Policy renewal
-
వాహన, ఆరోగ్య బీమాదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో థర్డ్ పార్టీ వాహన, ఆరోగ్య బీమా పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆయా బీమా పాలసీల గడువును మే 15వరకూ పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేస్ పిరియడ్‌లో బీమాదారులకు బీమా కవరేజ్‌తో పాటు క్లెయిమ్స్‌ను పరిష్కరించాలని బీమా కంపెనీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. మార్చి 25 నుంచి మే 3 మధ్య గడువు ముగియనున్న థర్డ్‌పార్టీ వాహన, ఆరోగ్య పాలసీలకు ఈ వెసులుబాటును వర్తింపచేస్తారు. కాగా ఏప్రిల్ 14 వరకూ విధించిన తొలి విడత లాక్డౌన్ సందర్భంగా కూడా పాలసీ పునరుద్ధరణ గడువును పొడిగిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వాహన, బీమా పాలసీల పునరుద్ధరణ గడువును పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేసిన క్రమంలో అందుకు అనుగుణంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. చదవండి : వలస కూలీల ఆందోళన -
పాలసీదారులకు ఎల్ఐసీ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ తాజాగా రెండేళ్ల పైబడి ల్యాప్స్ అయిన పాలసీలను కూడా పునరుద్ధరించుకునే వెసులుబాటు ప్రకటించింది. 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం సాధారణంగా ప్రీమియం చెల్లింపులు ఆపేసిన నాటి నుంచి రెండేళ్ల లోపు మాత్రమే రివైవల్‌కి అవకాశం ఉంది. 2014 జనవరి 1 తర్వాత తీసుకున్న పాలసీలు ల్యాప్స్ అయి రెండేళ్లు దాటిపోతే.. పునరుద్ధరణకు వెసులుబాటు లేదు. అయితే, పాలసీదారులకు జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలు లభించేలా వీటిని కూడా రివైవ్ చేసే అవకాశం కల్పించాలంటూ ఐఆర్‌డీఏఐని ఎల్ఐసీ కోరింది. దానికి అనుగుణంగానే తాజా మార్పులు చేసింది. వీటి ప్రకారం.. 2014 జనవరి 1 తర్వాత పాలసీలు తీసుకున్న వారు నాన్–లింక్డ్ పాలసీలను అయిదేళ్ల లోపు, యూనిట్ లింక్డ్ పాలసీలను మూడేళ్ల లోపు పునరుద్ధరించుకోవచ్చు. -
ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణకు అవకాశం
హైదరాబాద్: దేశీ అతిపెద్ద బీమా సంస్థ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎల్ఐసీ) తాజాగా పాలసీల పునరుద్ధరణ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది పాలసీదారులకు ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. షరతులకు లోబడి పాలసీల పునరుద్ధరణ ఉంటుందని పేర్కొంది. పాలసీదారులు సక్రమంగా లేని పాలసీలను సమీక్షించుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్‌ను కొనసాగించుకునే వెసులుబాటు పొందొచ్చని తెలిపింది. -
త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పథకాలు
సాధ్యాసాధ్యాలపై కమిటీ ఎఫ్‌డీఐ వాటా పెంచుకోవడానికి ముందుకొచ్చిన ఏడు కంపెనీలు చౌకగా పాలసీలను అందించడంపై కంపెనీలు దృష్టిపెట్టాలి ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతి ఏటా పాలసీని రెన్యువల్ చేయించుకోనవసరం లేకుండా బహుళ సంవత్సరాలు అమల్లో ఉండే ఆరోగ్య బీమా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఐఆర్డీఏ ఉంది. అన్ని వైపుల నుంచి దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పథకాలకు డిమాండ్ రావడంతో దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏ) చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. త్వరలోనే ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విజయన్ కలసిన విలేకరులతో మాట్లాడుతూ ద్విచక్ర వాహన రంగంలో ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక పాలసీలకు డిమాండ్ బాగుండటంతో కార్లు, ఆరోగ్య బీమా పాలసీల్లో కూడా దీన్ని అమలు చేయాలని కంపెనీలు కోరుతున్నాయన్నారు. తక్కువ కాలంలోనే దీర్ఘకాలిక ద్విచక్ర వాహన పాలసీల అమ్మకాలు లక్ష మార్కును అందుకోవడంపై విజయన్ సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీలు డిజిటలైజేషన్‌ను వినియోగించడం ద్వారా వ్యయాలను తగ్గించుకొని తక్కువ ప్రీమియంకే పాలసీలను అందించడంపై కంపెనీలు దృష్టిపెట్టాలన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 80 శాతం ఆస్తులకు బీమా రక్షణ ఉందని, కానీ ఇండియాలో ఇది కేవలం 7 శాతంగా ఉందన్నారు. బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పెంపు అనుమతి కోరుతూ కంపెనీల నుంచి అధికారికంగా ఎటువంటి దరఖాస్తులు అందలేదని, కానీ ఆరు నుంచి ఏడు కంపెనీలు ఎఫ్‌డీఐ వాటాను పెంచుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పరిశ్రమకంటే బెటర్ ఈ ఏడాది పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిని సాధించగలమన్న ధీమాను సాధారణ బీమా కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ వ్యక్తం చేసింది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల కాలంలో సాధారణ బీమా రంగంలో 10 నుంచి 11 శాతం వృద్ధి నమోదైతే, ఇదే సమయంలో తాము 18 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్ గుప్తా తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 7,000 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించింది.