
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్ట కాలంలో పోలీసుల విధులు అనిర్వచనీయమని హీరో రామ్‌చరణ్ అన్నారు. స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభ కనబర్చిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయన సైబరాబాద్ పోలీసు వార్షిక క్రీడల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని రామ్‌చరణ్ తెలిపారు. షూటింగ్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ అనగానే ఓకే చెప్పానని, అందరినీ కలవాలని పోలీసుల కోసం వచ్చానన్నారు. కరోనా కాలంలో పోలీసులు, వైద్యులు తమను తాము కాపాడుకుంటూ ప్రజలను కాపాడారని ప్రశంసించారు. పోలీసులు క్రీడల్లో మరింతగా రాణించాలని కోరుకున్నారు. తనను అతిథిగా పిలిచిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఆచార్య: మెగా అభిమానులకు డబుల్ ధమాకా)