మార్కెట్లో పేదోడి ఫ్రిజ్లు
మొదలైన కొనుగోళ్లు
నిర్మల్ అర్బన్ : వేసవి కాలం రానే వచ్చింది. చల్లని నీరు అందించే పేదోడి ఫ్రిజ్లుగా పేరొందిన రంజన్లు, కుండలు మార్కెట్లోకి రానే వచ్చాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు రంజన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు విక్రయకేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొదలైన గిరాకీ..
రంజన్లు, కుండలు, కూజాలకు గిరాకీ మొదలైంది. వేసవిలో దాహాన్ని తీర్చుకునేందుకు చల్లని నీటి కోసం వీటి వాడకం తప్పనిసరి. ఫ్రిజ్లు లేనివారు, ఫ్రిజ్లు విని యోగించలేని వారంతా చల్లని నీటి కోసం మట్టితో త యారు చేసిన రంజన్లు, కుండలనే వాడతారు. చల్లని నీటి కోసం వీటిపైనే ఆధారపడతారు. దీంతో వీటికి సాధారణంగా గిరాకీ ఎక్కువనే చెప్పవచ్చు. రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఆదిలాబాద్ రంజన్లు, కుండలకు ఉన్న విషయం తెలిసిందే.
వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్ రంజన్లు, కుండలను వ్యాపారులు అందుబాటులో ఉంచారు. మార్కెట్లో కొత్త కొత్త రకాలైన ఫ్రిజ్లు అందుబాటులోకి వచ్చినా.. వీటికి ఏ మాత్రం గిరాకీ తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నా రు. రంజన్లకు ఫ్రిజ్లు పోటీ కాదని వినియోగదారులు చెబుతున్నారు. పేదలతో పాటు మధ్య, ఉన్నత వర్గాల వారు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రిజ్ నీరు ఆరోగ్యదాయకం కాదని వైద్యులు పేర్కొనడంతో ఆరోగ్యంతో పాటు చల్లని నీటిని అందించే రంజన్లు, కుండలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.
అందుబాటు ధరల్లో..
ఆదిలాబాద్ నుంచి రంజన్లను నిర్మల్ పట్టణానికి తీసుకువచ్చి విక్రయదారులు అమ్మకాలు చేపడుతున్నారు. వినియోగదారులను ద ృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా దు కాణాలు వెలిశాయి. బస్టాండ్, ఎస్బీహెచ్ ముందు, రూరల్ పోలీస్స్టేషన్ సమీపంలో ఇతర ప్రాంతాల్లో రంజన్లు, కుండలను విక్రయిస్తున్నారు. వివిధ సైజుల్లో, డిజైన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. రంజన్లు సైజు ను బట్టి రూ.80 నుంచి రూ.120 వరకు, కుండలు రూ. 40 నుంచి రూ.60 వరకు విక్రరుుస్తున్నారు. చల్లని నీరందించే రంజన్లు, కుండల ధరలు మధ్య తరగతి, సామా న్య ప్రజలకూ అందుబాటులో ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా పగటి ఉష్ణోగ్రతలు పెరిగితే గిరాకీ మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.