జిల్లాకు జగన్
రేపు కోదాడ, హుజూర్‌నగర్‌లలో బహిరంగసభలు ఏర్పాట్లలో పార్టీ నాయకులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 25వ తేదీన జిల్లాకు రానున్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌లలో నిర్వహించే బహిరంగ సభల్లో వైఎస్.జగ న్ ప్రసంగిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి బుధవారం తెలిపారు.
కోదాడలో ఉదయం 10 గంటలకు, హుజూర్‌నగర్‌లో 11.30 గంటలకు సభలు జరుగుతాయని చెప్పారు. సభలను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు, వైఎస్సార్ అభిమానులకు జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
పార్టీ నేతల్లో ఉత్సాహం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ స్థానం కోసం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరి గెలుపే లక్ష్యంగా ఇప్పటికే జగన్ సోదరి షర్మిల జిల్లాలో ప్రచారం చేశారు.
ఈ నెల 18వ తేదీన ఒకేరోజు హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఆమె నిర్వహించిన ప్రచారానికి అనూహ్యంగా స్పందన లభించింది. సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ క్రమంలో రెండు నియోజక వర్గాల్లో ఆ పార్టీ అధినేతే స్వయంగా ఎన్నికల ప్రచారానికి రానుండడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం మొదలైంది.
హుజూర్‌నగర్, కోదాడలో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న విషయం తెలిసిందే. వారిలో మరింత ఉత్సాహాన్ని నింపి ఎన్నికల్లో విజయభేరి మోగించాలన్న లక్ష్యంతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు మొగ్గు చూపారు. ఎప్పుడెప్పుడా అని యువనేత కోసం ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. సభలు విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.