pour kerosene
-
అత్యాచార యత్నం.. ఆపై నిప్పంటించి..
మద్దూరు: ఓ దివ్యాంగురాలికి మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ఆ యువతి ప్రతిఘటించడంతో నిప్పంటించి పారిపోయాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన దివ్యాంగురాలైన కృష్ణవేణి(21) కొన్నాళ్లుగా తల్లిదండ్రులు, మానసిక వికలాంగుడైన తమ్ముడుతో కలసి హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లిలో ఉంటోంది. తల్లిదండ్రులు వెంకటమ్మ, గోవిందు దినసరి కూలీలు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం వింజమూర్‌వాసి వెంకట్రాములు హైదరాబాద్‌లోనే కూలిపనులు చేసుకునేవాడు. భార్య వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణవేణి తో అతడికి పరిచయం ఏర్పడింది. ఈనెల 8న వెంకట్రాములు మాయమాటలు చెప్పి కృష్ణవేణిని తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేర కు రాజేంద్రనగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం కోస్గి పట్టణంలో గ్రామస్తులకు కనిపించడంతో హైదరాబాద్‌కు వెళ్తున్నామంటూ నమ్మించి మద్దూరుకు తీసుకొచ్చాడు. అదేరోజు సాయంత్రం గురుకుల పాఠశాల వెనకాల ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో చీరకు నిప్పంటించి పారిపోయాడు. మంటలు గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా శనివారం తెల్లవారుజామున బాధితురాలు మృతి చెందింది. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ యాదవ, వికలాంగ సంఘాల ఆధ్వర్యంలో మద్దూరులో ధర్నా నిర్వహించారు. -
కోడికూర తెచ్చిన తంటా!
చెన్నై : కోడికూర అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. కూర తక్కువగా వడ్డించడంలో గొడవ జరగడంతో అన్నపై తమ్ముడు కిరోసిన్ కుమ్మరించి నిప్పటించాడు. వివరాలు.. కారైకుడి సమీపానగల సూరైకుడి ప్రాంతానికి చెందిన రాజు భార్య మీనాళ్. వీరికి ప్రతాప్ (24), ప్రదీష్ (21) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రతాప్ అదే ప్రాంతంలోని సెలూన్ షాపులో పనిచేస్తున్నాడు. మద్యం అలవాటు ఉంది. మంగళవారం వారి ఇంట్లో కోడికూర చేశారు. మధ్యాహ్నం భోజనం చేసి వెళ్లిన ప్రతాప్ మళ్లీ రాత్రి భోజనం చేసేందుకు వచ్చాడు. ఆ సమయంలో అతనికి కోడికూర తక్కువగా వడ్డించినట్లు సమాచారం. దీంతో అతను ప్లేటును గాల్లోకి విసిరాడు. దీన్ని తమ్ముడు ప్రదీష్ నిలదీశాడు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. తర్వాత ప్రదీష్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన ప్రదీష్ వాకిట్లో నిద్రిస్తున్న ప్రతాప్‌పై కిరోసిన కుమ్మరించి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. తండ్రి రాజు, తల్లి మీనా, స్థానికులు బాధితుడిని కారైకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన సెట్టినాడు పోలీసులు, ప్రదీష్ కోసం గాలిస్తున్నారు. -
కడపునొప్పి భరించలేక.. నిప్పంటించుకున్న మహిళ మృతి
రంగారెడ్డి(చేవెళ్ల): కడుపునొప్పి భరించలేక ఓ తల్లి ఏడాది వయసున్న కొడుకు ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అది ప్రమాదమని తెలియని బాలుడు తల్లిని ముట్ట్టుకోవడంతో ఈ ఘటనలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కమ్మెట గ్రామానికి చెందిన వరలక్ష్మి (25), వడ్ల లింగచారి దంపతులు. వీరికి సాకేత్(1), రెండేళ్ల కిశోర్ సంతానం. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న వరలక్ష్మి మనస్తాపానికి గురై ఇంట్లో పెద్దకొడుకు, భర్త లేనప్పుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పక్కనే ఉన్న చిన్న కొడుకు తల్లిని పట్టుకోవడంతో మంటలు బాలుడికీ అంటుకున్నాయి. తల్లి కేకలు విని స్థానికులు వచ్చి చూసేసరికి ఇద్దరూ మృతి చెంది ఉన్నారు.