Poor welfare
-
వారంతా తెలంగాణ బిడ్డలే
సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి రామచంద్రాపురం: వలస వచ్చి స్థిరపడ్డ వారంతా తెలంగాణ బిడ్డలేనని, వారికి తాము అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పేదల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అమలు చేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. గ్రామాలను పచ్చని పల్లెలుగా తీర్చిదిద్దేందుకు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. రాబోయే కాలంలో విద్యుత్ృసమస్య లేకుండా కృషి చేస్తామన్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పథకాలను కాపీ కొడుతున్న బాబు తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి మహేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రా కంటే తెలంగాణలో వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రూ.150 కోట్లతో 500 కొత్త బస్సులను తీసుకోవడం జరిగిందన్నారు. మిషన్ కాకతీయ పేరిట 46 వేల చెరువులను అభివృద్ధి పరిచేందుకు రూ.24 వేల కోట్లను కేటాయించడం హర్షదాయకమన్నారు. ఈ పథకం వల్ల చెరువులు నిండి పల్లెలు పూర్వ వైభవాన్ని చాటుకుంటాయన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, పార్టీ జీహెచ్ఎంసీ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు రాములుగౌడ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి, మాజీ కార్పొరేటర్ పుష్ప, నాయకులు వెంకటేశంగౌడ్, బాల్‌రెడ్డి, చంద్రారెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, తొంట అంజయ్య, నగేష్ యాదవ్, వి.మోహన్‌రెడ్డి, శ్రీధర్‌చారి, పరమేశ్, అన్వర్ పటేల్, అబ్బు అలీ పాల్గొన్నారు. -
కమ్యూనిస్టులకు ఆదర్శం కేవల్ కిషన్
* పోరాటయోధుడిని మరువని జనం * 54 ఏళ్లుగా పోలంపల్లి శివారులో జాతర * రేపు ఆయన వర్ధంతి చిన్నశంకరంపేట: పేదల సంక్షేమం కోసం పరితపించిన పోరాట యోధుడు కేవల్ కిషన్ మరణించి నేటికి 54 ఏళ్లు. అయినా ఆయన జ్ఞాపకాలు జనం గుండెల్లో పదిలంగా ఉన్నాయి. డిసెంబర్ 26న ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజలు ఆయనను స్మరించుకునేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. ఏటా పొలంపల్లి గ్రామశివారులో నిర్వహించే జాతరలో ఆయన సమాధి చుట్టూ స్థానికులు బండ్లు తిప్పి ఆయనను ఆరాధ్యదైవంగా కొలుస్తారు. ప్రజల కోసం మరణిస్తే వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడానికి కేవల్ కిషన్ నిలువెత్తు సాక్ష ్యం. 1922 మే 10న చిన్నశంకరంపేట మండలం తుర్కల మందాపూర్ గ్రామంలో కేవల్ నారాయణ, మున్నాబాయి దంపతులకు కేవల్ కిషన్ జన్మించారు. మెదక్‌లో ఉంటూ విద్యభ్యాసం చేసిన ఆయన హైదరాబాద్‌లో బీఏ చదువుతూ టాపర్‌గా నిలిచారు. కమ్యూనిస్టు ఉద్యమకారులతో పరిచయాలు పెంచుకున్న ఆయన తన మార్గాన్ని ప్రజ ఉద్యమాలవైపు మళ్లించారు. మెదక్ ప్రాంతంలోని జమిందారుల ఆగడాలతో విసిగి వేసారిన పేదలను ఆయన ఒక్కటి చేసి ప్రజాపోరాటాలు నిర్మించారు. భూపోరాటాలతో నిజాం సర్కార్‌ను గడగడలాడించిన కేవల్ కిషన్, స్వాతంత్య్రం అనంతరం కూడా తనపంథాను మార్చుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతూనే కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో చురుకైన నాయకుడిగా పనిచేశారు. దున్నేవాడికే భూమి అంటు పేదలకు భూములు పంచిపెట్టారు.అలాగే కార్మికుల కోసం అనేక పోరాటాలు చేశారు. పోరాటాల్లో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యం చేస్తు పాలకులకు శత్రువుగా మారిన కేవల్ కిషన్‌ను అప్పటి పాలకులు రోడ్డు ప్రమాద రూపంలో హత్యచేశారని ప్రజలు నమ్ముతున్నారు. 1960 డిసెంబర్ 26న మాసాయిపేటలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన తన సహచరుడు లక్ష్మయ్యతో కలిసి సైకిల్ మోటార్‌పై మెదక్ వస్తుండగా లారీతో ఢీకొట్టి ఆయనను అడ్డు తొలగించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన కమ్యూనిస్టుగా దేవుడిని నమ్మేవారో లేదో కాని ఇక్కడి ప్రజలు మాత్రం ఆయన ప్రమాదానికి గురై తుది శ్వాస విడిచిన మెదక్చేగుంట ప్రధాన రహదారి పొలంపల్లి చౌరస్తాలో గుడి నిర్మించి ఆయన ప్రతిమకు పూజలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న ఇక్కడ జరిగే జాతరకు పరిసర ప్రాంత ప్రజలు హాజరై తమ నాయకుడిని స్మరించకుంటారు. పేదల కోసం సొంత ఆస్తులను పంచిపెట్టి ఆయన పలువురికి ఆదర్శంగా నిలిచారు. దొరలు,జమిందారుల ఆగడాలను ఎదుర్కొని నిజాం నవాబుల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆయన చరిత్రను నేటికి పల్లే ప్రజలు పాటల రూపంలో పాడుకుంటారు.అప్పట్లో పుట్టిన బిడ్డలకు కిషన్, కిషనమ్మ అంటూ పేర్లు పెట్టుకొనేవారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కేవల్ కిషన్ సతీమణి అనందబాయి మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖ ఉక్కుపరిశ్రమ కోసం తన పదవికి రాజీనామా చేసి భర్త దారిలోనే నడుస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలు సీపీఎం, సీపీఐగా అవతరించినప్పటికీ వారు కేవల్ కిషన్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. సంగారెడ్డిలో నిర్మించిన పార్టీ కార్యాలయాలకు కేవల్ కిషన్ భవన్‌గా నామకరణం చేసి గౌరవించారు. -
పేదల సంక్షేమమే ధ్యేయం
వైఎస్సార్ సీపీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి గున్నం నాగిరెడ్డి నల్లగొండలో ఇంటింటి ప్రచారం తాగు, సాగు నీరందించేందుకు కృషి నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్, పేదల సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి గున్నం నాగిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని వివిధ కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ప్రజలకు సుభిక్షమని అవి అమలు కావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజలందరు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరారు. జిల్లాలో ప్రజ లకు కృష్ణా జలాలు అందించి ఫ్లోరిన్ బారినుంచి కాపాడుతామన్నారు. జిల్లా ప్రజలకు తాగు, సాగు నీరందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. శ్రీశైలం సొరంగం మార్గం పూర్తి చేసి రైతాంగానికి సాగునీటి కొరత తీర్చుతామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు పోతుందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడుతామని చెప్పారు. రైతాంగానికి ఏడు గంటల నాణ్యమైన విద్యుత్‌ను పగటి పూటనే అందిస్తామని తెలిపారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కోసం 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 150 యూనిట్లు విద్యుత్ వాడుకున్న వారికి 100 రూపాయలకే కరెంట్ అందిస్తామన్నారు. తమ ఎన్నికల ప్రణాళికను అమలు చేసి ప్రజల కష్టాలు తీర్చుతామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఇరుగు సునీల్‌కుమార్, మేడిశెట్టి యాదయ్య, కోరె గోవర్దన్, అతిక్ రహ్మద్, గాదరి రమేష్, లక్ష్మికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ పాలనలో మరింత ‘సంక్షేమం’
తండ్రి ఆశయాలకోసం పాటుపడుతున్న జననేత తిరుపతిలో వైఎస్ సోదరుడు రవీంద్రారెడ్డి ప్రచారం తిరుపతి, న్యూస్‌లైన్: పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణపాలన చూశారని, తండ్రి ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతూ మరిన్ని సంక్షేమ పథకాలను అందించనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలననూ ఒకసారి చూడండంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ రవీంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఎంవీ ఎస్.మణి, మోహన్, శేఖర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ తమ అన్న రాజశేఖరరెడ్డి నిరంతరం పేదల సంక్షేమం కోసమే పాటుపడేవారని గుర్తుచేశారు. డాక్టర్‌గా ఒక రూపాయి ఫజుతోనే పేదలకు వైద్యం అందించారన్నారు. పేదలకు నిరంతరం ఎనలేని సేవలందించాలన్న సంకల్పంతో అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి ఏ నాయకుడూ చేయలేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. పేదల సమస్యలను తెలుసుకుని మరిన్ని సంక్షేమ పథకాలను అందించాలన్న లక్ష్యంతో జోరు వానను సైతం లెక్కచేయకుండా హెలికాప్టర్లో బయలుదేరి తిరిగిరాని లోకాలకు వె ళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేసిన వారిని ఎప్పుడూ ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తారన్నారు. వైఎస్ మరణానంతరం టీడీపీ, కాంగ్రె స్ కుమ్మక్కు రాజకీయాలతో రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఎంతగా హింసపెట్టాయో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. తండ్రి ఆశయం కోసం కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి అభ్యున్నతి కోసం శ్రమిస్తున్న జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే సీమాంధ్ర అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. తిరుపతిలో ఇల్లిల్లూ తిరిగి ప్రజల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఒక కరుణాకరరెడ్డి మాత్రమేనన్నారు. తిరుపతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దగల సత్తా కరుణాకరరెడ్డికి మాత్ర మే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చాంద్‌బాషా, శివ, మహిళలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ను ఏ పార్టీ ఎదుర్కోలేదు
పరకాల, న్యూస్‌లైన్ : నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదని రాష్ర్ట బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. విద్యార్థుల బలిదానాలను అర్థం చేసుకున్న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన ప్రకటనను హర్షిస్తూ పరకాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబారి సమ్మారావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి బస్వరాజు సారయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. తెలంగాణ కోసం 56 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పోరాటం సోనియా గాంధీతో నెరవేరిందని చెప్పారు. సీడబ్ల్యూసీలో ఏకవాక్య తీర్మాణంపై తెలంగాణ ప్రకటన చేయించిన ఘనత సోనియాకే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉంటున్న సీమాంధ్రులను మన కుటుంబ సభ్యులేనని, రాష్ర్టం ఏర్పడిన తర్వాత వారిని అన్నదమ్ముల్లా చూడాలని ప్రజలకు సూచించారు. తెచ్చింది.. ఇచ్చింది.. కాంగ్రెస్సే : ఎంపీ సిరిసిల్ల రాజయ్య తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెచ్చింది.. కాంగ్రెస్ ప్రభుత్వమేనని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగుకోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకే సోనియాగాంధీ రాష్ర్ట ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమ ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిందన్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌తో సహా తొమ్మిది జిల్లాల్లో నివాసముంటున్న సీమాంధ్రులకు, వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండి సారంగపా ణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మడికొండ సం పత్, నాయకులు బస్వోజు సురేష్, తిరుపతి రెడ్డి, కళావతి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ పాల్గొన్నారు.