కడపునొప్పి భరించలేక.. నిప్పంటించుకున్న మహిళ మృతి | Woman killed her self not bare of stomach pain | Sakshi
Sakshi News home page

కడపునొప్పి భరించలేక.. నిప్పంటించుకున్న మహిళ మృతి

Published Tue, Aug 18 2015 7:47 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Woman killed her self not bare of stomach pain

రంగారెడ్డి(చేవెళ్ల): కడుపునొప్పి భరించలేక ఓ తల్లి ఏడాది వయసున్న కొడుకు ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అది ప్రమాదమని తెలియని బాలుడు తల్లిని ముట్ట్టుకోవడంతో ఈ ఘటనలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కమ్మెట గ్రామానికి చెందిన వరలక్ష్మి (25), వడ్ల లింగచారి దంపతులు. వీరికి సాకేత్(1), రెండేళ్ల కిశోర్ సంతానం.

కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న వరలక్ష్మి మనస్తాపానికి గురై ఇంట్లో పెద్దకొడుకు, భర్త లేనప్పుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పక్కనే ఉన్న చిన్న కొడుకు తల్లిని పట్టుకోవడంతో మంటలు బాలుడికీ అంటుకున్నాయి. తల్లి కేకలు విని స్థానికులు వచ్చి చూసేసరికి ఇద్దరూ మృతి చెంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement