Pottery
-
ప్రమిదల తయారీలో రాహుల్ గాంధీ...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోమారు వృత్తి పనివారల ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన సుమారు 9 నిమిషాల వీడియోను శుక్రవారం ‘ఎక్స్’లో విడుదల చేశారు. ఢిల్లీలో మట్టి ప్రమిదలను తయారు చేసే మహిళ ఇంటికి రాహుల్ గాంధీ వెళ్లారు. ప్రమిదలను సొంతంగా తయారు చేసేందుకు ప్రయతి్నంచారు. వీటిని తన తల్లి సోనియా గాం«దీ, సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాకు ఇస్తానన్నారు. ‘ప్రత్యేకమైన వ్యక్తులతో గుర్తుండిపోయే దీపావళి ఇది. దీపావళి నాడు పెయింటర్ సోదరులతో, కుమ్మరి వృత్తి పని వారి కుటుంబంతో పనిచేస్తూ గడిపాను. వారి వృత్తి పనిని దగ్గర్నుంచి గమనించాను. వారి పనితనాన్ని అలవాటు చేసుకునేందుకు ప్రయతి్నంచాను. వారి కష్టనష్టాలను అర్థం చేసుకున్నాను. మనం కుటుంబంతో కలిసి పండగలను సంతోషంతో జరుపుకుంటాం. వారు మాత్రం ఎంతోకొంత డబ్బు సంపాదించుకునేందుకు సొంతింటిని, కుటుంబాన్ని, సొంతూరిని, నగరాన్ని మర్చిపోతున్నారు’అని అనంతరం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘మట్టిలోనే వారు సంతోషం వెదుక్కుంటున్నారు. ఇతరుల జీవితాల్లో పండుగ వెలుగుల కోసం ప్రయత్నిస్తూ..తమ జీవితాల్లో వెలుగులు నింపుకోగలుతున్నారా? ఇళ్లను నిర్మించే వీరికి సొంతిల్లు కూడా ఉండటం గగనంగా మారింది’అని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమకు, నైపుణ్యానికి తగిన ప్రతిఫలం, ఆత్మగౌరవాన్ని అందించే వ్యవస్థను మనం తయారు చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ దీపావళి అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.10, జన్‌పథ్ బంగ్లా అంటే పెద్దగా ఇష్టం లేదుఢిల్లీలోని ల్యుటెన్స్ ప్రాంతంలో ఉన్న 10, జన్‌పథ్ బంగ్లా అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని రాహుల్ గాంధీ చెప్పారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురైన సమయంలో ఈ బంగ్లాలోనే ఉన్నారని, అందుకే అంతగా ఇష్టం లేదని ఆయన గురువారం చెప్పారు. జన్‌పథ్ బంగ్లాకు రంగులు వేసే కారి్మకులతో కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా సోదరి ప్రియాంకా గాంధీ కుమారుడు, మేనల్లుడు రైహాన్ రాజీవ్ వాద్రాతో ఈ మేరకు చేసిన సంభాషణ వీడియోను ఆయన విడుదల చేశారు. రాహుల్ గాంధీ చిన్నప్పటి నుంచి 10, జన్‌పథ్ బంగ్లాలోనే గడిపారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం తల్లి సోనియా గాం«దీకి ఈ భవనాన్ని కేటాయించారు. రాహుల్ ఎంపీ అయ్యాక తుగ్లక్ లేన్‌లోని 12వ నంబర్ బంగ్లాకు మకాం మార్చారు. 2023లో పరువునష్టం కేసులో అనర్హత వేటు పడటంతో తల్లి ఉండే జన్‌పథ్ బంగ్లాకు మారారు. అనర్హత వేటు తొలిగి, మళ్లీ ఎంపీ అయ్యాక కూడా రాహుల్ ఇక్కడే ఉంటున్నారు. -
కుండలు చేసే ఊరు
ప్రతి ఊరిలో కుండలు చేస్తారు. కాని కుండలు చేయడానికి మాత్రమే ఒక ఊరు ప్రసిద్ధం అయ్యింది.అదే తమిళనాడులోని ‘మనమదురై’.అక్కడ పారే వైగై నది తెచ్చే ఒండ్రు మట్టితో తయారయ్యే ఈ కుండలు చల్లదనానికి ప్రతీకలు. స్త్రీలు ఈ కుండల తయారీలో సరి సమాన శ్రమ చేస్తారు. ఘటాలు కూడా తయారు చేస్తారు. ఈ కుండల ప్రత్యేకత వల్ల వీటికి ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్’ (జిఐ) ట్యాగ్ దక్కింది. వేసవి రాగానే కుండలు గుర్తుకొస్తాయి. ప్రతి ఇంటిలో కుండలోని చల్లటి నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. ఫ్రిజ్‌లోని నీళ్లలో ఉండే కృత్రిమ చల్లదనం కుండ నీళ్లలో ఉండదు. అందుకే కొత్త కుండలు వేసవిలో ప్రతి ఇంటికి చేరుతాయి. చలివేంద్రాలు పెట్టేవారు పెద్ద పెద్ద కుండలు కొని దాహార్తి తీర్చి పుణ్యం కట్టుకుంటారు. పక్షులకు నీరు పెట్టాలనుకునేవారు మట్టి పాత్రల్లో నీళ్లు నింపి పెడతారు. ఒకప్పుడు పల్లెల్లో పాలకుండ, పెరుగు కుండ, నెయ్యి కుండ ఉండేవి. పెరుగు కుండలో తోడు పెడితే చాలా రుచి. స్టీలు, ప్లాస్టిక్ దెబ్బకు కుండలు కొన్నాళ్లు వెనుకబడినా మళ్లీ ఇప్పుడు ఆరోగ్యస్పృహ వల్ల పుంజుకున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక కుండలకు గిరాకీ తగ్గలేదు. వాటిలో మనమదురై కుండలు మరీ ప్రత్యేకం. కుండల ఊరు తమిళనాడులోని శివగంగ జిల్లాలోని చిన్న ఊరు మనమదురై. యాభై వేల జనాభా ఉంటుంది. ఇది మదురై నుంచి 60 కిలోమీటర్ల దూరం. ఇక్కడ పారే వైగై నది ఈ ఊరికి ఇచ్చిన అనుకోని వరం కుండలు తయారు చేయడానికి అవసరమైన ఒండ్రుమట్టి. నది ఒడ్డు నుంచి తెచ్చుకున్న ఒండ్రుమట్టి కాల్షియం లైమ్, బూడిద, సోడియం సిలికేట్, మాంగనీస్, ఐరన్ మిశ్రమాలను కలిపి కుండలు తయారు చేస్తారు. మనమదురై కుండను గుర్తించడం ఎలా అంటే దాని అడుగు పరిపూర్ణమైన గుండ్రంగా ఉంటుంది. అదే సమయంలో నేల మీద సరిగ్గా కూచుంటుంది. ఈ కుండల తయారీలో పంచభూతాలు ఉంటాయి అంటారు ఈ ఊరి వాళ్లు. నేల, నీరు, అగ్ని తయారీలో ఉపయోగిస్తే మట్టిలోని సూక్ష్మరంధ్రాలు గాలి రాకపోకలను సూచిస్తాయి. కుండ లోపలి ఖాళీ (శూన్యం) ఆకాశాన్ని సూచిస్తుంది. వేసవి కోసం ఇక్కడ విశేష సంఖ్యలు కుండలను స్త్రీ, పురుషులు కలిసి తయారు చేస్తారు. కుటుంబాలన్నీ కుండల మీదే ఆధారపడి బతుకుతాయి. వీటికి ఎంత డిమాండ్ ఉన్నా దూర్రపాంతాలకు పంపడం ఖర్చుతో, రిస్క్‌తో కూడుకున్న పని. కుండలు పగిలిపోతాయి. అందుకే స్థానికంగా తప్ప ఇవి ఎక్కువగా దొరకవు. ఘటం ఎలా తయారు చేస్తారు? మనమదురై కుండలకే కాదు ఘటాలకు కూడా ప్రసిద్ధి. నీరు పోస్తే కుండ. సంగీతం పలికిస్తే ఘటం. కాని అది సంగీతం పలికించాలంటే కొంచెం ప్రత్యేకంగా తయారు చేయాలి. మనమదురై ఘటాలు చాలా ప్రసిద్ధి. ఇక్కడ మీనాక్షి కేశవన్ అనే మహిళ ఘటాలు తయారు చేయడంలో ఖ్యాతి ΄÷ందింది. పెద్ద పెద్ద విద్వాంసులు ఆమె తయారు చేసిన ఘటాలనే వాయించేవారు. ఘటం తయారు చేయాలంటే కుమ్మరి చక్రంపై కుండ తయారయ్యాక ఒక రోజు ఉంచేస్తారు. మర్నాడు దానిని ప్రత్యేక చెక్కమెత్తతో మెత్తుతారు. ఒక పచ్చికుండ కాల్చడానికి ముందు ఘటంగా మారాలంటే ఆ కుండలోని ప్రతి అంగుళాన్ని మెత్తాలి. అలా 3000 సార్లు మెత్తి ఆ తర్వాత కాల్చుతారు. అప్పుడే ఘటం తయారవుతుంది. ఇది ఓపికతో కూడిన పని కాబట్టి స్త్రీలు ఎక్కువగా చేస్తారు. వీటి కోసం వేల కిలోమీటర్ల నుంచి వచ్చి కొనుక్కెళ్లేవారు ఉన్నారు. కుండలు చేసే కుటుంబాలు ఉన్నా ఘటాలు చేసే కుటుంబాలు అంతరించి పోతున్నాయని ఇటీవల సాంస్కృతిక, సంగీత అభిమానులు క్రౌడ్ ఫండింగ్ చేసి ఘటాల తయారీని పునరుద్ధరించేలా చూశారు. -
డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కుమ్మరిగా మారిన సివిల్ ఇంజనీర్
ఏదైనా సమస్య ఎదురైతే చాలామంది దాని నుంచి దూరంగా పారిపోవడానికి చూస్తారు. కొంతమంది మాత్రం సమస్యను అధిగమించేందుకు రకరకాల మార్గాలు వెదుకుతారు. అలా వెతికిన వారికి .. పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని చెబుతోంది సైమాషఫీ. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సైమా చేసిన ప్రయత్నం నేడు మరికొంతమందికి ఉపాధి కల్పించడంతోపాటు, కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తోంది. కశ్మీర్‌కు చెందిన 33 ఏళ్ల సైమాషఫీ జమ్ము అండ్ కశ్మీర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఎందుకో తనకి తెలియకుండానే మనసులో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. వాటి నుంచి ఎలాగైనా బయట పడాలని రకరకాలుగా ప్రయత్నించేది. ఒకరోజు చైనా తత్త్వవేత్త చెప్పిన ‘‘మట్టిని పాత్రగా మలిచినప్పటికీ, మనం ఏం కోరుకుంటామో దానితోనే ఆ పాత్రలోని శూన్యం నిండుతుంది’’ అన్న కొటేషన్ గుర్తుకొచ్చింది. దీంతో తన డిప్రెషన్‌ను కుండలో నింపాలని నిర్ణయించుకుంది సైమా. చిన్నప్పటి నుంచి మట్టి అంటే సైమాకు ఇష్టం. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు.. మట్టితో కుండలేగాక, బొమ్మలు కూడా తయారు చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్న వెంటనే మట్టి కుండల తయారీకి పూనుకుంది. కశ్మీరి వ్యాలీలో కుండల తయారీ శిక్షణ ఇచ్చేవారు లేరు. పైగా కుండల తయారీ, కుండలకు వేసే రంగులకు సైతం అధునాతన పద్ధతులను జోడించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. కుండల తయారీ ఒక కళే కాదు సంప్రదాయంలో భాగం. అది అంతరించకూడదు అనుకుని... కుండల తయారీకి ఎలక్ట్రిక్ చక్రం, గ్యాస్ బట్టీ తీసుకురావాలనుకుంది. కానీ కశ్మీర్‌లోయలో అవి ఎక్కడా దొరకలేదు. బెంగళూరులో శిక్షణ కుండల తయారీలో శిక్షణ తీసుకునేందుకు బెంగళూరు వెళ్లింది. అక్కడ కుండల తయారీలో క్రాష్ కోర్సు చేసి వివిధ ఆకారాల్లో కుండలు ఎలా తయారు చేయాలో నేర్చుకోవడంతోపాటు, కశ్మీరీలు వాడే సంప్రదాయ పాత్రల తయారీని సైతం నేర్చుకుని అధునాతన సాంకేతికత జోడించి కుండల తయారీని ప్రారంభించింది. రకరకాల కుండలను తయారు చేసి విక్రయిస్తూనే, మరోపక్క కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న కుండల తయారీ కేంద్రాలను సందర్శించి అనుభవం కలిగిన నిపుణులతో వర్క్‌షాపులు నిర్వహించేది. ఇలా కుండల తయారీలో సరికొత్త పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తోంది. వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కశ్మీరి