ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం ముమ్మర ప్రచారం చేశారు. తొలుత 17వ వార్డులోని భాగ్యనగర్, విజయనగర్ కాలనీ, దారావారి తోట ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
17వ వార్డు మాజీ కౌన్సిలర్ జి.ఏడుకొండలు ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ప్రచారం ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఓటర్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని బాలినేని కోరారు. టీ కొట్లు, చిల్లర బంకుల వద్ద ప్రచార రథాన్ని ఆపి మరీ ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు.
బాలినేనితో పాటు వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, పార్టీ నాయకులు మధు, రమేష్, సుశీల, బడుగు ఇందిర, ఐ.నాగరాజు, జాకబ్, శ్రీను, తమ్మిశెట్టి రాంబాబు, నాగరాజు, యోహోను, తమ్మిశెట్టి చంద్ర, మహిళా కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలోకి మహిళలు
ప్రచారంలో భాగంగా బాలినేని భరత్ నగర్ కాలనీకి బాలినేని వెళ్లారు. అక్కడి మహిళలు బాలినేని సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో పి.లక్ష్మి, జి.మస్తానమ్మ, బి.వీరమ్మ, డి.కోటేశ్వరి, ఎస్.ప్రమీల, ఎస్.శ్రీదేవి, బి.సుబ్బారావు, పి.హరిబాబు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు కూడా..
15వ వార్డులోని కేశవస్వామిపేటకు చెందిన జూటూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బాలినేని సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో దండూరి సుబ్బారావు, కె.శివయ్య, జాలశ్రీ లక్ష్మణ్, దుంపల తిరుమల వాసులు, నక్క కోటయ్య, దుంపల రామకృష్ణ తదితరులు ఉన్నారు.
ఉప్పుగుండూరు కార్యకర్తలు కూడా..
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒంగోలు వచ్చి బాలినేని ఇంటి వద్ద ఆయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో తెలగతోటి చంద్రమోహన్, కొలకలూరి రమేష్, యక్కల సుబ్బారావు, కె.వరప్రసాద్, కట్టా అంజయ్య, కె.మాణిక్యరావు కుటుంబాలతో పాటు బాబూజగ్జీవన్‌రావు అండ్ అంబేద్కర్ స్నేహ యూత్ ఫోర్స్ యువకులు కూడా పార్టీలో చేరారు. దాదాపు వంద మందికిపైగా వైఎస్సార్ సీపీలో చేరారు.
ఒంగోలులో బాలినేని విస్తృత ప్రచారం
Published Thu, Apr 24 2014 4:26 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement