Political Reforms
-
అవసరమైన సామాజిక కూర్పు
ఇటీవలి ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన మూడు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులే వచ్చారు. ఇదొక కొత్త రాజకీయ సంప్రదాయం కాబట్టి చర్చ కూడా పెద్ద ఎత్తునే జరుగుతోంది. అది రాజకీయ పార్టీలు మంచి చేసినప్పుడు జరగవలసిన చర్చేనా? ఇది ప్రశ్నార్థకమే. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే, అది ఏ పార్టీ మనస్ఫూర్తిగా, నిజాయితీగా చేసినా స్వాగతించాలి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ విషయంలో పట్టింపుగా ఉన్నారు. ఈ ప్రస్తావన ఎందుకంటే, సోషల్ ఇంజినీరింగ్ కోసం ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తుంటే ఆ విషయం చెప్పడానికి సందేహించనక్కర లేదు. మనం ఒక పార్టీని అభిమానించడం, ఆ పార్టీ చేపట్టే సోషల్ ఇంజినీరింగ్‌ను సానుకూలంగా గమనించడం, ఈ రెండూ అవసరమే. ఇటీవల గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ మాజీ లను కాదని, కొత్తవారిని ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చోబెట్టింది బీజేపీ. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ స్థానంలో మోహన్ యాదవ్‌కూ, రాజస్థాన్‌లో వసుంధరా రాజేను కాదని మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన భజన్‌లాల్ శర్మకూ, ఛత్తీస్‌గడ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు స్పీకర్ స్థానం ఇచ్చి విష్ణుదేవ్ సాయ్కీ బీజేపీ అధిష్ఠానం ముఖ్యమంత్రి స్థానాలను అప్ప గించింది. ఇలాంటి నిర్ణయం రాజకీయాలకు కొత్త. ఒకే దెబ్బతో నిర్ణయించడం కూడా కొత్తే. 2018 ఎన్నికల తరువాత రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ గతంలో ముఖ్యమంత్రులుగా చేసినవారినే తిరిగి ప్రతిష్టించారు. అది సర్వసాధారణ సంప్రదాయమనే అంతా సర్దుకు పోయారు. ఆ మూస ధోరణితో ఇద్దరు యువనేతలకు అవకాశం లేకుండా పోయిందన్న వాస్తవం మరుగున పడింది. కొత్తవారికి అవ కాశాల సంగతి ఆ పార్టీలో ప్రశ్నార్థకమైందన్న వాదన కూడా వీగి పోయింది. కానీ ఇప్పుడు ఓడిపోతుందని అంతా అనుకున్న మధ్య ప్రదేశ్‌లో ఘన విజయం సాధించి పెట్టిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ను వదిలిపెట్టి వేరొకరికి బీజేపీ అధికారం కట్టబెట్టడం అనూహ్యంగానే కనిపిస్తుంది. వసుంధరా రాజే వంటి దిగ్గజాన్ని ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉంచగలగడం కూడా అలాంటిదే. భజన్‌లాల్ శర్మకు ముఖ్యమంత్రిగా అవకాశం రావడం మరీ ఊహకు అందనిదే. ఈ ముగ్గురికీ ప్రత్యేకతలు ఉన్నాయి. బీజేపీతో, లేదా మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్తో వీరికి విశేషమైన సాన్నిహిత్యం ఉంది. ఎవరూ ఇతర పార్టీల నుంచి దిగుమతి అయినవారు కాదు. అయోధ్య ఉద్య మంతో మమేకమైనవారు భజన్‌లాల్ శర్మ. ఇవన్నీ సాధారణ ప్రజా నీకం దృష్టిలో పడని అభ్యర్థుల అర్హతలే అవుతాయి. వీరి పాలనా నుభవం, ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజల మధ్యన ఉండే తత్త్వం ఇవన్నీ పార్టీ పరిగణనలోకి తీసుకునే అంశాలు అవుతాయి. ఒక నాయ కుడిని మూడు లేదా నాలుగు పర్యాయాలు పదవిలో కొనసాగించడం వల్ల, తద్వారా ఎదురయ్యే ప్రభుత్వ వ్యతిరేకత పార్టీ భవిష్యత్తుకు సంబంధించినది. కొత్త నాయకత్వాన్ని నిర్మించే ప్రక్రియ కూడా పార్టీ తాజా నిర్ణయంలో కనిపిస్తోంది. మొత్తంగా పార్టీ ప్రయోజనాల రక్షణ, అభ్యర్థి సామర్థ్యం, గుణగణాలు ఇవన్నీ పార్టీ మనుగడకు పరోక్షంగా దోహదం చేస్తాయి. దీనితో పాటే పట్టించుకోవలసిన మరొక లోతైన అంశం, పార్టీ అనుసరించిన సోషల్ ఇంజినీరింగ్. దురదృష్టవశాత్తు బీజేపీ అమలు చేయదలిచిన సోషల్ ఇంజినీరింగ్‌కు మీడియా చర్చలు, పత్రికల కాల వ్ులు తగిన స్థానం ఇస్తున్నాయా? ఇవ్వడం లేదన్నదే సమాధానం. సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి. స్త్రీపురుష సమానత్వం కూడా అందులో భాగం. వీటిని ఇప్పటికైనా పార్టీలో, ప్రభుత్వంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నందుకు బీజేపీని మనసారా అభినందించవలసి ఉంటుంది. ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించకుండా ఏళ్ల తరబడి ప్రభుత్వం నడిపిన ముఖ్యమంత్రులు మన కళ్లెదుటే ఉన్నారు. కొన్ని వర్గాలవారు అసలు శాసనసభ ముఖం చూడలేదన్నది ఒక చేదునిజం. వీటిని అధిగమించి తీరాలి. లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అదే సమయంలో అప్పటిదాకా రాజకీయాలలో, పాలనలో తగినన్ని అవ కాశాలను పొందిన వారికీ, ఇప్పుడు పొందవలసి ఉన్నవారికీ మధ్య సమతూకం పాటిస్తేనే ఏ పార్టీ అయినా మనుగడ సాగించగలుగుతుందన్నది ఒక వాస్తవం. మొత్తం వ్యవస్థను పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా, ఓటు ద్వారా మార్చదలిచిన ఏ పార్టీ అయినా ఈ సూత్రానికి దగ్గరగా పనిచేస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ చేసిన కసరత్తు ఇందుకు సంబంధించినదే! అయితే, ఏ అడుగు వేసినా అందులో ఎన్నికల కోణాన్ని మాత్రమే చూడడం ఇటీవలి చర్చలు, విశ్లేషణలలో కనిపించే ఒక అవాంఛనీయ పరిణామం. ఇప్పుడు బీజేపీ ఎంపికను కూడా విశ్లేషకులు మూస ధోరణిలో ఎన్నికల వ్యూహాన్నే చూస్తున్నారు. మీడియా ఏం చర్చించాలో పాఠాలు చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అయితే అభ్యర్థుల ఎంపిక గురించి పార్టీలు తీసుకున్న నిర్ణయాలు, ఎంపికలు తమ ఊహాగానాలకు, సర్వేలకు అనుకూలంగా లేవేమిటని వారు ఆశ్చర్యం పోవడం కూడా వింతే అనిపిస్తుంది. తాము ఎంతో ఖర్చు చేసి చేయించిన సర్వేల కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడమేమిటన్న ఒక అసంబద్ధ వైఖరి కూడా కొందరు మీడియా వారు పరోక్షంగా అయినా వ్యక్తం చేయడం నిజం. ఇలాంటివారు మొదట చేయవలసిన పని ఆ తీర్పు ప్రజలు ఇచ్చినదని గౌరవించడం. అలాగే ఊహాగానాలకు అతీతంగా ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లు వచ్చినా బుగ్గలు నొక్కుకోవడం ఎందుకు? పార్టీ కొత్తవారికి అవకాశం ఇవ్వదలిచింది. గతం కంటే మెరుగ్గా సోషల్ ఇంజినీరింగ్‌కు స్థానం కల్పించాలని అనుకున్నది. దాని ఫలితమే ఇలాంటి ఎంపిక. తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తా నని చెప్పిన తరువాత ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక జరిగింది. అందులో తెలంగాణకు ఇచ్చిన హామీ జాడలు కనిపిస్తున్నాయి కూడా. దీనిని గుర్తించడం అవసరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యాభయ్ శాతం ఉన్న ఓబీసీలకు ఆ అవకాశం దాదాపు రాలేదు. దానిని గుర్తించి, ఆ తప్పిదాన్ని సవరించే ప్రయత్నం బీజేపీ చేసింది. ఈ అంశం గురించి సరైన దారిలో చర్చ జరిపితే అది అన్ని పార్టీలకు ఉపయోగపడుతుంది. బీజేపీ చేసింది కాబట్టి మేము అనుసరించ బోమని మిగిలిన పార్టీలు అంటే అది వేరే విషయం. అలాంటి అభిప్రా యానికి మీడియా కూడా రాకూడదన్నదే ఇక్కడ చెప్పదలుచుకున్నది. ఎప్పుడు ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడుతున్నా విశ్లేషణలు వస్తు న్నాయి. ఏ సంవత్సరం ఎన్ని ఓట్లు వచ్చాయి, శాతం, ప్రాంతాల వారీగా అభ్యర్థులు, గెలుపోటములు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ స్వాగతించవలసినవే. వాటితో పాటు సోషల్ ఇంజినీరింగ్ విషయంలో పార్టీలలో వస్తున్న పురోగతి గురించి, అలాంటి ఆహ్వానించదగిన పరి ణామం గురించి పార్టీలు పెడుతున్న శ్రద్ధలో వచ్చిన గ్రాఫ్ గురించి కూడా చర్చ జరిగితే రాజకీయాల గతినైనా మార్చవచ్చు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో ముమ్మాటికి పట్టింపుగా ఉన్నారు. సోషల్ ఇంజి నీరింగ్‌కు, స్త్రీపురుష సమానత్వానికి ఆయన తగిన ప్రాధాన్యం కల్పి స్తున్నారు. ఈ ప్రస్తావన ఎందుకు అంటే, సోషల్ ఇంజినీరింగ్‌ను పాటించడానికి ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంటే ఆ విషయం చెప్పడానికి సందేహించనక్కర లేదు. మనం ఒక పార్టీని అభిమానించడం, ఆ పార్టీ చేపట్టే సోషల్ ఇంజినీరింగ్‌ను సానుకూలంగా గమనించడం, ఈ రెండూ అవసరమే. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే, అది ఏ పార్టీ మనస్ఫూర్తిగా, నిజాయితీగా చేసినా స్వాగతించాలి. అదే బాధ్యతాయుతమైన పౌరుల లక్షణం కూడా. అనేక కారణాలతో, వందల సంవత్సరాల విదేశీ పాలన ఫలితంగా ఇక్కడ అలాంటి సమ తూకం, క్రమం దెబ్బతిన్నాయి. దానిని సరిదిద్దే బాధ్యతను అన్ని రాజ కీయ పార్టీలు స్వీకరించాలి. బడుగు బలహీన వర్గాల గురించి, మైనా రిటీల గురించి ఇంతగా మాట్లాడే వామపక్ష, ఉదారవాద పార్టీలు కూడా ఆ విషయంలో పెద్దగా సాధించినది ఏమీలేదు. అంతమాత్రాన బీజేపీ ఆ ప్రయత్నంలో ఉంటే అందులో రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలు చూడడం మంచిది కాదు. అందుకు సంబంధించిన కీర్తి బీజేపీదే అయితే దానికే దక్కనివ్వాలి! వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ Email:pvg@ekalavya.net -
వచ్చేదే విరాళాలు గుర్తు తెలియని వ్యక్తుల నుండి.. తెలిసే వ్యక్తులు ఎవరిస్తారు!!
వచ్చేదే విరాళాలు గుర్తు తెలియని వ్యక్తుల నుండి.. తెలిసే వ్యక్తులు ఎవరిస్తారు!! -
అనివార్యతే వేటుకి కారణమైందా?
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దేవభూమి ఉత్తరాఖండ్‌లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. సుమారు 4 నెలల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ నుంచి అధికారపగ్గాలు చేపట్టిన తీరత్ సింగ్ రావత్ రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీరత్ సింగ్ స్థానంలో పుష్కర్ సింగ్ ధమీని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసినప్పటికీ అసలు ఆయనను ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తీరత్ సింగ్ ఎందుకు పగ్గాలను వదులుకోవాల్సి వచ్చిందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 115 రోజుల ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రాజీనామాకు రాజ్యాంగ సంక్షోభమే కారణం లేక రాష్ట్రంలో ప్రస్తుతం ఆగ్రహంగా ఉన్న పూజారులు, సాధుసంతువులు, భక్తులే కారణమా అనేది నేరుగా చెప్పడం కష్టమైన అంశం. అయితే త్రివేంద్ర సింగ్ రావత్‌ని సీఎం పదవి నుంచి తప్పించడంలో, తీరత్ సింగ్ రావత్‌ను అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో రాష్ట్రంలోని పూజారులు, సాధువుల అసంతృప్తే ప్రధాన కారణమని స్పష్టమౌతోంది. రావత్ ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితిలో మార్పు వస్తుందని సాధువులు, పూజారులు భావించారు. కానీ, సీఎంగా ఈ 115 రోజుల్లో తీరత్ సింగ్ రావత్ వారు ఊహించిన విధంగా అద్భుతాలు ఏవీ చేయలేకపోయారు. కాగా అనేక వివాదాస్పద ప్రకటనలు చేశారు. పార్టీపై ప్రజల్లోని ప్రతికూలతలు దూరం అవుతాయా? వచ్చే ఏడాది మొదట్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం మరోసారి అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే అక్కడ ఉన్న సాధువులు, పూజారులు, వారి భక్తులను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన గత్యంతర పరిస్థితి ఉంది. అందువల్లే దేవభూమిలో ముఖ్యమంత్రి మార్పు ఇప్పుడు అనివార్యంగా మారింది. ఎన్నికల్లోగా పార్టీపై క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతికూలతలను దూరం చేయడంలో తీరత్ సింగ్ వైఫల్యం చెందడంతో పాటు, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి మరింత నష్టం చేకూర్చాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తీరత్ సింగ్‌ను కొనసాగించడానికి అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిలోగా ఎలాంటి ఉప ఎన్నికలను నిర్వహించలేమని కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టత ఇవ్వడంతో ఆయనతో రాజీనామా చేయించారని తీరత్ సన్నిహితులు తెలిపారు. కానీ, కమలదళంలో అంతర్గత విబేధాలు, ఫిర్యాదులు, అసంతృప్తి కారణంగానే తీరత్‌ను పక్కనబెట్టారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అందువల్లే పార్టీ హైకమాండ్ సమాలోచనలు జరిపి ప్రజల్లో సరళమైన ఇమేజ్ ఉన్న పుష్కర్ సింగ్ ధమీని ఎంపికచేసింది. ఆయన ధుమ్కా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండడంతో తీరత్ సింగ్ విషయంలో ఎదురైన రాజ్యాంగ సంక్షోభం మరోసారి ఏర్పడరాదనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ పేరును ప్రతిపాదనల నుంచి తప్పించారని తెలిసింది. దేవస్థానం బోర్డుపై నియంత్రణ కారణమా...: రాష్ట్రంలో దేవస్థానం బోర్డుపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుండటంపై అర్చక సమాజం ఆగ్రహంగా ఉంది. త్వరలోనే 51 దేవాలయాలను, ఉత్తరాఖండ్ దేవస్థానం బోర్డును ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పిస్తానని ఈ ఏడాది ఏప్రిల్ 9న తీరత్ సింగ్ రావత్ తన పుట్టిన రోజున హరిద్వార్‌లో హామీ ఇచ్చారు. కానీ ఈ నిర్ణయంపై ఎలాంటి పురోగతి లేదు. దీంతో పూజారులు ధర్నా మొదలుపెట్టారు. దేవస్థానం బోర్డు రద్దు చేయాలని కోరుతూ జూన్ 29న చార్ధామ్ తీర్థ్ పురోహిత్ మహా పంచాయత్ సమితి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్లకు సైతం మహా పంచాయత్ లేఖలు రాసి ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. కొంపముంచిన చార్ధామ్ యాత్ర రద్దు ఉత్తరాఖండ్ జీవనాడి అయిన చార్ధామ్ యాత్ర రద్దు వ్యవహారంలోనూ పూజారులు ఆగ్రహంగా ఉన్నారు. యాత్రను రద్దు చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు తీరత్ సింగ్ ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ సాధువుల సమాజానికి ఎలాంటి రక్షణ ఇవ్వలేరనే విధంగా ఒక సందేశం ప్రజల్లో ప్రచారమైంది. ఇలాంటి అనేక కారణాల వల్ల తప్పని సరి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కమలదళం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. -
పార్లమెంటులో ‘మహా’ సెగలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై సోమవారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలనను ఎత్తేసీ ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు లోక్‌సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. మహారాష్ట్ర పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విపక్షాలు సభను హోరెత్తించాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యం ఖూనీని నివారించండి అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని ఎంపీలు వెల్‌లోకి దూసుకుపోయి నినాదాలు చేశారు. వెల్‌లోకి వచ్చిన కాంగ్రెస్ సభ్యులు, హిబి ఈడెన్, ప్రతాపన్లను వెనక్కి వెళ్లాలంటూ స్పీకర్ చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో సభ నుంచి బయటకు పంపేయాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు జారీ చేయడంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. మార్షల్స్కి, సభ్యులకి మధ్య తోపులాట జరిగింది. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. భద్రతా సిబ్బంది చేయి చేసుకున్నారు: మహిళా ఎంపీల ఫిర్యాదు మహారాష్ట్ర విషయంలో సభలో గందరగోళం నెలకొన్నప్పుడు భద్రతా సిబ్బంది తమపై చేయి చేసుకున్నారని కాంగ్రెస్ మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు . తమపై భద్రతా సిబ్బంది చేయి చేసుకున్నారంటూ కాంగ్రెస్ ఎంపీలు జోతిమణి, రమ్య హరిదాస్లు ఆరోపించారు. మహారాష్ట్రలో అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. ఆమె వెంట పార్టీ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, అధీర్ రంజన్ చౌధరి, శశిథరూర్‌లు కూడా నిరసన కార్యక్రమంలో నినాదాలు చేశారు. రాజ్యసభలోనూ అదే సీన్ రాజ్యసభ మహారాష్ట్ర అంశంపై దద్దరిల్లింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, డీఎంకేలు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన రాత్రికి రాత్రి ఎందుకు ఎత్తివేశారని, దానిపై చర్చించాలంటూ పట్టు పట్టారు. చైర్మన్ వెంకయ్య రాష్ట్రపతి పాలన విధించడానికి ముందు, లేదంటే ఎత్తివేయడానికి ముందు సభ చర్చించాలని, ఎత్తివేశాక దానిపై చర్చ జరపలేమన్నారు. అయినా, సభలో గందరగోళం ఆగలేదు. ప్రజాస్వామ్యాన్ని హత్యచేస్తున్నారంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. మధ్యాహ్నం తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో డిప్యూట్ చైర్మన్æ మంగళవారానికి సభను వాయిదా వేశారు. పార్లమెంటులో నేడు రాజ్యాంగ దినోత్సవం భారతదేశ రాజ్యాంగ సభ తనదైన సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగాన్ని ఆమోదించుకుని సరిగ్గా ఏడు దశాబ్దాలు. 1949 నవంబర్ 26న మన దేశ రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది. ఆ తరువాత రెండు నెలల అనంతరం 1950 జనవరి 26న ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1947 ఆగస్టు నెలలో వలస పాలన నుంచి విముక్తిపొందిన భారతదేశం.. రెండేళ్ళ అనంతరం తనదైన రాజ్యాంగాన్ని రూపొందించుకుని నవంబర్ 26న ఆమోదింపజేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏటా రాజ్యాంగ దినోత్సవం– ‘సంవిధాన్ దివస్’ జరుపుకుంటున్నాం. 70ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో మంగళవారం ఉభయసభల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. -
చాపకింద నీరులా కమలం
సాక్షి, భూపాలపల్లి: అసెంబ్లీ ఎన్నికల అనంరతం జరిగిన పరిణామాలతో జిల్లాలో కొంత రాజకీయ అనిశ్చితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారడం, టీడీపీ కనుమరుగవ్వడం, లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోరుమీదున్న బీజేపీకి జిల్లాలో నెలకొన్న రాజకీయ వాతావరణ పరిస్థితులు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ మారడంతో కాంగ్రెస్ కేడర్‌లో మెజారిటీ నేతలు ఆయన వెంట టీఆర్ఎస్లో చేరారు. గండ్ర పార్టీ మారిన తర్వాత భూపాలపల్లి కాంగ్రెస్‌లో ఏర్పడిన రాజకీయ శూన్యతను కొండా దంపతులు భర్తీ చేస్తారని భావించారు. ప్రస్తుతం వారు కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు అంటీమట్టనట్లు ఉండడంతో భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనపడిందనే సంకేతాలు వస్తున్నాయి. ఇదే మంచి అవకాశంగా బీజేపీ కేడర్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీనికి తగ్గట్లుగానే టీడీపీ జిల్లా అధ్యక్షుడు చాడరఘనాథ్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. సభ్యత్వ నమోదును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూపాలపల్లి నియోజకవర్గంలో 20 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేయించామని బీజేపీ చెబుతోంది. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. ఇన్నాళ్లు జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్గా ఉన్న రాజకీయాక ముఖ చిత్రాని బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా మర్చాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ద్వారా, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ శ్రేణుల్లో అంతర్మథనం ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపు సాధించిన బీజేపీ రాష్ట్రంలో బలపడడానికి ప్రయ త్నాలు చేస్తుండగా, రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ శ్రేణులను పట్టించుకునే నాయకులు కరువయ్యారు. భరోసా ఇచ్చే నాయకులు లేకపోవడంతో వలసలు పెరిగే అవకాశం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున గెలిచిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్‌లో కీలక నేతలు కరువయ్యారు. ఇక టీడీపీ పరిస్థితి చెప్పా ల్సిన పనిలేకుండా ఉంది. గండ్ర పార్టీ మారిన తర్వాత మొదట్లో పరిషత్ ఎన్నికల ముందు కొండా దంపతులు, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు భూపాలపల్లి కాంగ్రెస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వారు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కొండా దంపతులు కూడా బీజేపీలోచేరుతున్న ట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆదివారం కాంగ్రెస్ నేతలు శ్రీధర్‌బాబు, బట్టివిక్రమార్క భూపాలపల్లి పీహెచ్సీ సమీక్షించారు. అయితే ఇటువంటి కార్యక్రమాలు గండ్ర పార్టీ మారిన తర్వాత నుంచే ప్రారంభిస్తే బాగుండేదని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. మరింత బలపడనున్న బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ మరింత బలపడనుంది. ఇటీవల కాలంలో భూపాలపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 20 వేల మందిని బీజేపీ పార్టీలో చేర్చుకున్నట్లు తెలిసింది. కార్యకర్తలతో పాటు నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో కీర్తి రెడ్డి బీజేపీ గెలుపుకోసం పోరాడారు. ప్రస్తుతం చాడ రఘునాథ్‌రెడ్డి కూడా బీజేపీలో చేరడంతో బీజేపీ నియోజకవర్గంలో మరింత బలపడే అవకాశం ఉంది. మునిసిపల్ ఎన్నికల ముందు టీఆర్ఎస్లో గండ్ర, చారి వర్గాల మధ్య ఎమైనా విభేదాలు ఉంటే తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఎవరికైనా టికెట్ రాకపోతే బీజేపీ మంచి వేదిక అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. -
జయహో జగన్
సాక్షి , ఒంగోలు : అంతటా జయజయ ధ్వానాలు..జన హృదయ విజేత రాష్ట్రాధినేత కావాలన్న సంకల్పం ప్రభంజనమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జనం పట్టం కట్టారు. ఐదేళ్ల రాక్షస పాలనకు చరమ గీతం పాడుతూ సంక్షేమ రాజ్యాన్ని కాంక్షిస్తూ విజయ ఢంకాలు మోగించారు. జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 8 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించగా..మిగిలిన నాలుగు చోట్ల టీడీపీ గెలుపొందింది. ఒంగోలు ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. బాపట్ల, నెల్లూరు పార్లమెంట్ స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులే జయ కేతనం ఎగురవేశారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో విజయోత్సాహం మిన్నంటింది. స్వీట్లు పంచుతూ, రంగులు చల్లుకుంటూ, బాణసంచాలు కాల్చుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నేను ఉన్నాను..