కుండలను ఎలా పరిరక్షించుకోవాలో చెబుతోంది. తన కుండల తయారీ జర్నీ గురించి వివరిస్తూ... అందరిలో స్ఫూర్తి నింపుతోంది. ప్రభుత్వ సహకారంతో.. కశ్మీరీ సనాతన కుండల తయారీని కాపాడుతోన్న విషయం అక్కడి ప్రభుత్వానికి తెలియడంతో స్టేట్ హ్యాండీ క్రాఫ్ట్స్ విభాగం సైమాతో.. తన అనుభవాలను ఇతర కళాకారులకు చెబుతూ సలహాలు సూచనలు ఇప్పిస్తోంది. దీంతో కుండల పునరుద్ధరణకు మంచి స్పందన లభిస్తోంది. అంతేగాక నైపుణ్యం గల కళాకారుల డేటాను హస్తకళల శాఖాధికారులు సేకరిస్తున్నారు. సైమా గురించి తెలిసిన చాలామంది యువతీయువకులు కుండల తయారీ మొదలు పెట్టి ఉపాధి పొందుతున్నారు. -
అలా గిన్నిస్ రికార్డు ‘అల్లు’కుపోయారు
‘మనందరికీ ప్రత్యేకమైన ప్రతిభ, నైపుణ్యం ఉంటాయి. ఆ దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఏ పనీ చిన్నదీ కాదు, పెద్దదీ కాదు. చిన్న సూది, దారంతో నా ప్రయాణం మొదలైంది. ఇదే ఇప్పుడు నా చుట్టుపక్కల వారి జీవితాలను మార్చింది. మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. మీ అభిరుచిని అనుసరించండి. మీకు లభించే ప్రతి అవకాశాన్ని పొందండి. అపజయాలకు భయపడ కండి. అవి విజయానికి సోపానాలుగా భావించండి’ అంటున్నారు మాధవి. సీతంపేట (విశాఖ ఉత్తర): కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మహిళలు కూడా అద్భుతాలు సృష్టించగలరని, రికార్డులు క్రియేట్ చెయ్యగలరని నిరూపించారు అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలో నివసిస్తున్న మాధవి సూరిభట్ల. మాధవి స్థాపించిన ‘మహిళా మనోవికాస్’ సంస్థ ద్వారా తన వద్ద ఆన్లైన్లో శిక్షణ పొందిన 200 మంది మహిళలతో కేవలం మూడు నెలల్లో ఊలుతో 4,686 క్రోచెట్ క్యాప్స్ చేతి అల్లికతో తయారు చేసి.. ‘లార్జెస్ట్ క్రోచెట్ హ్యాట్స్, క్యాప్స్’ ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సాధించారు. ఒక గృహిణి సారధ్యంలో మరో 200 మంది మహిళల భాగస్వామ్యంతో రికార్డు సాధించి గిన్నిస్‌బుక్‌లో విశాఖ నగరానికి ఒక పేజీ సృష్టించారు. ఆమె సాధించిన గిన్నిస్ రికార్డుపై ఎంతోమంది మహిళలు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దీనికి ముందు మరో నాలుగు గిన్నిస్ రికార్డుల్లో మాధవి భాగస్వామ్యం కావడం విశేషం. అదే స్ఫూర్తితో తనెందుకు సొంతంగా గిన్నిస్ రికార్డు సాధించకూడదు అనే ఆలోచన విజయంవైపు నడిపించింది. రెండు పీజీలు చేసిన మాధవి వివాహం తర్వాత కొన్నాళ్లు హైదరా బాద్‌లో ఒక కంపెనీలో హెచ్ఆర్గా పనిచేశారు. భర్త వెంకట రామారావుకు ఆర్‌సీఎల్‌లో ఉద్యోగం కారణంగా పాతికేళ్ల క్రితం విశాఖలో స్థిరపడ్డారు. మాధవి దంపతులకు ముగ్గురు పిల్లలు. దీంతో కుటుంబ బాధ్యతలు చూసుకునేసరికే సమయం సరిపోయేది. అయినా తనలో ఉన్న ప్రతిభ తోటి మహిళలకు నేర్పాలన్న ఉద్దేశంతో మధు క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ పేరిట 2014లో మాధవి సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఎంతో మందికి ఊలుతో