Poor Dalit families
-
తొలిదశలో 75 గ్రామాల్లోనే..
* అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమికే పట్టాలు.. * నిరుపేద దళితులకు భూపంపిణీకి సర్కారు ఏర్పాట్లు * 15న నల్లగొండలో ప్రారంభం! సాక్షి, హైదరాబాద్: నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ పథకం తొలి దశను లాంఛనంగా ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గానికి ఒక గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించాలని తొలుత నిర్ణయించినా.. ప్రస్తుతమది 75 గ్రామాలకే పరిమితమైంది. అర్బన్ నియోజకవర్గాలు దాదాపు 30 తీసేయడంతోపాటు భూపంపిణీ చేయడానికి అనువైన భూములులేని నియోజకవర్గాలను కూడా దీన్నుంచి మినహాయించారు. ఈ నెల 15న భూపంపిణీ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలో ప్రారంభించే అవకాశం ఉందని అధికారవర్గా లు వివరించాయి. వాస్తవానికి ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే, లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందున తొలుత నియోజకవర్గంలోని ఒక గ్రామంలో నిరుపేద దళితులకు భూ పంపిణీ చేయాలని నిర్ణయించింది. భూముల కొనుగోలు కోసం రూ.185 కోట్లు విడుదల చేస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చినప్పటికీ.. ఇప్పటికిప్పుడు భూముల కొనుగోలు సాధ్యమయ్యే పని కాదని.. అందువల్ల ప్రభుత్వ భూమి ఉన్న గ్రామాలను మాత్రమే ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. అయితే.. ఎంత మంది రైతులకు భూ పంపిణీ చేయాలన్న అంశంపై ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. అందుబాటులో ఉన్న సాగు యోగ్యమైన భూమి ఎంత అన్నదానిపై అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఎంతమందికి ఇవ్వాలన్నదానిపై జిల్లాల్లో ఇంకా కసరత్తు కొనసాగుతోంది. ఈ పథకంలో భాగంగా కేవలం భూపంపిణీయే కాకుండా బోర్లు వేయడం, కరెంటు కనెక్షన్లతోపాటు సాగు వ్యయాన్ని కూడా వారికి అందించనున్నారు. మరోవైపు సాగుయోగ్యమైన భూమి లభిం చడం లేదని కలెక్టర్ల నుంచి నివేదికలు వస్తున్నట్లు సమాచారం. భూ సేకరణ చట్టం కింద భూములు తీసుకోవడం ఇప్పుడు కష్టసాధ్యంగా మారిందని చెబుతున్నారు. దళితులకు భూ పంపిణీ చేయడానికి భూ సేకరణ చేస్తున్నారనగానే.. భూముల ధరలూ పెంచారని అధికారవర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. -
నిరుపేద దళిత కుటుంబాలకే భూ పంపిణీ
గోపాలపురం (నిడమనూరు) :భూమిలేని నిరుపేలైన దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ యోగ్యమైన భూమి ప్రభుత్వం అందజేస్తుందని జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులను ఎంపిక చేసేందుకు ధర్మాపురం ఆవాసం గోపాలపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. భూమిలేకపోవడం వల్ల స్థిరం లేని మనుగడ సాగిస్తున్న దళితులను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిచోట, ప్రైవేటు భూముల అమ్మకంలో సహకరించాలని కోరారు. గోపాలపురంలో 25 మంది దళిత కుటుంబాలకు గాను 13మందిని మొదటి కేటగిరీలో, ఐదుగురిని రెండవ కేటగిరీలో, ఇద్దరిని మూడవ కేటగిరీలో అర్హులుగా నిర్ణయించారు. మొదటి కేటగిరీలో ఉన్న 13కుటుంబాలకు 39ఎకరాలు ఇవ్వా ల్సి ఉండగా అక్కడ ఎలాంటి ప్రభుత్వ భూమీ అందుబాటులో లేదు. దీంతో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధర్మాపురం గ్రామానికి చెందిన చింతరెడ్డి సైదిరెడ్డి వారి కుటుంబసభ్యుల 15ఎకరాల భూమిని జేసీ ప్రీతీమీనా పరిశీలించారు. గ్రామానికి దూరంగా ఉన్న భూముల వద్దకు రాళ్లబాటలో నడిచి వెళ్లారు. భూముల వద్ద విక్రయదారులతో జేసీ, ఆర్డీవో కిషన్‌రావు చర్చలు జరిపారు. వారు ప్రభుత్వం ప్రకటించిన ధరకు ఇవ్వలేమని, కొంతసమయం ఇవ్వాలని కోరారు. కాగా, రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్డీఓను జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో దామోదర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్, తహసీల్దార్ అంబేద్కర్, ఎంపీపీ నర్సింహ, జెడ్పీటీసీ సభ్యురాలు అంకతిరుక్మిణి, మల్లయ్య పాల్గొన్నారు.