Ponduru railway station
-
శోకం మిగిలింది!
♦ రైలు కింద పడి ఇద్దరు బలవన్మరణం ♦ మృతులు వరుసకు తల్లీకొడుకులు ♦ చనిపోతున్నట్లు సమాచారం ఇచ్చి మరీ ఆత్మహత్యకు పాల్పడిన వైనం ♦ పొందూరులో ఘటన.. సంతకవిటి మండలంలో విషాదం పొందూరు రైల్వే స్టేషన్ మరో బలవన్మరణానికి సాక్షీభూతమైంది. పది రోజుల కిందట ఈ స్టేషన్‌కు సమీపంలోనే తల్లీకూతుళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఒకరు చనిపోయారు. తాజాగా మరో ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగు చూసింది. బూరాడ ధనుంజయరావు(20), బూరాడ సీతాలక్ష్మి(35)లు వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకున్నారు. వీరిలో సీతాలక్ష్మి ధనుంజయరావుకు పిన్ని అవుతుంది. ఈ ఘటనకు ముందు ఇరు కుటుంబాల్లో జరిగిన కొన్ని సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నా.. పూర్తిస్థాయిలో మాత్రం కారణాలు తెలీలేదు. తల్లి మరణంతో పది, ఐదేళ్ల వయసున్న చిన్నారులు దిక్కులేని వారవ్వడం ఆ గ్రామస్తులను కలిచివేస్తోంది. రాజాం/పొందూరు : బంధం బద్దలైంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. పొందూరు రైల్వేస్టేషన్ పరిధి వాండ్రంగి గేటు సమీపంలో పట్టాలపై రెండు శవాలు పడిఉన్నట్టు మంగళవారం తెల్లవారు జామున విధుల్లో ఉన్న కీమెన్ పొందూరు రైల్వే స్టేషన్ మాస్టార్‌కు సమాచారం అందించారు. దీంతో స్టేషన్ మాస్టర్ రైల్వే పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ దొరికిన ఆధారాల ప్రకారం మృతులు సంతకవిటి మండలం సోమన్నపేట గ్రామానికి చెందిన బూరాడ ధనుంజయరావు (20), బూరాడ సీతాలక్ష్మి (35)గా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు.. ట్రైన్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ధనుంజయరావు, సీతాలక్ష్మిలు ఒకే కుటుంబానికి చెందిన వారు. రేగిడి మండలానికి చెందిన సీతాలక్ష్మికి పదకొండేళ్ల క్రితం సంతకవిటి మండలం సోమన్నపేట గ్రామానికి చెందిన బూరాడ ప్రసాదరావుతో వివాహం జరిగింది. వీరికి పిల్లలు సాయితేజ(10), హేమకిరణ్ (5) ఉన్నారు. వీరు సంతకవిటిలోని ఓ ప్రైవేటు స్కూళ్లో చదువుతున్నారు. కొన్నాళ్లు ఆటోను నడిపిన ప్రసాద్ బతుకుతెరువు కోసం భార్య సీతాలక్ష్మిని తీసుకొని కర్నాటక వెళ్లి బొంతలపని చేసుకుంటూ బతుకుతున్నాడు. తన పిల్లలను సోమన్నపేటలో ఇంటి వద్దే నాన్నమ్మ వద్ద ఉంచి భార్యాభర్తలు వలస కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. మరోవైపు ప్రసాద్ సోదరుడు భుజంగరావు కూడా తన భార్య నారాయణమ్మతో తెలంగాణా రాష్ట్రంలో వలస కూలీగా జీవనం సాగిస్తునారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిని సోమన్నపేటలో ఉంచి చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు ధనుంజయరావు ప్రస్తుతం రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. నాలుగు రోజులుగా బయటేః ధనుంజయరావు నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఉంటాడని బంధువులు అనుకున్నారు. అదే సమయంలో మూడు రోజుల క్రితం నుంచి కర్నాటకలోని ప్రసాదరావు ఇంటి వద్ద తన భార్య సీతాలక్ష్మి కూడా కనిపించలేదు. మరో వైపు ఇంట్లో కొద్దిపాటి బంగారం కూడా కనిపించకపోవడంతో ప్రసాద్‌కు అనుమానం వచ్చి తన సోదరులకు, బంధువులకు సమాచారం చేరవేశాడు. ఈ నెల మూడో తేదీన కర్నాటకలోని పోలీసుస్టేషన్లో తన భార్య కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు కూడా నమోదు చేయించాడు. మెసేజ్‌లు పెట్టి.. పెద్ద కుమారుడు ధనుంజయరావు కనిపించకపోవడంతో భుజంగరావు, భార్య ఆచూకీ లేకపోవడంతో ప్రసాదరావులు వెతుకులాట ప్రారంభించారు. చివరకు మంగళవారం తెల్లవారు జామున ఈ కుటుంబాలకు చెందిన పలువురి సెల్ఫోన్లకు మేము చనిపోతున్నామని