నల్లగొండ: సమావేశంలో మాట్లాడుతున్న చిన్నపరెడ్డి
టీడీపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో పరిశ్రమలు స్థాపించి యువతకు, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యో గ అవకాశాలు కల్పిస్తానని టీడీపీ ఎంపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి అన్నారు. నల్లగొండ వెంకటసాయి ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇంజనీరింగ్ పట్టభద్రుల కోసం ఐటీ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడానికి కృషి చేస్తానన్నారు. బీడు భూములకు సాగునీరు అందించేందుకు సొరంగ మార్గం, ఎస్‌ఎల్‌బీసీ, నక్కలగండి పూర్తి చేస్తానన్నా రు. సూర్యాపేట పాలేరు నుంచి విద్యుత్ కోతలు లేకుండా సోలార్ సిటీగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.
ఏరియా ఆస్పత్రులకు అనుగుణగా మెడికల్ కాలేజీ, కళాశాలలు ఏర్పాటు చేసి వైద్య రంగానికి, విద్యకు పెద్ద పీట వేస్తామన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కమీషన్లకు కక్కుర్తిపడి ప్రజల సంక్షేమాన్ని విస్మరించి తన కుటుంబ ఆస్తులను పెంచుకున్నాడని ఆరోపించారు. ఫ్లోరైడ్ గ్రామాలకు తాగునీరు ఇవ్వలేదన్నారు.
జానారెడ్డి ఆస్తులపై దర్యాప్తు
జానారెడ్డి దోచుకుని ఇతర రాష్ట్రాలు దాచుకోవడంలోనే సీనియార్టీ ఉందని, పవర్ ప్లాంటుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం జానారెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. ఆయా కుటుంబ ఆస్తులపైన సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ తదితర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. గుత్తా మింగిన కమీషన్లు, అక్రమ ఆస్తులను కక్కిస్తామన్నారు.
రాజకీయ అవనీతి లేకుండా ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో నిలబడినట్లు తెలిపారు. జానారెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకు తనపై అనేక అక్రమ కేసులు పెట్టించాడని, తన పరిశ్రమలపై సోదాలు, దాడులు చేయించినా బెదరలేదన్నారు.
నరేంద్రమోడీని ప్రధాని కోసం ప్రజలు ఆదరించాలని కో రారు. అనంతరం గ్రామాలకు చెందిన యువకులు టీడీపీలో చేరారు. కార్యక్రమంలోబీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.శ్రీనివాస్‌రెడ్డి, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, బోయపల్లి కృష్ణారెడ్డి, కాశీనాథ్, రియాజ్ అలీ, మధుసూదన్‌రెడ్డి, పల్లెబొయిన శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.