పేదల సంక్షేమమే ధ్యేయం | Goal of welfare poor | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే ధ్యేయం

Published Tue, Apr 15 2014 2:29 AM | Last Updated on Tue, Oct 16 2018 8:50 PM

పేదల సంక్షేమమే ధ్యేయం - Sakshi

పేదల సంక్షేమమే ధ్యేయం

వైఎస్సార్ సీపీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి గున్నం నాగిరెడ్డి
నల్లగొండలో ఇంటింటి ప్రచారం
తాగు, సాగు నీరందించేందుకు కృషి


 నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్, పేదల సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి గున్నం నాగిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని వివిధ కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ప్రజలకు సుభిక్షమని అవి అమలు కావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.

ప్రజలందరు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరారు. జిల్లాలో ప్రజ లకు కృష్ణా జలాలు అందించి ఫ్లోరిన్ బారినుంచి కాపాడుతామన్నారు. జిల్లా ప్రజలకు తాగు, సాగు నీరందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. శ్రీశైలం సొరంగం మార్గం పూర్తి చేసి రైతాంగానికి సాగునీటి కొరత తీర్చుతామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు పోతుందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడుతామని చెప్పారు. రైతాంగానికి ఏడు గంటల నాణ్యమైన విద్యుత్‌ను పగటి పూటనే అందిస్తామని తెలిపారు.

 రైతు పండించిన పంటకు మద్దతు ధర కోసం 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 150 యూనిట్లు విద్యుత్ వాడుకున్న వారికి 100 రూపాయలకే కరెంట్ అందిస్తామన్నారు.

 తమ ఎన్నికల ప్రణాళికను అమలు చేసి ప్రజల కష్టాలు తీర్చుతామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఇరుగు సునీల్‌కుమార్, మేడిశెట్టి యాదయ్య, కోరె గోవర్దన్, అతిక్ రహ్మద్, గాదరి రమేష్, లక్ష్మికాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement