Police Sports Meet
-
తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్
-
పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు హాజరైన రామ్‌చరణ్ ఫొటోలు
-
పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు హాజరైన రామ్‌చరణ్
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్ట కాలంలో పోలీసుల విధులు అనిర్వచనీయమని హీరో రామ్‌చరణ్ అన్నారు. స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ కనబర్చిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయన సైబరాబాద్ పోలీసు వార్షిక క్రీడల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని రామ్‌చరణ్ తెలిపారు. షూటింగ్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ అనగానే ఓకే చెప్పానని, అందరినీ కలవాలని పోలీసుల కోసం వచ్చానన్నారు. కరోనా కాలంలో పోలీసులు, వైద్యులు తమను తాము కాపాడుకుంటూ ప్రజలను కాపాడారని ప్రశంసించారు. పోలీసులు క్రీడల్లో మరింతగా రాణించాలని కోరుకున్నారు. తనను అతిథిగా పిలిచిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఆచార్య: మెగా అభిమానులకు డబుల్ ధమాకా) (చదవండి: హెడ్‌కానిస్టేబుల్ కూతురుకు అరుదైన గౌరవం) -
గెలుపు కంటే పాల్గొనడం ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: క్రీడల్లో గెలుపోటముల కంటే పాల్గొనడం ముఖ్యమని భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పేర్కొంది. ఓటమికి నిరాశ చెందకుండా గెలిచే వరకు ప్రయత్నించాలని చెప్పింది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో మూడు రోజుల పాటు జరిగిన స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైంది. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తోన్న పోలీసుల కృషిపై ఆమె అభినందించింది. ఈ స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, క్యారమ్స్, చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఈవెంట్లలో పోటీలను నిర్వహించారు. మాదాపూర్ జోన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ పోలీసులకు మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో మాదాపూర్ జట్టును విజయం వరించింది. ఈ సందర్భంగా ఆమె విజేతలకు ట్రోఫీలను అందజేసింది. ఈ క్రీడల్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, కానిస్టేబుల్స్, ఏడీసీపీ అధికారులు, మినిస్టీరియల్ స్టాఫ్, స్టూడెంట్ పోలీస్ క్యాడెట్లు పాల్గొన్నారు. తీన్మార్ ఫేమ్ బిత్తిరి సత్తి ఈ కార్యక్రమంలో సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.