Post Graduate Diploma
-
ఎస్‌ఎస్‌జేలో జర్నలిజం కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
చరిత్ర రచనలో సాక్షిగా నిలవండి కొత్త చరిత్రను మీరే లిఖించండి. పాత్రికేయం అంటే మామూలు ఉద్యోగం కాదు, అదొక యజ్ఞం. నిజాల నిగ్గు తేల్చుతూ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే పవిత్ర కార్యం. మీలో ఆ నిబద్ధత ఉంటే మేము ముందుకు నడిపిస్తాం. ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం’ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. సమాజంలో గౌరవం, కీర్తితో పాటు ఉపకారవేతనం కూడా సంపాందించండి. పత్రికలు, ప్రసార మాధ్యమాలకు సుశిక్షితులైన జర్నలిస్టులను అందించే లక్ష్యంతో ఏడాది వ్యవధి కలిగిన ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం’ కోర్సును సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం అందిస్తోంది. (ఈ కోర్సు సాక్షి మీడియా స్వయం ప్రతిపత్తితో నిర్వహిస్తోంది. ప్రభుత్వ నియంత్రణలోని ఏ ఇతర విద్యాసంస్థతోనూ ఎటువంటి సంబంధం లేదు.) రిపోర్టింగ్, రైటింగ్, ఎడిటింగ్, డిజైనింగ్, స్కిప్ట్రింగ్, ప్రోగ్రామింగ్ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఆయా రంగల్లో తీర్చిదిద్దుతాము. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫుల్లీ ఫంక్షనల్ న్యూస్ రూం, టి.వి స్టూడియో వంటి సౌకర్యాల మధ్య విద్యాభ్యాసం చేసే అవకాశం వల్ల ప్రింట్ పబ్లిషింగ్, ఆన్ లైన్ కంటెంట్, టీవీ ప్రోగ్రామింగ్ విభాగాల్లో చక్కటి అనుభవం లభిస్తుంది. తరగతి గదుల్లో ఇచ్చే శిక్షణతో పాటు న్యూస్ రూముల్లో ఇచ్చే శిక్షణతో మరింత మెరుగుపడతారు. దరఖాస్తులు : www.sakshischoolofjournalism.com, www.sakshieducation.com వెబ్సైట్లలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో అన్ని విధాలా దరఖాస్తు పూర్తి చేయవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడే రూ. 250 ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత ఒక యూనిక్ నెంబరు వస్తుంది. ఆ నెంబరును దరఖాస్తుపై పేర్కొంటూ, పూర్తి చేసి ఆన్లైన్లోనే సమర్పించిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ లభిస్తుంది. దాన్ని ఉపయోగించి జూన్ 4వ తేదీ 2019 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రెండు దశల ఎంపిక : విద్యార్థుల ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రెండు పేపర్లుంటాయి. మొదటి పేపర్లో తెలుగు, ఇంగ్లిష్ , కరెంటు అఫైర్స్ అంశాల్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపర్లో వ్యాసరూప, ఆంగ్లం నుంచి తెలుగులో అనువదించే ప్రశ్నలుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సాక్షి పబ్లికేషన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. మోడల్ పేపర్లు www.sakshischoolofjournalism.com, www.sakshieducation.com వెబ్ సైట్లలో లభిస్తాయి. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రెండో దశలో గ్రూప్ డిస్కషన్, మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో కూడా ఉత్తీర్ణులైన విద్యార్థులను శిక్షణకు ఎంపిక చేస్తారు. అగ్రిమెంట్ : ఎంపికైన అభ్యర్థులు 4 ఏళ్ల పాటు (శిక్షణ సమయం కలుపుకొని) సాక్షిలో పని చేయాలి. ఆరంభంలోనే ఒప్పందపత్రం ఇవ్వాలి. అభ్యర్థులు సాక్షికి సంబంధించిన ఏ విభాగంలోనైనా లేదా ఫీల్డ్‌లోనైనా, లేదా ఎక్కడ కేటాయిస్తే అక్కడ పని చేయవలసి ఉంటుంది. నెలసరి ఉపకారవేతనం : మొదటి 6 నెలలు : రూ 10,000/– తదుపరి 6 నెలలు : రూ 12,000/– ట్రైనీగా ఏడాది పాటు : రూ 15,000/– కనీస అర్హతలు : తెలుగు భాషలో ప్రావీణ్యం ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం – గ్రాడ్యుయేషన్ పట్టా వయోపరిమితి : 09–06–2019 నాటికి 30 ఏళ్ల వయసు లోపు వారై ఉండాలి. ముఖ్య తేదీలు : దరఖాస్తు చేయడానికి చివరి తేది : మే 28 (మంగళవారం) రాతపరీక్ష : జూన్ 9 (ఆదివారం) రాతపరీక్ష ఫలితాలు : జూన్ 24 (సోమవారం) ఇంటర్వ్యూలు : జులై 8 నుంచి 13 వరకు తుది ఫలితాలు : జులై 22 (సోమవారం) తరగతుల నిర్వహణ : జులై 29 (సోమవారం) నుంచి... చిరునామ : ప్రిన్సిపాల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, 6వ అంతస్తు, ఎం.జి.ఆర్.ఎస్టేట్స్, మోడల్ హౌస్ వెనుక, పంజగుట్ట, హైదరాబాద్ – 500082. ఫోన్ : 040 2335 4715, సమయం : ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు (ఆదివారం సెలవు) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కింది లింక్‌ను క్లిక్ చేయండి. www.sakshischoolofjournalism.com -
ఎంబీఏ / పీజీడీఎం.. ఏది బెస్ట్!
ఎంబీఏ.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పీజీడీఎం.. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ రెండూ మేనేజ్మెంట్ నైపుణ్యాలను అందించేవే. కార్పొరేట్ కొలువులకు మార్గం చూపేవే. భవిష్యత్తు బిజినెస్ లీడర్లను తీర్చిదిద్దేవే. కానీ.. అదే సమయంలో.. రెండిటి మధ్య వ్యత్యాసం ఉందనే అభిప్రాయం.. ఇండస్ట్రీ వర్గాల్లో సైతం భిన్నాభిప్రాయాలు.. నైపుణ్యాల పరంగా కొన్ని తేడాలనే వ్యాఖ్యలు. ఇవి.. మేనేజ్మెంట్ విద్య ఔత్సాహికులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇక.. ఐఐఎం సహా పలు బి–స్కూల్స్‌లో ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎంబీఏ, పీజీడీఎం ఏది మంచిదో తెలుసుకుందాం.. థియరీకి ప్రాధాన్యమిచ్చే ఎంబీఏ కరిక్యులం పరంగా ఎంబీఏ అధిక శాతం థియరీ ఓరియెంటేషన్‌తో ఉంటుంది. నిర్దిష్టంగా సంబంధిత యూనివర్సిటీ రూపొందించిన సిలబస్‌ను, బోధన విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఇక.. పీజీడీఎం ప్రాక్టికల్ ఓరియెంటేషన్, ఇండస్ట్రీ అవసరాలకు సరితూగే ఇతర నైపుణ్యాలను అందించే విధంగా ఉంటుందనే అభిప్రాయం. స్పెషలైజ్డ్ నైపుణ్యాలు అందించే పీజీడీఎం నైపుణ్యాల సముపార్జన కోణంలో ఎంబీఏ, పీజీడీఎంల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిస్తే.. ఎంబీఏ పూర్తిగా.. అన్ని నిర్వహణ నైపుణ్యాలు అందించే విధంగా ఉంటోంది. పీజీడీఎం ఇందుకు భిన్నమని చెప్పొచ్చు. ఇందులో అభ్యర్థులకు నిర్దిష్టంగా ఒక సబ్జెక్ట్‌లో స్పెషలైజ్డ్ నైపుణ్యాలను అందిస్తుంది. కారణం రెండేళ్ల వ్యవధిలో ఉండే పీజీడీఎంలో మొదటి నుంచే అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌కు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం లభిస్తుంది. కానీ ఎంబీఏలో స్పెషలైజేషన్ అంటే రెండో ఏడాదిలో మొదలవుతుంది. అంతేకాకుండా ప్రాజెక్ట్‌వర్క్ పేరుతో ఏదో ఒక విభాగంలోనే పని చేయాల్సి ఉంటుంది. బోధన పరంగానూ తేడాలు బోధన పరంగానూ ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఎంబీఏ సాధారణంగా ఏడాదిలో రెండు టర్మ్‌లుగా రెండు సెమిస్టర్లుగా మొత్తం నాలుగు సెమిస్టర్లలో ఉంటుంది. పీజీడీఎంను అందిస్తున్న అటానమస్ ఇన్స్టిట్యూట్లు ట్రైమెస్టర్ విధానంలో బోధిస్తున్నాయి. ఇన్స్టిట్యూట్ ఆధారంగా డిగ్రీకి గుర్తింపు ఎంబీఏ, పీజీడీఎం విషయంలో ఇండస్ట్రీ వర్గాల గుర్తింపు, జాబ్ మార్కెట్లో ఆదరణ వంటివి సర్టిఫికెట్ అందించిన ఇన్స్టిట్యూట్కు ఉన్న ప్రామాణికతపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు.. ఎంబీఏను పరిగణనలోకి తీసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీలు, యూనివర్సిటీల క్యాంపస్ కళాశాలలకు ఇప్పటికీ మంచి గుర్తింపు లభిస్తోంది. ఇక.. పీజీడీఎం విషయానికొస్తే ఐఐఎంల తర్వాత దేశంలో గరిష్టంగా యాభై ఇన్స్టిట్యూట్లకు మాత్రమే పరిశ్రమ వర్గాల నుంచి, జాబ్ మార్కెట్లోనూ గుర్తింపు లభిస్తోంది. ఎంబీఏకు తత్సమానమే.. కానీ.. పీజీడీఎం కోర్సును ఎంబీఏకు తత్సమాన కోర్సుగా పేర్కొంటున్నారు. ఇది వాస్తవమే అయినప్పటికీ ఈ తత్సమాన గుర్తింపు పొందాలంటే సదరు పీజీడీఎం వ్యవధి కచ్చితంగా రెండేళ్లు ఉండాల్సిందే. ఇటీవల కాలంలో జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుని ఏడాది వ్యవధిలోనే పీజీడీఎం కోర్సులను బోధిస్తున్నాయి. ఈ వ్యవధి ఆసాంతం ఒక రంగానికి సంబంధించి (ఉదాహరణకు.. రిటైల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ తదితర)న నైపుణ్యాలనే అందిస్తున్నాయి. ఇలాంటి ధోరణి కారణంగా విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. సదరు రంగంలో సంక్షోభం ఏర్పడితే మరో రంగంలో రాణించే నైపుణ్యాలు ఉండవు. అదే విధంగా సంబంధిత రంగంలో ప్రస్తుతమున్న క్రేజ్, డిమాండ్ భవిష్యత్తులో లేకపోతే ఇబ్బందే. కాబట్టి పీజీడీఎంలో చేరే అభ్యర్థులు కచ్చితంగా రెండేళ్ల వ్యవధి కోర్సునే ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉన్నత విద్యలో ఇలా మాస్టర్ డిగ్రీ తర్వాత ఉన్నత విద్య అంటే రీసెర్చ్ అని తెలిసిందే. ఈ విషయంలో ఇటీవల కాలంలో ఎంబీఏ, పీజీడీఎం రెండు సర్టిఫికెట్లకు సమాన అవకాశాలు లభిస్తున్నాయి. గతంలో కేవలం ఎంబీఏ ఉత్తీర్ణులకే పీహెచ్డీ అవకాశం కల్పించే యూనివర్సిటీలు ఇటీవల కాలంలో ఎంబీఏకు తత్సమాన హోదాతో ఏఐసీటీఈ, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్స్ నుంచి పీజీడీఎం చేసిన వారిని సైతం రీసెర్చ్ ప్రోగ్రామ్‌లలో అర్హులుగా పేర్కొంటున్నాయి. ఇన్స్టిట్యూట్, కరిక్యులం ప్రధానం ఎంబీఏ, పీజీడీఎం దేన్ని ఎంపిక చేసుకున్నా విద్యార్థులు ఇన్స్టిట్యూట్కు ఉన్న గుర్తింపు, కరిక్యులం పరంగా అమలు చేస్తున్న విధానాలను తెలుసుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వ యూనివర్సిటీలైనా, అటానమస్ సంస్థలైనా విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే రెండు కోర్సులకూ సమాన అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి ఆందోళన చెందక్కర్లేదు. – ప్రొఫెసర్. వి. వెంకట రమణ, ఎస్ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ -
జర్నలిజంలో పీజీ డిప్లొమాకు
సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సుకు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణులై, 2015 ఆగస్టు 1 నాటికి 30ఏళ్లకు మించని వయసున్నవాళ్లంతా ఇందుకు అర్హులే. రూ.200 ఫీజు ఆన్లైన్లో చెల్లించి, దరఖాస్తును కూడా ఆన్లైన్లోనే నింపాలి. దరఖాస్తులకు ఆఖరి తేదీ ఏప్రిల్ 10. ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి ప్రచురణ కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. అర్హతలు, శిక్షణ, శిక్షణ భృతి, నియమావళి, మోడల్ పేపర్లు ఇతరత్రా సమాచారం... సాక్షి ఎడ్యుకేషన్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం వెబ్సైట్లలో ఉంటుంది. మరిన్ని వివరాలకు ఫోన్: 040 23386945. -
జర్నలిజంలో పీజీ డిప్లొమా
అర్హతలు: తెలుగు మీద పట్టు ఆంగ్లంపై అవగాహన డిగ్రీ ఉత్తీర్ణత (గతేడాదికి డిగ్రీ పూర్తిచేసి, సర్టిఫికెట్లు ఉన్నవారే అర్హులు) 01-08-2015 నాటికి 30 ఏళ్లకు మించని వయసు. ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 2 రాతపరీక్షలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. నమూనా ప్రశ్నపత్రాలు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లలో ఉంటాయి. మొదటి దశలో ఉత్తీర్ణులైనవారికి బృందచర్చ, మౌఖిక పరీక్ష ఉంటాయి. నియమావళి: అర్హత సాధించిన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు శిక్షణ కాలంతోపాటు సాక్షిలో నాలుగేళ్లు పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రం (బాండ్ అగ్రిమెంట్) ఇవ్వాలి. శిక్షణ భృతి: జర్నలిజం స్కూలులో చేరిన విద్యార్థులకు మొదటి ఆరు నెలలు రూ.8,000, తరవాతి ఆరునెలలు రూ.10,000 నెలవారీ భృతి ఉంటుంది. అనంతరం సంస్థలో ఏడాదిపాటు ట్రెయినీగా పనిచేయాలి. అప్పుడు సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు ఉంటాయి. దరఖాస్తు విధానం: www.sakshieducation.com, www.sakshischoolofjournalism.com వెబ్సైట్లలో దరఖాస్తులు ఉంటాయి. అందులోని సూచనలు క్షుణ్నంగా చదివి, దరఖాస్తును ఆన్‌ైలైన్‌లోనే పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని సాక్షి జర్నలిజం స్కూలు చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి. ఆన్లైన్లో దరఖాస్తు నింపే సమయంలోనే రూ. 200 ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డుల్లో దేంతోనైనా చేయొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక యునిక్ నంబర్ వస్తుంది. దాన్ని వేసి, దరఖాస్తు నింపే ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. ఆ నంబరు సాయంతో హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్య తేదీలు: దరఖాస్తు చేయడానికి గడువు:10-04-2015 రాతపరీక్ష: 19-04-2015 ఇంటర్వ్యూలు: 18-05-2015 నుంచి చిరునామా: ప్రిన్సిపల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సితారా గ్రాండ్ హోటల్ పక్కన, రోడ్ నంబర్- 12, బంజారాహిల్స్, హైదరాబాద్- 500034 ఫోన్: 040 23386945 సమయం: ఉ.10 గం.నుంచి సా. 5 గం. వరకు (సెలవులు, ఆదివారాలు మినహా)