ధీరుడు ప్రధాని నరేంద్ర మోదీ’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం పోడూరు మండలం వేడంగిలో బీజేపీ సభ్యత్వ నమోదులో కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఒక్కరు భారతీయుడు అని సగర్వంగా చెప్పుకునే విధంగా మోదీ సుపరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి తామే వాటిని అమలు చేసినట్లు దుష్ప్రచారం చేసిందని టీడీపీని విమర్శించారు. పైగా ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు అందినకాడికి ప్రజలను దోచుకున్నారని మండిపడ్డారు. -
అన్నను హత్య చేసిన తమ్ముడు
పోడూరు(ప.గో జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదం గ్రామం చిలకరత్నం పేటలో విషాదం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా సొంత అన్ననే తమ్ముడు హత్య చేశాడు. ఆస్తితగాదాల నేపథ్యంలో తమ్ముడు రంగినీడి దుర్గారావు-అన్న రంగినీడి నాగేశ్వరరావు(34)ను ఇనుప రాడ్‌తో తల పై కొట్టి హత్య చేశాడు. పోడూరు పోలీసులు మర్డర్ (302) కేసు నమోదు చేసి దుర్గారావును అరెస్టు చేశారు. -
జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం,ఇద్దరు మృతి
-
జగన్నాథపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, పోడూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని 108 వాహనాల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదసమయంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. మార్టేరు నుంచి పాలకొల్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పండిత విల్లూరుకు చెందిన ఆటోడ్రైవర్ డి. వెంకటేశ్వరరావు(40), కృష్ణా జిల్లా మూలలంకకు చెందిన ఈతకోట నాగరాజు మృతిచెందినట్టుగా గుర్తించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సబ్ పోస్టాఫీస్‌లో డిపాజిట్ సొమ్ము స్వాహా!
జిన్నూరు (పోడూరు): జిన్నూరు సబ్‌పోస్టాఫీసులో పలువురు ఖాతాదారులు డిపాజిట్ చేసిన సొమ్ము నెలలు గడిచినా ఆన్లైన్ కాని వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగి కొంత సొమ్మును ఆన్లైన్ చేయకుండా స్వాహా చేసినట్టు పలువురు ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిపాజిట్ చేసిన సొమ్మును ఖాతాదారుల పాస్‌బుక్‌లో నమోదు చేసినా కంప్యూటర్లో ‘ఆన్లైన్’ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విషయం పోస్టల్ అధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఖాతాదారులను కార్యాలయానికి రప్పించి పాస్‌పుస్తకాలు తనిఖీ చేస్తున్నారు. దీనిపై పాత్రికేయులు పోస్టాఫీసుకు వెళ్లి ఉద్యోగులను వివరణ అడగ్గా ఎటువంటి అవకతవకలు జరగలేదనీ, దీనిపై తాము మాట్లాడకూడదని చెప్పారు. పోస్టాఫీసులో పెద్దమొత్తంలో సొమ్ము స్వాహా జరిగిందని గ్రామస్తుల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పలువురు ఖాతాదారులు తాము డిపాజిట్ చేసిన సొమ్ము గురించి ఆందోళనలో ఉన్నారు. పోస్టల్ అధికారులు స్పందించి ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
2,40,824 మంది పిల్లలకు పోలియో చుక్కలు
పొందూరు, న్యూస్‌లైన్ : ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 1606 కేంద్రాల్లో 2,40,824 మంది చిన్నారులకు చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జిల్లా వైద్య,ఆరోగ ్యశాఖాధికారి గీతాంజలి చెప్పారు. గురువారం పొందూరు 30 పడకల ఆస్పత్రిని సందర్శించారు. సిబ్బంది డ్యూటీ రిజిష్టర్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 19న చుక్కలు వేయిం చుకోని వారికి 20, 21 తేదీల్లో ఇంటింటికి వెళ్లి తమ సిబ్బంది చుక్కలు వేస్తారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులకు వచ్చే లా వైద్యులు సేవలు అందించాలన్నారు. విధులకు డుమ్మా కొడితే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు. కార్యక్రమంలో జవహర్ బాలల ఆరోగ్య రక్ష కో ఆర్డినేటర్ మెండ ప్రవీణ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జగన్నాథరావు, స్థానిక వైద్యులు హరనాథరావు, సునీల్ పాల్గొన్నారు. -
‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’లో మేజిక్ మధు
జిన్నూరు (పోడూరు), న్యూస్‌లైన్ : పోడూరు మండలం జిన్నూరు జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు, మెజీషియన్ ఖండవల్లి మధుసూదనరావుకు ‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’లో స్థానం లభించింది. గతేడాది డిసెంబర్ 12న ప్రపంచశాంతి, సామాజిక చైతన్యం కోసం 12 గంటల 12 నిముషాల 12 సెకన్లకు వీరవాసరం మండలం రాయకుదురులో కళ్లకుగంతలు కట్టుకుని 12 కి.మీ.దూరం 12 మోటర్ సైకిళ్లు మారుతూ 12 ఫైర్రింగ్లను దాటుకుంటూ మధుసూదనరావు విన్యాసం చేశారు. ఇందుకు ఆయనకు అరుదైన గౌరవం అభించింది. జెడ్పీ హైస్కూల్లో బుధవారం జ్యూరీ మెంబర్ చింతా శ్యామ్‌కుమార్ (శ్యామ్ జాదూగర్) నుంచి ‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’ ధ్రువీకరణపత్రాన్ని మధు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజిక్ విద్యను మూఢనమ్మకాలను పారద్రోలేందుకు, ఎయిడ్స్ నివారణ, పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్యం, విద్య, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినియోగిస్తున్నట్టు చెప్పారు. వాకర్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఆకి రామకృష్ణ, జీవీ సుబ్బారావు, హైస్కూల్ హెచ్ఎం సీహెచ్ సురేష్‌బాబు, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, ఆనందరావు, కలిదిండి వెంకటపతివర్మ, మెజీషియన్లు ప్రవీణ్, లిఖిత ఆయన్ను అభినందించారు. -
సీఎం సభకు భారీ ఏర్పాట్ల
పెనుమంట్ర/పోడూరు, న్యూస్‌లైన్ :ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సభ కోసం పెనుమంట్ర మండలం మార్టేరు, పోడూరు మండలం జగన్నాథపురం సరిహద్దులోని తేతలి కనికిరెడ్డి రైస్‌మిల్లు ఆవరణలో భారీ ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం వరకూ ఆవరణలోని చెత్తను తొలగింపచేసిన అధికారు లు సభావేదిక, బారికేడ్లను హుటాహుటిన నిర్మిం చే పనిని కొనసాగిస్తున్నారు. సభావేదికకు వెళ్లే మార్గంలోని 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను, విద్యుత్ లైన్లను శాశ్వతంగా తొలగించారు. రచ్చబండ సభలో పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర మండలాలకు చెందిన సుమారు 8,600 మందికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా వివిధ పథకాల మంజూరు పత్రాలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, డీఆర్డీఏ పీడీ వై.రామకృష్ణ దగ్గరుండి ఇక్కడి పనులను పర్యవేక్షిస్తున్నారు. నరసాపురం డీఎస్పీ కె.రఘువీరారెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రూ.18 కోట్లతో నిర్మించే మార్టేరు-ఆచంట రోడ్డు విస్తరణ పనులకు మార్టేరు సెంటర్లో శంకుస్థాపన చేస్తారు.