post poll violence
-
‘నన్ను కొట్టారు.. నా దుస్తులు చించేశారు’
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును మానవహక్కుల కమిషన్ విచారిస్తుంది. ఈ క్రమంలో ఫలితాల అనంతరం జరిగిన దాడుల్లో టీఎంసీ కార్యకర్తలు తమను ఎలా చిత్రహింసలకు గురి చేశారో బాధితులు ఇండియాటుడేకి వెల్లడించారు. ఫలితాల అనంతరం టీఎంసీ కార్యకర్తలు తమ ఇళ్లు, దుకాణాల మీద పడి దాడి చేశారని.. విచక్షణా రహితంగా కొట్టారని తెలిపారు. వారికి భయపడి చాలామంది ఇప్పటికి ఇళ్లకు రావడం లేదన్నారు. రాఖీ రావంత్ అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘మే 2 ఆదివారం నాడు ఫలితాలు వెల్లడైన అనంతరం టీఎంసీ కార్యకర్తలు మా ఇంటి మీద దాడి చేశారు. నన్ను, నా కుటుంబ సభ్యులను చితకబాది.. నా బట్టలు చించేశారు. అంతటితో ఆగక నన్ను అసభ్యకరంగా తాకుతూ.. తెల్లవారేసరికి ఊరు విడిచి వెళ్లాలని.. లేదంటే అదే మాకు చివరి రాత్రని హెచ్చరించారు. సోమవారం ఉదయం మరోసారి వచ్చి నా పిల్లల్ని కొట్టారు. ఊరు విడిచి పోకపోతే నా భర్తను చంపుతామని బెదిరించారు. వారి భయంతో మేం వేరే గ్రామానికి వెళ్లాం. ఆ తర్వాత పోలీసులు సెక్యూరిటీ కల్పించడంతో తిరిగి మా ఇంటికి వచ్చాం’’ అని తెలిపింది. మరో బాధితురాలు మాముని సాహా అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలకు ముందు మార్చిలో టీఎంసీ కార్యకర్తలు 10 కేజీల చికెన్ కొట్టాల్సిందిగా ఆదేశించారు. డబ్బులు అడిగితే లేవన్నారు. దాంతో మేం చికెన్ ఇవ్వలేదు. దాన్ని మనసులో పెట్టుకుని ఫలితాల తర్వాత మా ఇంటి మీద దాడి చేశారు. కోళ్లఫారానికి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. మా ఇంటి ముందు బారికేడ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు. నన్ను నా భర్తను కొట్టారు’’ అని తెలిపింది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) విచారించాలంటూ కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై కోర్టుకెళ్లిన మమత సర్కార్కు కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కలకత్తా హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఘర్షణ సంబంధ కేసుల్ని విచారించాలని ఎన్హెచ్ఆర్సీని హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలను రీకాల్ చేయాలంటూ బెంగాల్ ప్రభుత్వం కోరగా అందుకు కోర్టు నో చెప్పింది. చదవండి: దీదీ పిటిషన్పై విచారణ వాయిదా -
బెంగాల్ హింసాకాండ : రేపు అఖిలపక్ష భేటీ
కోల్కతా : లోక్సభ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంటున్న హింసాకాండ, కోల్కతాలో బీజేపీ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు గవర్నర్ కేఎన్ త్రిపాఠి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజ్భవన్లో గురువారం సాయంత్రం 4 గంటలకు జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న ఘర్షణలను నివారించి శాంతిభద్రతల పరిస్ధితిని తిరిగి గాడిలో పెట్టేందుకు బెంగాల్ గవర్నర్ హోదాలో త్రిపాఠి అఖిలపక్ష భేటీకి చొరవ తీసుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకరించిన తృణమూల్ కాంగ్రెస్ తమ ప్రతినిధిగా పార్ధో ఛటర్జీని పంపుతోంది. ఇక బీజేపీ నుంచి దిలీప్ ఘోష్, సీపీఎం నుంచి ఎస్కే మిశ్రా, కాంగ్రెస్ తరపున ఎస్ఎన్ మిత్రా అఖిలపక్ష భేటీకి హాజరుకానున్నారు. -
ప్రత్యర్థిని నరికేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయో, లేదో.. ఘర్షణలు వెంటనే మొదలైపోయాయి. ఒడిసాలో బీజేడీకి చెందిన ఓ కార్యకర్తను కాంగ్రెస్ కార్యకర్తలు నరికి చంపేశారు. ఈ సంఘన కేంద్రపర జిల్లాలో జరిగింది. రంజిత్ నాయక్ (40) అనే వ్యక్తిని పత్రాపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు నరికి చంపినట్లు జిల్లా ఎస్పీ రవి నారాయణ్ బెహరా తెలిపారు. నిందితులు, మృతుడు ఒకే గ్రామానికి చెందినవాళ్లు. ఈ నేరంలో మరింతమంది పాత్ర ఏమైనా ఉందేమో తెలుసుకోడానికి దర్యాప్తు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాక రంజిత్ నాయక్ ఇంటివద్ద బాణాసంచా కాల్చారు. దానికి అభ్యంతరం చెబుతూ వాళ్లతో గొడవపడ్డాడు. దానికి ప్రతీకారంగా.. అతడు గ్రామ శివార్లలో ఒంటరిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు పదునైన ఆయుధాలతో దాడిచేసి నరికి చంపేశారు.