క్యాప్స్, స్వెట్టర్స్, శాలువాలు, స్కార్ఫ్, పోంచోస్, అలాగే చాక్లెట్స్, కేక్స్ తయారీ, న్యూస్ పేపర్‌తో అలంకరణ (పేపర్ క్విల్లింగ్) వస్తువులు ఇలా ఎన్నో అంశాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా పాండమిక్ సమయంలో మహిళా మనో వికాస్‌గా సంస్థ పేరును మార్చి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఉదయం రెండు బ్యాచ్‌లు, సాయంత్రం రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చేవారు. ఈ విధంగా దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది మహిళలు ఊలుతో పలు రకాల అల్లికలు నేర్చుకున్నారు. ఆ విధంగా సుమారు 350 మంది వరకు మనో వికాస్‌లో సభ్యులుగా చేరారు. నాలుగు గిన్నిస్ రికార్డుల్లో భాగస్వామ్యం... గతంలో నాలుగు గిన్నిస్ రికార్డుల సాధనలో మాధవి భాగస్వా మ్యం అయ్యారు. చెన్నైకు చెందిన సంస్థ ద్వారా 2017లో లార్జెస్ట్ స్కార్ఫ్ తయారీ, 2018లో స్ల్కప్చర్స్ తయారీ, 2019లో క్రిస్మస్ డెకరేషన్, 2020లో హనుమాన్ చాలీసా లక్ష గలార్చనలో ఆన్లైన్లో పాల్గొని గిన్నిస్ రికార్డులో భాగస్వామ్యం అయ్యారు. అదే స్ఫూర్తితో తనెందుకు రికార్డు సాధించకూడదు. నా వల్ల మరో నలుగురికి పేరు తేవాలన్న ఆలోచన కలిగింది. అదే తడువుగా మహిళా మనోవికాస్ సభ్యుల వద్ద తన ఆలోచన బయటపెట్టారు. దేశ విదేశాలలో తన వద్ద శిక్షణ పొందిన 200 మంది మహిళలు మాధవి ఆలోచనకు జత కలిశారు. గిన్నిస్ బుక్ ప్రతినిధిని మెయిల్ ద్వారా సంప్రదించారు. గిన్నిస్ రికార్డు సాధించాలంటే మూడు నెలల్లో వెయ్యి క్రోచెట్ క్యాప్స్(చేతితో అల్లిన ఊలు క్యాప్‌లు) తయారు చెయ్యాలని గిన్నిస్ ప్రతినిధులు జులై 2022లో లక్ష్యం నిర్దేశించారు. మూడు నెలల్లో 200 మంది మహిళలు ఏకంగా 4,686 క్రోచెట్ క్యాప్స్ తయారు చేసి ప్రదర్శనకు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 18న అక్కయ్యపాలెం మెయిన్రోడ్లో ఒక ఫంక్షన్ హాల్లో 4,686 క్యాప్స్‌తో ‘లార్జెస్ట్ క్రోచెట్ క్యాప్స్ ’ ప్రదర్శించారు. గిన్నిస్ బుక్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి రికార్డును ధ్రువీకరించి మాధవితో పాటు, భాగస్వా మ్యులైన 200 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ళు పైబడిన మహిళలు సైతం ఈ రికార్డు సాధనలో పాలు పంచుకున్నారు. ఒక్కొక్కరు 5 నుంచి 20 వరకు క్యాప్స్ తయారు చేశారు. (చదవండి: చంద్రబాబు పేకలో పవన్‌కల్యాణ్ జోకర్) -
చల్లకుండ
చింతూరు: ఇటీవల ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లో నిర్వహించే వారపు సంతల్లో ఛత్తీస్‌గఢ్‌లో తయారైన చలువ కుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ డిజైన్లలో ఎర్రగా కనిపించే ఈ కుండలు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. ప్రత్యేకమైన మట్టితో తయారయ్యే ఈ కుండల్లో పోసిన నీరు ఫ్రిజ్‌లో పెట్టిన మాదిరిగా ఉండడంతో వీటి కొనుగోళ్లుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మందంగా వుండే ఈ కుండలు ఎంతోకాలం మన్నడంతో పాటు నీటికి, వంటకు బాగా ఉపయోగ పడతాయని, అందుకే అధికశాతం వీటినే కొనుగోలు చేస్తామని వారు తెలిపారు. రూ .50 నుంచి రూ.700 వరకు ధర కలిగిన కుండలతో పాటు వివిధ రకాల బొమ్మలను కూడా సంతల్లో విక్రయిస్తున్నారు. ప్రత్యేక మట్టితో తయారీ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుకనార్‌లో ప్రత్యేకమైన మట్టితో ఈ కుండలను తయారు చేస్తామని తయారీదారుడు దసురాం తెలిపాడు. భూమి పైభాగంలో కేవలం రెండు అంగుళాల మేర లభించే ప్రత్యేకమైన మట్టిని ఈ కుండల తయారీకి వినియోగిస్తామని అతను తెలిపాడు. ఆ మట్టి జిగటగా ఉండడంతో పాటు గట్టిదనం కలిగి ఉంటుందని దీనివలన కుండలు అందంగా కనబడడంతో పాటు చాలాకాలం మన్నుతాయని తెలిపాడు. మట్టితో కుండలు తయారు చేసిన అనంతరం వాటికి ఎర్రరంగు అద్ది మార్కెట్లో విక్రయిస్తామని తెలిపాడు. తమ గ్రామంలో సుమారు వంద కుటుంబాలు కుండలు తయారు చేస్తున్నాయని, వాటిని ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్, సుక్మాతో పాటు ఆంధ్రా సరిహద్దుల్లోని సంతలు, తెలంగాణలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం వంటి పట్టణాల్లో విక్రయిస్తామని అతను తెలిపాడు. -
కుమ్మరి కులవృత్తిదారులకు సర్కారు చేయూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కుమ్మరి కులవృత్తిదారులకు చేయూతనందించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బీసీ కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొందిన 320 మందికి త్వరలో పాటరీ యూనిట్లు అందించనుంది. ఈ మేరకు బీసీ కార్పొరేషన్ వీసీఎండీ అలోక్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాటరీ యూనిట్‌లోని యంత్రాల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ యంత్రాలతో మట్టిపాత్రలు, కూజాలు, మట్టి వాటర్ బాటిళ్లు, టీ కప్పులు, మట్టి విగ్రహాలు, దీపాలు, ఇతరత్రా అలంకరణ సామాగ్రిని వేగంగా, వివిధ డిజైన్లతో రూపొందించడానికి వీలుంటుందని అలోక్‌కుమార్ వివరించారు. పాటరీ యంత్రాలను రూ.80 వేల రాయితీతో అందిస్తామని పేర్కొన్నారు. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గంలోని కుమ్మరి వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు ఆధునిక యంత్రాలను అందించనున్నట్లు వెల్లడించారు. -
మట్టికుండ.. సల్లగుండ
మియాపూర్: రోజు రోజుకూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉపశమనం కోసం ఎక్కువగా జనం దప్పిక తీర్చుకునేందుకు మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక సంఖ్యలో జనం ఆరోగ్యం పై శ్రద్ధ చూపుతూ సంప్రదాయ పద్ధతులను పాటిస్తున్నారు. ఇందులో భాగంగా మట్టి పాత్రలు, మట్టి కుండలలో వంటకాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మట్టి కుండలు, మట్టి పాత్రలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. రకరకాల డిజైన్‌న్లతో కుండలు ఆకర్షిస్తున్నాయి. టీ కప్పు నుంచి వాటర్ బాటిళ్లు, వంట పాత్రలు అందుబాటులోకి రావడంతో ఆరోగ్యానికి మేలు చేస్తోందని జనం