నేను విన్నాను..అని జగన్ అన్న మాటకు ప్రతిగా జిల్లా ప్రజలు నీకు మేమున్నాము అంటూ ఫ్యాను గుర్తుకు ఓట్లేసి వైఎస్సార్ సీపీకి చారిత్రాత్మక విజయం అందించారు. జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్ గాలితో హోరెత్తింది. అన్ని వర్గాల ప్రజలు సైకిల్‌కు పంచరేసి వైఎస్ జగన్ సీఎం కావాలన్న లక్ష్యంతో ప్రభంజనంలా ఫ్యాను గుర్తుకు ఓట్లేశారు. దీంతో జిల్లాలోని ఒంగోలు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గెలిచిన అందరు అభ్యర్థులకు 20 వేల నుంచి 80 వేల వరకు భారీ మెజార్టీ దక్కడం గమనార్హం. టీడీపీ జిల్లాలో కుప్ప కూలింది. అద్దంకి, చీరాల, కొండపి, పర్చూరు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌పై 22,245 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గిద్దలూరు నుంచి పోటీ చేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు జిల్లాలో అత్యధికంగా 80,142 ఓట్లకుపైగా మెజార్టీతో ముత్తముల అశోక్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు. యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ టీడీపీ అభ్యర్థి అజితారావుపై 31,096 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కనిగిరిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై 40,668 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మార్కాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై 18,667 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దర్శి వైఎస్సార్ సీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావుపై 39,057 ఓట్ల ఆ«ధిక్యంతో ఘన విజయం సాధించారు. సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబు తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్ పై 9080 ఓట్లతో గెలుపొందారు. కందుకూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి పోతుల రామారావుపై 14,637 ఓట్లకుపైగా ఆధిక్యంతో విజయం సాధించారు. పర్చూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు కన్నా 1295 ఓట్లు వెనుకబడి ఉన్నారు. కొండపి వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ వెంకయ్యపై టీడీపీ అభ్యర్థి బాలవీరాంజనేయస్వామి 1095 స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు అందరూ 20 నుంచి 80 వేల భారీ మెజార్టీలతో భారీ విజయం సాధించారు. అన్ని వర్గాల ప్రజలు ఫ్యాను గుర్తుకే ఏకపక్షంగా ఓట్లు వేశారు. ఇక జిల్లాలో గత ఎన్నికల్లో అయిదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో అదనంగా ఒక స్థానాన్ని కోల్పోయి కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై 17,801 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, అద్దంకి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాచిన చెంచుగరటయ్యపై 12,747 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి శిద్దా రాఘవరావు వైఎస్సార్సీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో పరాభవం పొందారు. మాగుంట శిద్దా రాఘవరావుపై 2,12,522 పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు స్థా«నాన్ని గెలుచుకున్న టీడీపీకీ ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. బాపట్ల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరాం మాల్యాద్రిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి నందిగం సురేష్ 15,881 ఓట్ల ఆధిక్యత సాధించారు. జిల్లా వ్యాప్తంగా సంబరాలు: వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారని సమాచారం అందుకున్న పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు కౌంటింగ్ నిర్వహిస్తున్న ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణ సంచా పేల్చడంతో పాటు రంగులు చల్లుకొని, కేక్‌లు కట్‌చేసి పంచిపెట్టారు. అభ్యర్థుల ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు.