వెంగమ్మ రిలీవ్
{పొఫెసర్గా కొనసాగింపు
ఇన్చార్జి డెరైక్టర్‌గా టీటీడీ జేఈవో పోలా భాస్కర్
తిరుపతి: శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) డెరైక్టర్ పదవి నుంచి డాక్టర్ వెంగమ్మ వైదొలిగారు. ఆమెను డెరైక్టర్ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జి డెరైక్టర్‌గా టీటీడీ జేఈవో పోలా భాస్కర్‌ను నియమించారు. ఇదిలావుండగా వెంగమ్మ ఇకపై ప్రొఫెసర్‌గా కొనసాగనున్నారు.
వేధింపులే కారణమా?
రాజకీయ ఒత్తిళ్లవల్లే డెరైక్టర్ పదవి నుంచి రిలీవ్ చేయాలని వెంగమ్మ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శిని కోరినట్టు తెలిసింది. స్విమ్స్ మాజీ డెరైక్టర్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతు న్న నేపథ్యంలో వాటిని కప్పిపుచ్చుకునేందుకు కొందరుమంత్రులు ప్రయత్నిస్తున్నా రు. తమకు అడ్డొస్తున్నారని ఆమెను తొలగించేందుకు విశ్వప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఫలించకపోవడంతో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు రంగంలో కి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు సమాచారం.