మనిషిని చంపిన చేప
గుంటూరు: చేపల వేటకు వెళ్లి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నగరం మండలం మీసాలవారి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు..మీసాలవారి గ్రామానికి చెందిన సీతరామయ్య(45) పెదమట్లపూడి ఎత్తిపోతల వద్ద చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలువలో దిగి ఒక చేపను పట్టుకొని దానిని నోట్లో పెట్టుకొని రెండో దాని కోసం ప్రయత్నించాడు. అదేసమయంలో నోట్లో ఉన్న చేప జారి గొంతులో పడింది. దీంతో అతన్ని పొన్నూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అపరేషన్ చేసిన అనంతరం అతడు మృతిచెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
(నగరం)