వాటిని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. మట్టి కుండలలో సహజంగా చల్ల బరిచే ప్రత్యేకత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం అధికంగా ఉగాది పండుగకు పచ్చడి చేసేందుకు కొత్త కుండలు కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు గత పదిహేను రోజుల నుండి ఎండలు మండిపోతుండటంతో చల్లటి నీరు తాగేందుకు ముందుగానే మట్టి కుండలను విక్రయాలు చేస్తున్నారు. చందానగర్‌లోని గంగారం గ్రామంలో మట్టి కుండలు తయారు చేసి విక్రయాలకు సిద్ధంగా ఉంచారు. మట్టి కుండలలో నీరు తాగడం వలన శరీరానికి చల్లదనం కలగడంతోపాటు ఆరోగ్య పరంగా ఎంతో మంచిదని మన పూర్వీకులు చెప్పడమే కాకుండా డాకర్లు సైతం సూచిస్తున్నారు. టీ కప్పులు, వాటర్ జగ్లు, వంట పాత్రలు, రంజన్లు, కూజాలు, వాటర్ బాటిళ్లు వాటిలో మట్టితో చేసిన వస్తువులు వివిధ రకాల సైజులతో అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా మట్టి వస్తువుల పై రంగు రంగుల చిత్రాలు చిత్రీకరించి పలు రకాల డిజైన్లలో ఆకర్షణీయంగా తయారు చేస్తూవిక్రయిస్తున్నారు. ఎక్కువగా మట్టి పాత్రలను రాజస్థాన్, గుజరాత్, కోల్కత్తా నుండి పలు రకాల డిజైన్ల పాత్రలను తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నారు. వేసవిలో ప్రత్యేకంగా ఉపయోగించే కుండలకు ట్యాప్ ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. వాటికి గిరాకి ఉంది. -
కుమ్మరి కుండలో వరాల ధార
సాక్షి, గుంటూరు : సమాజంలో మనిషి అవసరాలను తెలుసుకొంటూ, వారికి కావాల్సిన వస్తువులకు రూపం ఇచ్చేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా కుమ్మర్ల కుల వృత్తిలో ఆటుపోట్లు తప్పడం లేదు. మట్టి నుంచి తమ చేతుల్లో ప్రాణంపోసుకున్న వస్తువులను కాల్చేందుకు అవసరమైన బొగ్గు వరకు అన్నింటి ధరలు పెరగడంతో వచ్చే ఆదాయం సరిపోక, వృత్తిని నమ్ముకోలేక.. ఇతర రంగాలకు మళ్లలేక సతమతమవుతున్నారు ఒకప్పుడు మట్టి కుండలకు విపరీతమైన ఆదరణ ఉండేది. రానురానూ వాటికి ఆదరణ తగ్గిపోతోంది. కుండను తయారు చేయటానికి గంట సమయమే పట్టినా, వాటిని వేడిచేసి ఆరబెట్టడం ఒక పెద్ద ప్రక్రియ. ఇప్పుడు దీపావళి, కార్తీకమాసంలో మినహా ప్రమిదలకు డిమాండ్ ఉండటంలేదు. మార్కెట్లో కుండలు అమ్ముకొనే పరిస్థితి లేకపోవటంతో వచ్చిన ధరకు టోకు వ్యాపారులకు ఇచ్చేస్తున్నారు. కొందరు గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. రోజుకు రూ.300లకు మించి ఆదాయం రావడంలేదని వాపోతున్నారు. వైఎస్ జగన్ హామీతో చిగురించిన ఆశలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో కుమ్మర్లకు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటితో కుమ్మర్ల జీవితాల్లో ఆశలు చిగురించాయి. కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నామినేటెడ్ పోస్టులతోపాటు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఐదు సంవత్సరాలలో రూ.75 వేల లబ్ధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిపై జిల్లాలోని 33 వేల కుమ్మర్ల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హామీలు విస్మరించిన టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కుమ్మర్లను ఓటు బ్యాంకుగా వాడుకొని వారికి ఇచ్చిన హామీలను విస్మరించింది. శాలివాహన కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తామని, కుమ్మర్లు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించి, సొంతగా విక్రయాలు జరుపుకొనేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, వృత్తి దార్లకు గుర్తింపు కార్డులు, విద్యార్థులకు రుణాలు, విదేశాల్లో చదువుకునే అవకాశం.. ఇలా ఎన్నో హామీలు గుప్పించింది. అయితే ఏ ఒక్కటీ అమలుకు నోచలేదు. ఆదరణ పథకం కింద కూడా ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదని కుమ్మర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు : 92,000 కుమ్మర్ల కుటుంబాలు : 32,500 కుమ్మర్ల జనాభా : 1,28,000 వృత్తి మీద ఆధారపడి జీవించేవారు : 9,000 వృత్తిపై రోజు వారి ఆదాయం : రూ.300 కుండలకు ఆదరణ లేదు గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కుండలకు ఆదరణ కూడా లేదు. అన్ని విధాలుగా రేట్లు పెరిగిపోయాయి. గతంలో రైతుల పొలాల్లో ఉచితంగానే మట్టి తవ్వుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రూ.3 వేలు ఇవ్వాల్సి వస్తోంది. నమ్ముకొన్న వృత్తిని వదులుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో కండలు తయారు చేయాల్సి వస్తోంది. – కొల్లిపాక అంజయ్య, మంగళగిరిపాడు సాహసోపేత నిర్ణయం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకొంది సాహసోపేత నిర్ణయం. బీసీ డిక్లరేషన్ వల్ల ఉన్నతంగా చదువుకోవాలనే విద్యార్థులకు కార్పొరేషన్ నుంచి సాయం అందటమే కాకుండా విదేశాల్లో విద్యనభ్యసించే వారికి బ్యాంకుల నుంచి రుణాలు పొందటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం బీసీల గురించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అది ఒక్క జగన్‌కే సాధ్యం. – డి.సాంబశివరావు, మంగళగిరిపాడు -
నర్మెటలో బయటపడిన మృణ్మయపాత్రలు
నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట వద్ద పురావస్తుశాఖ అధికారులు కొనసాగిస్తున్న తవ్వకాల్లో శుక్రవారం మృణ్మయ పాత్రలు బయట పడ్డాయి. ప్రాచీన మాన వుడు ఉపయోగించిన నాలుగు పాత్రలు, ఎరుపురంగు కౌంచ్ తో ఉన్న రెండు శంఖాలు, మట్టిపాత్రలు పెట్టుకునేందుకు రింగ్ స్టాండ్, నలుపురంగు పాత్ర లభించాయి. నక్షత్ర రాశులు, సంవత్సరంలో వచ్చే కాలాలను గుర్తించే విధంగా బండపై చెక్కిన ఆనవాళ్లను గుర్తించారు. పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి ఉపయోగించిన వస్తువులు, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు మట్టికుండల్లో ఉంచినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మెన్హీర్ వద్ద గుర్తించిన పెద్ద రాతి సమాధి సుమారుగా 40 టన్నుల వరకు బరువు ఉన్నట్లు అంచనా వేశామని అన్నారు -
యాంత్రీకరణలో కుదేలవుతున్న కుమ్మరి