ప్రాణం తీసిన పాలిషింగ్ యంత్రం
మునగపాక: పాలిషింగ్ మిషన్ మీద పడ డంతో గాజువాక దరి వడ్లపూడికి చెందిన మద్దాల సత్యారావు (సతీష్)(35) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. సత్యారావు మార్బుల్ పాలిషింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండలంలోని ఒంపోలు గ్రామానికి చెందిన దాసరి వెంకటరావు నివాసంలో మంగళవారం పాలిషింగ్ పనులు చేస్తుండగా ఆ మిషన్ సత్యారావుపై పడింది.
దీంతో సత్యారావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సత్యారావు కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబానికి ఆధారమైన సత్యారావు మృతి చెందడంతో తమకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సత్యారావుకు భార్య లక్ష్మి ఉంది. సత్యారావు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఏఎస్ఐ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.