జూ పార్కుకు సందర్శకుల తాకిడి
బహదూర్‌పురా, న్యూస్‌లైన్: నెహ్రూ జూలాజికల్ పార్కు మంగళవారం వేలాది మంది సందర్శకులతో సందడిగా కనిపించింది. 11,879 మంది పెద్దలు, 4,280 మంది చిన్నారులు, 90 కార్లలో వచ్చిన 450 మంది సందర్శకులల రాకతో మంగళవారం జూకు రూ. 3.79 లక్షల ఆదాయం సమకూరింది. కాలుష్య రహిత బ్యాటరీ వాహనాల నుంచి రూ.66,020, చేపల ఆక్వేరియంకు రూ.8672, చిట్టి రైలుకు రూ.10,335, నిశాచర జంతుశాలకు రూ.16,290 ఆదాయంతో కలిపి జూకు మొత్తం 4.80 లక్షల ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జూకు సందర్శకుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు. ఈనెల 1వ తేదీన 37,086 మంది సందర్శకులు రాగా, మంగళవారం రోజు 16,609 మంది సందర్శకులు వచ్చారు. ఆదివారం, సోమవారం ఆదాయాలను కలుపుకొని జూకు రూ.15 లక్షల ఆదాయం వచ్చింది.