ధనుంజయరావు సెల్‌పోన్ నుంచి మెసేజ్ వెళ్లినట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసేజ్‌లు చూసి కుటుంబీకులు అప్రమత్తమైనప్పటికీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ధనుంజయరావు, సీతాలక్ష్మిలు ఆత్మహత్యకు పాల్పడి విఘతజీవులుగా మారారు. కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ఈ నాలుగు రోజులు వీరు ఎక్కడ ఉన్నారు, ఏం జరిగిందనేది అంతుచిక్కడం లేదు. తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు సీతాలక్ష్మి మృతితో ఇద్దరు పిల్లలు సాయితేజ, హేమకిరణ్ తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఇంటిదగ్గర జనం చేరడంతో ఏం జరిగిందో తెలియక బిత్తర చూపులు చూస్తుండడం స్థానికులను కలచివేసింది. ముక్కలైన శరీరాలు రైలు కిందపడి చనిపోయిన ధనుంజయరావు, సీతాలక్ష్మిల మృతదేహాలు ముక్కలైపోయాయి. వీరి శవాలను చూసి భారీగా తరలివచ్చిన సోమన్నపేట గ్రామస్తులు చలించిపోయారు. పోస్టుమార్టం వాయిదా ధనుంజయరావు, సీతాలక్ష్మిల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అయితే మంగళవారం పోస్టుమార్టం నిర్వహించలేదు. మృతుల రక్త సంబంధీకులు సుదూర ప్రాంతాల్లో ఉండడంతో వారి వచ్చేవరకూ పోస్టుమార్టం నిర్వహణ కష్టమని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేయడంతో బుధవారానికి వాయిదా వేశారు. -
బతుకు భారమై..
⇔ ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకూతుళ్లు ⇔ మృతి చెందిన కుమార్తె అపస్మారక స్థితిలో తల్లి ⇔ అయిన వారు ఉన్నా అనాథలుగా బతకలేక ఆత్మహత్యా ⇔ బాధితుల వద్ద సూసైడ్ నోట్లు? పదో తరగతిలో గ్రామానికే టాపర్‌గా నిలిచిన ఆ యువతి నిజ జీవిత పాఠాలు మాత్రం నేర్చుకోలేకపోయింది. ప్రాణాలు పోయేంత ప్రసవ వేదనను అనుభవించి ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చిన ఆ తల్లి ఆ తర్వాతి కష్టాలకు మౌనంగా తల వంచింది. ఆర్థిక సమస్యలకు సమాధానాలు వెతకలేక, ఎదురవుతున్న కష్టాలను భరించలేక, కుటుంబ సమస్యలను ఇంకా మోసే సత్తువ లేక సంతకవిటి మండలం గోళ్లవలసకు చెందిన తల్లీకూతుళ్లు చావడానికి సిద్ధమైపోయారు. రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనలో కుమార్తె పావని కన్నుమూయగా, తల్లి భాగ్యలత అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. శ్రీకాకుళం జిల్లా : భర్త ఎడబాటును ఐదేళ్ల పాటు తట్టుకున్న భాగ్యలత ఆ భారాన్ని మరి మోయలేకపోయిం ది. తండ్రి ఉన్నా ఆ ఆప్యాయత పొందలేని పా వని కూడా తల్లికి తోడుగా నిలవాలని చావుకు సిద్ధమైంది. పొందూరు రైల్వేస్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లీకూతుళ్ల కథ స్థాని కులకు కన్నీళ్లు తెప్పించింది. ఇలా జరిగింది పొందూరు రైల్వే స్టేషన్. సమయం మధ్యాహ్నం 2.30 గంటలు. పొందూరు రైల్వే స్టేషన్ నుంచి వాండ్రంకి రైల్వే క్రాస్ గేటువైపు రైలు పట్టాలు పక్కగా భాగ్యలత, పావనిలు నడుచుకుంటూ వ చ్చారు. ఇంతలో ఎదురుగా విశాఖ నుంచి పలాస వైపు గూడ్సు వచ్చింది. అప్పటికే చావుకు సిద్ధపడిపోయిన తల్లీకూతుళ్లు ఆ రైలుకు ఎదురెళ్లారు. ఘటనలో పావని అక్కడికక్కడే మృతి చెందగా తల్లి భాగ్యలతకు తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాకు పనుల్లో ఉన్న గార్డులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరి అపస్మారక స్థితిలో ఉన్న భాగ్యలతను పొందూరు 108 సాయంతో శ్రీ కాకుళం రిమ్స్‌కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆదివారం రాత్రికి ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకాకుళం రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించడంతో పాటు పోస్టుమార్టం కోసం పావని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. అండ లేదనేనా..? భాగ్యలతకు సంతకవిటి మండలం గోళ్లవలసకు చెందిన వెంపటాపు కామినాయుడుతో 18 ఏళ్ల కిందట వివాహం జరిగింది. భాగ్యలత కన్నవారి ఊరు బూర్జ మండలం పెదలంకాం గ్రామం. వివాహం త ర్వాత సోదరుడు నీలకంఠం కూడా భాగ్యలతతోనే ఉండేవారు. ఐదేళ్ల కిందటి వరకు భాగ్యలత కాపురంలో ఎలాంటి సమస్యా లేదు. సొంతిళ్లు కూడా కట్టుకుని, ఇద్దరు ఆడపిల్లలను చదివించుకుని హాయిగా జీవించారు. ఆ తరుణంలో భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్థలు మొదలయ్యాయి. అవి కాస్తా పెద్దవిగా మారాయి. దీంతో తన సోదరుడిని కూడా భాగ్యలత వదులుకుంది. అప్పటి వరకు సోదరి బా వలతో కలిసి ఉన్న నీలకంఠం ఐదేళ్ల కిందటి నుంచి రాజాం లో ఉంటున్నారు. ఆ తర్వాత కూడా దంపతుల మధ్య సమస్యలు సద్దుమణగలేదు. ఆఖరకు ఈ వివాదాలు రాజాం, సంతకవిటి పోలీస్ స్టేషన్ల వరకు చేరాయి. ఆ సమయంలో భాగ్యలత పలుమార్లు ఆత్మహత్యాయత్నాలు కూడా చేశా రు. పిల్లలు పెరుగుతున్నా తల్లిదండ్రుల్లో అన్యోన్యత పెరగలేదు. చివరకు పెద్దలు కలుగుజేసుకుని భార్యభర్తలను కలి పి తాత్కాలికంగా సమస్యలను పరిష్కరించారు. దీంతో భా ర్యాభర్తలిద్దరూ ఒకే ఊరిలో వేర్వేరుగా జీవనం సాగిస్తున్నా రు. వీరి ఇద్దరు ఆడపిల్లలు తల్లి భాగ్యలత వద్దే ఉంటున్నారు. పెద్దమ్మాయి గాయత్రి ఏడాది కిందట పదో తరగతిలో ఉత్తీర్ణత చెంది బూర్జ మండలం ఓవీపేటలో మోడల్ స్కూల్లో చేరి ఇంటర్ చదువుతోంది. ఇదే మండలం వాసుదేవపట్నంలో కస్తూర్బా పాఠశాలలో చదువుకున్న చిన్నమ్మా యి పావని కూడా ఈ యేడు 8.7 జీపీఏ మార్కులు సాధించింది. పావని ఆటల్లోనూ మేటిగా రాణించేది. స్పోర్ట్స్ స్కూల్లో చేరాలని ప్రయత్నిస్తూనే సోదరి చదువుతున్న మెడల్ స్కూల్లో చేరింది. అంతా సాఫీగానే సాగుతోందన్న తరుణంలో ఇలా తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పా ల్పడి అయిన వారికి కన్నీళ్లు మిగిల్చారు. ఆస్తి వివాదమేనా? ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భాగ్యలత, ఆమె భర్త కామినాయుడు ఒకే ఊరిలో ఉంటున్నా వేర్వేరుగా నివసిస్తున్నారు. పిల్లల చదువులు సమయంలో పాఠశాల వద్ద క లుస్తుంటారు. అంతవరకే వీరి బాధ్యత. వీరిద్దరి మధ్య వి వాదాన్ని గ్రామస్తులు, బంధువులు సెటిల్ చేసి భాగ్యలతకు ప్రతి నెల పోషణ ఖర్చులు ఆమె భర్త ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికైనా వీరు కలుస్తారని భావించారు. అయితే పరిస్థితి మారలేదు. ఇటీవల భాగ్యలత భర్త కామినాయుడు తన ఆస్తులను విక్రయానికి సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్నే భాగ్యలత అడిగినా ఫలితం లేకపోయినా భవిష్యత్‌పై భయంతో ఆమె ఈ దుశ్చర్యకు పా ల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. జ్వరంతో పెద్దమ్మాయి.. భాగ్యలత పెద్ద కూతురు గాయత్రి ఎప్పుడూ అమ్మను వీడి ఉండలేదు. కానీ ఆదివారం ఆమెకు జ్వరంగా ఉండడంతో ఆమె ఇంటి వద్దే ఉండిపోయింది. అమ్మ, చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయం తెలిసి ఆమె షాకైంది. సోదరి చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ కాగితాలు ఏమిటో? ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకూతుళ్ల వద్ద పలు కాగితాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అవి సూసైట్ నోట్లుగా అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ కాగితాలపై పూర్తిగా ఆరా తీసి సూసైడ్ నోట్లైతే వాటి ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపనున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన భాగ్యలతను శ్రీకాకుళం రిమ్స్‌లో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఆదివారం రాత్రినాటికి ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.