మావోయిస్టు పూనం దేవి అరెస్టు
దాదాపు పదమూడేళ్ల క్రితం జిల్లా అటవీ అధికారిని చంపిన కేసులో నిందితురాలైన మహిళా మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తలపై 50 వేల రూపాయల రివార్డు ఉంది. పూనం దేవి అనే ఆ మహిళా మావోయిస్టును ఆమె స్వగ్రామమైన తలయ్యా గ్రామంలో అరెస్టు చేసినట్లు బీహార్లోని గయ జిల్లా సీనియర్ ఎస్పీ గయా మను మహరాజ్ తెలిపారు.
రోహతస్ డీఎఫ్ఓ సంజయ్ సింగ్ను 2002లో చంపిన కేసులో ఆమె ప్రధాన నిందితురాలు. ఈ హత్యకేసును సీబీఐ విచారించి, ఆమె తలపై రూ. 50 వేల రివార్డు ప్రకటించింది. ఏరియా కమాండర్ జైకరణ్ యాదవ్ భార్య అయిన పూనందేవి, తర్వాత అతడితో సంబంధాలు తెంచుకుని తలయ్యా గ్రామంలో వేరే వ్యక్తితో కలిసి ఉంటుండగా అక్కడే ఆమెను అరెస్టు చేశారు.