poster unveiling
-
ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ ‘పోస్టర్ ఆవిష్కరణ’
చార్మినార్: చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అనుమతిలేదంటూ పోలీసులు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చార్మినార్ వద్ద చేపట్టిన ‘బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందే’అనే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేను పోలీసులు గుల్జార్‌హౌస్ వద్ద అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పడంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు. అనంతరం మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొద్దిసేపు అక్కడ నిరసన తెలపడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సిటీ కాలేజీ వరకు తరలించి వదిలేశారు -
సత్యదేవుని వ్రతాల్లో జర్నలిస్టులకు అవకాశం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : పెదవాల్తెరు కరకచెట్టు పోలమాంబ ఆలయంలో మార్చి 5న నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాత్రికేయులు పాల్గొనవచ్చని వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్.దుర్గారావు తెలిపారు. హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ శాఖ, అన్నవరం వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారన్నారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ కరకచెట్టు పోలమాంబ దేవాలయం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ వెబ్ చానల్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ఉచిత సత్యనారాయణస్వామి వ్రతాల్లో జర్నలిస్టులు పాల్గొనాలని కోరారు. వివరాలకు 9154576846, 9246673421 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో వీజేఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. -
చంద్రబాబును అరెస్టు చేయాల్సిందే
జోగిపేట: ‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు ప్రధాన పాత్ర పోషించినా అరెస్టు చేయరా?’ అని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నర్ర భిక్షపతి ప్రశ్నించారు. గురువారం అందోలు గెస్ట్‌హౌస్‌లో రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే షర్మిల పరామర్శ యాత్రకు సంబంధించి వాల్‌పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించినా ఆయనపై కేసు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఒకవేళ టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు కేంద్రం సూచన మేరకు కుమ్మక్కయితే భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులుండవన్నారు. కాగా రంగారెడ్డి జిల్లాలో ఈనెల 29వ నుంచి షర్మిలమ్మ నిర్వహించే పరామర్శయాత్రను జిల్లా ముఖ్యనాయకులు పాల్గొని విజయవంతం చేయాలని నర్ర భిక్షపతి కోరారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పచ్చచొక్కాలకే పథకాలకు ప్రాధాన్యతను ఇచ్చేవారని, ఇప్పుడు గులాబీ చొక్కాలకు ఇస్తున్నారని వైఎస్సార్ సీపీ అందోలు నియోజకవర్గ ఇన్చార్జి బీ.సంజీవరావు ఆరోపించారు. తాము ప్రజలకు అండగా ఉండి అవసరమైతే పార్టీ తరపున పోరాడతామని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు డీజీ మల్లయ్య యాదవ్, సిద్దిపేట వైఎస్సార్సీపీ ఇన్చార్జి జగదీష్ గుప్త, నాయకులు పరిపూర్ణ, పాండు, ఏసు సమావేశంలో పాల్గొన్నారు.